100+ మానవుల్లో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు AP GK Questions in Telugu

మానవుల్లో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు

న్యూమోనియా
» ఈ వ్యాధి ‘డిప్లోకోకస్ న్యూమోనియా’ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.
» బ్యాక్టీరియా ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లోకి ప్రవేశిస్తుంది.
» దీనికి గాలి ప్రధాన వాహకంగా పనిచేస్తుంది.
వ్యాధి లక్షణాలు: ఛాతీలోనూ, పొత్తి కడుపులో నొప్పి; చలి, కామెర్లు, ఎగశ్వాస.
ధనుర్వాతం
» ఇది ‘క్లాస్ట్రీడియమ్ టెటాని’ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.

 

» ఈ వ్యాధిని ‘టెటానస్’ అని కూడా అంటారు.
» తుప్పు పట్టిన మేకులు, తీగలు శరీరానికి గుచ్చుకున్నా లేదా గీసుకున్నా.. ఈ వ్యాధి జనకాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
» శరీరంపై ఏర్పడిన గాయాల ద్వారా కూడా ఈ వ్యాధి జనకాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
» కండరాలు, నరాలు ఈ వ్యాధికి గురవుతాయి.
వ్యాధి లక్షణాలు:
» కండరాలు ముడుచుకొనిపోతాయి. నరాల తీపులు, శరీరం విల్లు ఆకారంలో వంగుతుంది.
» వ్యాధి సంక్రమణ కాలం 2 నుంచి 40 రోజుల వరకు ఉంటుంది.
కలరా
» ఇది ‘విబ్రియో కలరా’ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.

 

» ఈగలు, దోమలు, కలుషిత ఆహారం, నీరు, మలం …… వ్యాధి వాహకాలుగా పనిచేస్తాయి.
వ్యాధి లక్షణాలు:
» వాంతులు, నీళ్ల విరేచనాలు, మూత్రం ఆగిపోవడం, కండరాల నొప్పులు, కళ్లు మండటం.
» ఈ వ్యాధి వల్ల డీహైడ్రేషన్ ఎక్కువగా జరుగుతుంది.
» డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఓఆర్ఎస్ (ORS: Oral Rehydration Solution) ద్రావణాన్ని ఇస్తారు.
» వ్యాధి సంక్రమణ కాలం 1 – 2 రోజులు మాత్రమే ఉంటుంది.
కుష్ఠు (లెప్రసీ)
» ఇది ‘మైకో బ్యాక్టీరియమ్ లెప్రె’ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.
» ఈ వ్యాధిని హాన్‌సన్ వ్యాధి అని కూడా అంటారు.
» వ్యాధి సోకిన వ్యక్తులతో దీర్ఘకాలం సన్నిహితంగా ఉండటం వల్ల కూడా సంక్రమిస్తుంది.
» వివిధ శరీర అవయవాలు ఈ వ్యాధి వల్ల ప్రభావితమవుతాయి.
వ్యాధి లక్షణాలు:
» కణుపులు, వేళ్లు, పాదాలు వంకరపోవడం; పుండ్లు ఏర్పడటం, చర్మంపై మచ్చలు రావడం, స్పర్శ లేకపోవడం, చేతి, కాలివేళ్ల కండరాలు ఊడిపోయి రక్తస్రావం జరుగుతుంది.
» హిస్టమైన్ పరీక్ష ద్వారా నాడుల క్షీణతను గుర్తించి కుష్ఠును అంచనా వేస్తారు.
» ప్రస్తుతం ‘ఫ్లోరోసెంట్ లెప్రసీ యాంటీబాడీ ఎబ్‌జాస్టన్’ పరీక్ష ద్వారా నిర్ధారిస్తున్నారు.
» ఎండీటీ (మల్టీ డ్రగ్ థెరపీ) ద్వారా దీన్ని నివారించవచ్చు.
» భారత ప్రభుత్వం 1955లో ‘జాతీయ కుష్ఠు నియంత్రణ కార్యక్రమం’ను చేపట్టింది.
» ఫాంపిసిన్ డాప్‌సోన్, క్లోఫజిమైన్ లాంటి మందులు వాడటం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.
క్షయ (టీబీ)
» ఇది ‘మైకో బ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్’ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.

