మానవుల్లో వైరస్ వల్ల వచ్చే వ్యాధులు
పోలియో | |
» ఈ వ్యాధి ‘ఎంటిరోవైరస్’ లేదా ‘పోలియోవైరస్’ వల్ల సంక్రమిస్తుంది. |
|
» ఈగలు, కలుషిత ఆహారం, కలుషిత నీరు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి. | |
» ఈ వ్యాధి నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. | |
» పోలియోను ‘శిశు పక్షవాతం’ అని కూడా అంటారు. | |
» జూనాస్ సాల్క్ అనే శాస్త్రవేత్త పోలియో టీకాను కనుక్కున్నాడు. | |
» ఇంజక్షన్ ద్వారా తీసుకునే పోలియో టీకాను ‘సాల్వాక్’ అంటారు. | |
» నోటి ద్వారా తీసుకునే చుక్కల మందును ‘సాబిన్’ అంటారు. | |
» పోలియో వల్ల చాలకనాడులు నశించిపోయి కాళ్లూ, చేతులు చచ్చుబడిపోతాయి. | |
» 7 నుంచి 14 రోజుల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
వ్యాధి లక్షణాలు: తలనొప్పి, వాంతులు, వికారం, తీవ్రమైన జ్వరం, అతిసారం, పక్షవాతం. | |
జలుబు (రొంప) | |
» ‘రినో వైరస్’ అనే వైరస్ వల్ల ఇది సంక్రమిస్తుంది. | |
» దీనికి గాలి వాహకంగా పనిచేస్తుంది. | |
» దీనివల్ల ముక్కు తీవ్రంగా ప్రభావితమవుతుంది. | |
» వ్యాధి సోకిన వ్యక్తుల శ్వాసనాళాల నుంచి ఈ వైరస్ విడుదలవుతుంది. | |
» ఒకటి లేదా 2 రోజుల్లో ఇది సంక్రమిస్తుంది. | |
వ్యాధి లక్షణాలు: ముక్కు కారడం, తలనొప్పి, దగ్గు, కొద్దిగా జ్వరం రావడం. | |
మశూచి | |
» ఈ వ్యాధినే ‘స్మాల్‌పాక్స్ (Smallpox) ‘ లేదా ‘స్పోటకం’ అని అంటారు. | |
» ‘వరియొల వైరస్’ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
» మొత్తం శరీరం ఈ వ్యాధికి లోనవుతుంది. | |
» ప్రత్యక్ష స్పర్శ, రోగి వాడిన వస్తువులను వాడటం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
» ఎడ్వర్డ్ జెన్నర్ ఈ వ్యాధికి మొదటిసారిగా టీకా మందును కనిపెట్టాడు. | |
» మశూచిని భారత్‌లో పూర్తిగా నిర్మూలించారు. | |
వ్యాధి లక్షణాలు: | |
» అకస్మాత్తుగా లేదా క్రమంగా జ్వరం, తలనొప్పి, వెన్ను నొప్పి. | |
» ఈ వ్యాధి సోకిన మూడోరోజు శరీరం మీద ఎర్రని చిన్న గుల్లలు ఏర్పడి బొబ్బలుగా మారతాయి. | |
» చివరకు ఒకలాంటి ద్రవంతో పొక్కులుగా మారతాయి. ఈ పొక్కులు శరీరంపై గుంటలతో కూడిన మచ్చల్ని శాశ్వతంగా ఏర్పరుస్తాయి. | |
రేబిస్ | |
» ఈ వ్యాధి వల్ల ‘జల భీతి’ కలుగుతుంది. అందువల్ల దీన్ని ‘జల భీతి’ వ్యాధి అని కూడా అంటారు. | |
» ‘రేబిస్ వైరస్’ అనే వైరస్ వల్ల సంక్రమిస్తుంది. | |
» రేబిస్ వైరస్‌నే ‘రాబ్డో వైరస్’ అని కూడా అంటారు. | |
» కుక్క కాటు ద్వారా ఈ వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. | |
» 2 నుంచి 16 వారాల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కొన్ని సందర్భాల్లో మరింత ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. | |
వ్యాధి లక్షణాలు: | |
» తలనొప్పి, జ్వరం, నీటిని చూస్తే భయం, వణుకు, పక్షవాతం, వాంతులు, గొంతు వాపు. | |
» ఈ వ్యాధి నివారణకు ‘యాంటీ రేబిస్’ అనే మందును ఇస్తారు. | |
» యాంటీ రేబిస్‌ను లూయీపాశ్చర్ కనుక్కున్నాడు. | |
» ఈ వ్యాధి నివారణకు వాడే మరో మందు ‘రేబీపోల్’. | |
డెంగ్యూ | |
» ఈ వ్యాధిని ఎల్లో ఫీవర్, బ్రేక్ ఫీవర్, బోన్ ఫీవర్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. | |
» డెంగ్యూ వైరస్ (ఆర్బో వైరస్) ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
» పగటి పూట కుట్టే ‘ఎడిస్ ఈజిప్టు’ అనే దోమకాటు ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. | |
» ఈ వ్యాధి వల్ల రక్తఫలకికల సంఖ్య తీవ్రంగా తగ్గిపోతుంది. | |
» 4 నుంచి 8 రోజుల్లో వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ వ్యాధి వస్తుంది. | |
» కీళ్లు, చర్మం ఈ వ్యాధి ప్రభావానికి గురవుతాయి. | |
వ్యాధి లక్షణాలు: | |
» తీవ్ర జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి, కొన్ని రోజుల పాటు చర్మం మీద చిన్న చిన్న గుల్లలు ఈ వ్యాధి వల్ల ఏర్పడి అలాగే ఉండిపోవడం. | |
గవద బిళ్లలు (మంప్స్) | |
» ‘పారా మిక్సో వైరస్’ అనే వైరస్ వల్ల ఇవి సంక్రమిస్తాయి. | |
» లాలాజలంలోని, చీమిడిలోని వైరస్ శరీరంలోకి ప్రవేశించి లాలాజల గ్రంథుల మీద దాడిచేస్తుంది. | |
» ప్రత్యక్ష స్పర్శ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. | |
» 12 నుంచి 21 రోజులు ఈ వ్యాధి సంక్రమించడానికి పడుతుంది. | |
» గొంతు, మెడ, దవడలు ప్రభావానికి గురవుతాయి. | |
» ఈ వ్యాధికి ఎక్కువగా దవడలు ప్రభావితమవుతాయి. | |
» ఈ ప్రభావమనేది 7 నుంచి 10 రోజుల పాటు ఉంటుంది. | |
వ్యాధి లక్షణాలు: చెవుల దగ్గర, దవడల దగ్గర లాలాజల గ్రంథులు వాయడం. | |
తట్టు (మీజిల్స్ లేదా పొంగు) | |
» ‘పారా మిక్సోవైరస్’ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
» మాట్లాడేటప్పుడు, దగ్గేటప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. | |
» వ్యాధి సంక్రమించడానికి 10 నుంచి 14 రోజుల సమయం పడుతుంది. | |
» చర్మం ఈ వ్యాధి ప్రభావానికి గురవుతుంది. | |
» ఈ వ్యాధి నివారణకు MMR (Measles, Mumps, Rubella) వ్యాక్సిన్ ఇస్తారు. | |
వ్యాధి లక్షణాలు: | |
» జలుబు, జ్వరం, తలనొప్పి, తుమ్ములు, చర్మంపై చిన్న చిన్న ఎర్రని గుల్లలు ఏర్పడటం. | |
» వ్యాధి సోకిన 4 రోజుల తర్వాతే ఈ ఎర్రని గుల్లలు ఏర్పడతాయి. | |
చికెన్ ఫాక్స్ (అమ్మవారు) (ఆటలమ్మ) | |
» ‘వెరిసెల్లా వైరస్’ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
» చర్మం ఈ వ్యాధి ప్రభావానికి గురవుతుంది. | |
» తుంపర్ల ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. | |
» వ్యాధి సంక్రమణకు 2 నుంచి 5 రోజులు పడుతుంది. | |
వ్యాధి లక్షణాలు: | |
» జలుబు, జ్వరం, తలనొప్పి, చర్మంపై చిన్న చిన్న ఎర్రని గుల్లలు ఏర్పడటం. | |
» ఏర్పడిన గుల్లలు 5 నుంచి 20 రోజుల లోపల రాలిపోతాయి. | |
» వైరస్ సోకిన 36 గంటల్లో గుల్లలు ఏర్పడతాయి. | |
మెదడువాపు వ్యాధి (జపనీస్ ఎన్సెఫలైటిస్) | |
» ‘ఎన్సెఫాలిటిస్ (ఆర్బో వైరస్) వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
» ఆడ క్యూలెక్స్ దోమ పందిని కుట్టి, మనిషిని కుడితే ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. | |
» 4 నుంచి 21 రోజుల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
» మెదడు ఈ వ్యాధి ప్రభావానికి గురవుతుంది. | |
» బెల్లడోనా మందును ఈ వ్యాధి చికిత్సకు వాడతారు. | |
వ్యాధి లక్షణాలు: | |
» అకస్మాత్తుగా జ్వరం, తలనొప్పి, వాంతులు, మత్తుగా ఉండటం, మెడ బిగుసుకుపోవడం, వెన్నునొప్పి. మానసిక అస్థిరత్వం. | |
» ఈ వ్యాధి వల్ల అంధత్వం, చెవుడు, పక్షవాతం, మనోవైకల్యం లాంటి దుష్ఫలితాలు సంభవిస్తాయి. | |
చికున్ గున్యా | |
» ‘ప్లావీ వైరస్ (ఆల్ఫా వైరస్)’ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
» ప్లావీ వైరస్‌నే ‘చిక్ వైరస్’ లేదా ‘CK వైరస్’ అని కూడా అంటారు. | |
» ఈ వ్యాధిని మొదటగా టాంజానియా (ఆఫ్రికా)లో గుర్తించారు. | |
» ‘ఎడిస్ ఈజిప్టి’ అనే దోమ కాటు వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
» ఆఫ్రికాలో ‘మాకొండే’ అనే భాషలో, కెన్యాలోని ‘స్వాహిలీ’ అనే భాషలో చికున్ గున్యా అంటే వంగి నడవటం అని అర్థం. | |
వ్యాధి లక్షణాలు: | |
» జ్వరం, కీళ్ల నొప్పులు, కీళ్ల మధ్య వాపులు, కండరాల వాపులు | |
హెపటైటిస్ | |
» ‘హెపటైటిస్-బి’ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
» ‘హెప’ అంటే కాలేయం అని అర్థం. | |
» ఇది కాలేయానికి వచ్చే వ్యాధి. | |
» మొదటిసారిగా హైదరాబాద్‌లోని శాంతా బయోటెక్ అనే సంస్థ ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను కనిపెట్టింది. | |
» వ్యాక్సిన్ పేరు ‘శాన్వాక్స్’. | |
వ్యాధి లక్షణాలు: | |
» జ్వరం, వికారం, పచ్చకామెర్లు, కాలేయంలో వాపు. | |
ఇన్ఫ్లుయెంజా (ఫ్లూ) | |
» ‘ఆర్థోమిక్సో వైరస్’ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
» ఈ వ్యాధికి గాలి వాహకంగా పనిచేస్తుంది. | |
» కండరాలు, గొంతు, ఊపిరితిత్తులు ఈ వ్యాధి ప్రభావానికి గురవుతాయి. | |
» 1, 2 రోజుల్లోనే ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
వ్యాధి లక్షణాలు: | |
» జ్వరం, కండరాల నొప్పి, గొంతు పుండు పడటం, పొడి దగ్గు. | |
» ఈ వ్యాధి ప్రభావంతో ఊపిరితిత్తుల మీద బ్యాక్టీరియా దాడి చేస్తుంది. ఇది ‘న్యూమోనియా’కు దారితీసే అవకాశముంది. | |
హెర్పెస్ సింప్లెక్స్
|
|
» ‘హెర్పెస్ సింప్లెక్స్’ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
» లాలాజలం, మలం, కలుషితమైన వస్తువులు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి. | |
వ్యాధి లక్షణాలు: | |
» చర్మంపై, శ్లేష్మపటలంపై అక్కడక్కడా బొబ్బల్లాంటి గుల్లలు. | |
ఎయిడ్స్ | |
» AIDS – Acquired Immuno Deficiency Syndrome | |
» AIDSను కలుగచేసే వైరస్ HIV. | |
» HIV విస్తరణ రూపం Human Immuno Deficiency Virus. | |
» హ్యూమన్ టి సెల్ (ల్యూకేమియా వైరస్/రెట్రో వైరస్) ఈ వ్యాధికి కారకాలు. | |
» లైంగిక సంబంధాలు, రక్తం, సిరంజీలు ఈ వ్యాధి సంక్రమించడానికి దోహదం చేస్తాయి. | |
» రోగ నిరోధక వ్యవస్థపై ఈ వ్యాధి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. | |
» HIV వైరస్‌ను 1983లో ‘ల్యూక్ మాంటెగ్నర్’ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. | |
» ఈయన ఫ్రాన్స్ దేశస్థుడు. | |
» ఈ వైరస్‌కు ఆయన పెట్టిన పేరు: LAV – 2 | |
» LAV – 2 విస్తరణ రూపం: Lymphadenopathy Associated Virus – 2 | |
» 1984లో అమెరికాకు చెందిన ‘రాబర్ట్ గాలో’ అనే శాస్త్రవేత్త ఇదే వైరస్‌ను కనిపెట్టాడు. | |
» ఈ వైరస్‌కు ఆయన పెట్టిన పేరు ‘HTLV-III’. | |
» ‘HTLV – III’ విస్తరణ రూపం Human T-Cell Lympotropic Virus-III. | |
» ప్రపంచంలోనే మొదటిసారిగా మానవుల్లో ఈ వ్యాధిని 1981లో అమెరికాలో కనుక్కున్నారు. | |
» మన దేశంలో మొదటిసారిగా ఈ వ్యాధిని 1986లో చెన్నైలో కనుక్కున్నారు. | |
» 1987లో హైదరాబాద్‌లో ఈ వ్యాధి కేసు మొదటిసారిగా నమోదైంది. | |
» ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న దేశం దక్షిణాఫ్రికా. | |
» భారత్‌లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. | |
» ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న జిల్లా గుంటూరు. | |
» ఈ వ్యాధి లక్షణాలు వ్యాధిని సోకిన తర్వాత 3-5 సంవత్సరాల మధ్యలో కనిపిస్తాయి. | |
» 20-49 సంవత్సరాల వయసువారే ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. | |
» ఎయిడ్స్ / HIV వ్యాధి ఉన్న స్త్రీ గర్భం దాల్చితే పుట్టే శిశువుకు కూడా HIV సంక్రమిస్తుంది. | |
» పుట్టే శిశువుకు ఈ వైరస్ సోకకుండా వైద్యుడి పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. | |
» HIV వైరస్ రిట్రో విరిడే అనే కుటుంబానికి చెందింది. | |
» HIV ఉన్న RNA ‘రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్’ అనే ఎంజైమ్‌ను కలిగి ఉంటుంది. | |
వ్యాధి లక్షణాలు: | |
» పదేపదే జ్వరం రావడం, తరచుగా విరేచనాలు, దగ్గు, న్యూమోనియా, రక్త నాళాలు చిట్లడం, బరువు విపరీతంగా తగ్గిపోవడం, చర్మ వ్యాధులు, రాత్రిపూట తీవ్రమైన చెమటలు పట్టడం, లింఫ్ గ్రంథుల్లో వాపు. | |
» ఈ వ్యాధి రోగ నిరోధక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం చూపిందో ‘సీడీ – 4’ కణాల సంఖ్యను బట్టి తెలుసుకోవచ్చు. | |
» ఆరోగ్యవంతమైన మానవుడిలో సీడీ – 4 కణాల సంఖ్య ప్రతి మిల్లీమీటరుకు రక్తంలో 500 నుంచి 1500 వరకు ఉంటాయి. | |
» HIV వైరస్ తరచూ తన రూపాన్ని మార్చుకుంటుంది. అందుకే మందు తయారుచేయడమనేది కష్టసాధ్యమౌతోంది. | |
» ఎయిడ్స్‌ను నిర్ధారించడానికి చేసే పరీక్షలు: i) ELISA ii) WESTERN BLOT TECHNIQUE iii) TRIDOT TEST iv) PCR వీటిల్లో ఏ ఒక్క పరీక్ష ద్వారానైనా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. |
|
» ELISA విస్తరణ రూపం Enzyme Linked Immuno Sorbent Assay. | |
» PCR విస్తరణ రూపం Polymerase Chain Reaction. | |
» HIV పరీక్షను వేగవంతంగా, సులభంగా చేయడానికి అమెరికాలో కొలంబియా విశ్వవిద్యాలయంలో ‘శామ్యూల్ కెంసియా’ అనే శాస్త్రవేత్త ఎం.చిప్ అనే పరికరాన్ని కనుక్కున్నారు. | |
» ఎం.చిప్ పరికరం ద్వారా ఒకే ఒక్క రక్తపు చుక్కతో 15 నిమిషాల్లో HIV స్థితిని తెలుసుకోవచ్చు. | |
» ELISA పరీక్ష కంటే 10 రెట్ల వేగంతో ఎం.చిప్ పరికరం పనిచేస్తుంది. | |
» HIV బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న చికిత్స ART. | |
» ART విస్తరణ రూపం Anti Retro Virus Therapy. | |
» ART చికిత్సలో ఇచ్చే మందులు జిడోవుడెన్ (ZDV), అజిటో థయమిన్ (AZT), డైడి ఆక్సీ సైటిడిన్ (DDC). | |
» 1992లో భారత ప్రభుత్వం ఎయిడ్స్ నివారణకు, నియంత్రణకు NACO అనే సంస్థను స్థాపించింది. | |
» NACO విస్తరణ రూపం National Aids Control Organisation. | |
» ఆంధ్రప్రదేశ్‌లో ‘AASHA’ అనే పథకం అమల్లో ఉంది. | |
హెర్పెస్ జోస్టర్ | |
» ‘హెర్పెస్ జోస్టర్’ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
» నోటి తుంపరలు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి. | |
» 7 నుంచి 14 రోజులు ఈ వ్యాధి సంక్రమణకు పడుతుంది. | |
వ్యాధి లక్షణాలు: | |
» చర్మంపై బొబ్బలు, చర్మం లేదా శ్లేష్మపటలంలో తీవ్రమైన బాధ, జ్వరం, నోటిలో పుండ్లు ఏర్పడటం. | |
స్వైన్ ఫ్లూ | |
» H1N1 అనే వైరస్ వల్ల ఇది సంక్రమిస్తుంది. | |
» H1N1 అనేది ఇన్ఫ్లుయెంజా వైరస్ రకం. | |
» ‘స్వైన్’ అనే జాతి పందుల ద్వారా ఈ వైరస్ వెలువడుతుంది. అందువల్ల దీనికి ‘స్వైన్ ఫ్లూ’ అనే పేరు పెట్టారు. | |
» ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుంది. | |
» మొదట పందుల నుంచి మనిషికి సంక్రమించి ఆ తర్వాత మనిషి నుంచి మనిషికి త్వరితగతిన సంక్రమిస్తుంది. | |
»ఈ వ్యాధి మెక్సికో, లాటిన్ అమెరికా దేశాలకు మాత్రమే పరిమితమైనప్పటికీ ఇప్పుడు దాదాపుగా అన్ని దేశాలకు వ్యాపించింది. | |
» ఈ వ్యాధి చికిత్సకు ‘టామీ ఫ్లూ’ అనే మందును వాడతారు. | |
వ్యాధి లక్షణాలు: | |
» చలి, జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, ఛాతీ నొప్పి, ముక్కులో నుంచి రక్తం కారడటం, తీవ్రమైన జలుబు. | |
బర్డ్ ఫ్లూ | |
» H5N1 అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
» ఈ వ్యాధి అతి వేగంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది. | |
» ఈ వ్యాధి ఎక్కువగా పక్షులకు, కోళ్లకు వస్తుంది. | |
» మానవుల్లో ఈ వ్యాధి రావడం అరుదు. | |
» హాంకాంగ్‌లో ఈ వైరస్‌ను 1997లో మానవుల్లో గుర్తించారు. | |
SARS | |
» SARS విస్తరణ రూపం Severe Acute Respiratory Syndrome. | |
» కరోనా వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. | |
» ఈ వ్యాధిని ‘మృత్యుకారక న్యూమోనియా’ అని కూడా అంటారు. | |
» ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. | |
» న్యూమోనియా కూడా ఊపిరితిత్తులకు సంబంధించిందే. కానీ మరణం సంభవించదు. కానీ SARS వల్ల ప్రాణపాయం ఉంటుంది. | |
వ్యాధి లక్షణాలు: | |
» జ్వరం, తలనొప్పి, దగ్గు. | |
» ఈ వ్యాధిని మొదటగా చైనాలో గుర్తించారు. | |
» ఈ వ్యాధి వల్ల గతంలో కెనడాలో అనేకమంది మరణించారు. |