 

» గాలి, ఈగలు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.
» ప్రత్యక్ష స్పర్శ, పాలు, కలుషిత ఆహారం ద్వారా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» ఊపిరితిత్తులు ఈ వ్యాధి బారిన పడతాయి.
వ్యాధి లక్షణాలు:
» సాయంత్ర సమయంలో జ్వరం, శ్లేష్మంతో కూడిన దగ్గు, అలసట, బరువు తగ్గడం, దగ్గినప్పుడు కళ్లె (తెమడ) రావడం.
» వ్యాధి సోకిన భాగాన్ని బట్టి వ్యాధి లక్షణాలు మారతాయి.
» ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O.) నివేదిక ప్రకారం ఈ వ్యాధి ద్వారా జరిగే మరణాలు ఎక్కువగా ఉన్నాయి.
» ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఈ మరణాలు ఎక్కువ.
» చిన్నపిల్లల్లో ఈ వ్యాధి రాకుండా BCG (Bacillus Calmette Guerin) టీకాను ఇస్తారు.
» ఈ వ్యాధి నిర్ధారణకు ‘మాంటెక్స్’ పరీక్ష చేస్తారు.
» క్షయ వ్యాధికి DOTS (Directly Observed Treatment Short Course) చికిత్స చేస్తారు.
» 1962లో భారత ప్రభుత్వం ఈ వ్యాధి నివారణకు NTCP (National Tuberculosis Control Programme)ను చేపట్టింది.
» అదే విధంగా 1997లో RNTCP (Revised National Tuberculosis Control Programme)ను చేపట్టింది.
డిఫ్తీరియా
» ‘కార్ని బ్యాక్టీరియా’ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» ఇది గొంతుకు వచ్చే వ్యాధి. అందువల్ల దీన్ని ‘అంగుడు వాపు’ వ్యాధి అని కూడా అంటారు.
» ప్రత్యక్ష స్పర్శ, కలుషిత ఆహారం, గాలి, బ్యాక్టీరియా సోకిన శ్వాసనాళం నుంచి వచ్చే తుంపరలు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.
వ్యాధి లక్షణాలు:
» జ్వరం, వాంతులు, గొంతులో గాయం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతులో బూడిద రంగు త్వచం ఏర్పడటం.
» వ్యాధి సంక్రమణ కాలం ఒకటి నుంచి 7 రోజులు.
» ఈ వ్యాధి నివారణకు ‘షీక్ టెస్ట్’ చేస్తారు.
టైఫాయిడ్
» ఇది ‘సాల్మొనెల్లా టైఫీ’ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.

 

» దీన్ని ‘ఎంటరిక్ జ్వరం’ అని కూడా అంటారు.
» ఈగలు, కలుషిత ఆహారం, కలుషిత నీరు, కలుషిత పాలు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.
» ముఖ్యంగా ఈగలు వ్యాధి జనకాల్ని మోసుకొచ్చి ఆహారం, నీటిని కలుషితం చేస్తాయి.
» కలుషిత పాల ద్వారా ఈ వ్యాధి ఎక్కువగా సంక్రమిస్తుంది.
» ముఖ్యంగా పేగులు, తర్వాత మొత్తం శరీరం ఈ వ్యాధికి ప్రభావితమవుతాయి.
» ఈ వ్యాధి నిర్ధారణకు ‘వైడల్ టెస్ట్’ను జరుపుతారు.
» సంక్రమణ కాలం 10 నుంచి 14 రోజులు.
» ఈ వ్యాధి రాకుండా ఇచ్చే వ్యాక్సిన్: TAB (Typhoid – Paratyphoid A & B Vaccine)
» సల్ఫాడ్రగ్స్, క్లోరోమైసిటిన్ అనే మందుల్ని ఈ వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తారు.
వ్యాధి లక్షణాలు: జ్వరం, వికారం, వాంతులు, విపరీతమైన పొత్తికడుపు నొప్పి, ఉదాసీనత, విరేచనాలు.
కోరింత దగ్గు
» ఇది ‘హెమోఫిల్లస్ పెర్టుసిస్’ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.
» ఈ బ్యాక్టీరియాలు గాలి ద్వారా వ్యాపిస్తాయి.
» తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బ్యాక్టీరియాలు గాలిలోకి ప్రవేశిస్తాయి.
» వ్యాధి సంక్రమణ కాలం 7 నుంచి 14 రోజులు.
» ఈ వ్యాధిని పెర్టుసిస్ అని కూడా అంటారు.
» శ్వాసనాళం, గొంతు ఈ వ్యాధి వల్ల ప్రభావితమవుతాయి.
వ్యాధి లక్షణాలు:
» చలి, పొడి దగ్గు, ఆ తర్వాత తీవ్రమైన దగ్గు, శ్వాస పీల్చిన తర్వాత ఎడతెరిపి లేకుండా దగ్గురావడం, ఎగశ్వాస.
» దగ్గు ఎక్కువగా వస్తూ దగ్గు చివరిలో ‘ఊఫ్’ అనే శబ్దం రావడం వల్ల దీన్ని ‘Whooping cough’ అంటారు.
గనేరియా
» ‘డిప్లోకోకస్’ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» డిప్లోకోకస్ బ్యాక్టీరియాను ‘నిస్సేరియా గనేరియా’ అని కూడా అంటారు.
» లైంగిక సంబంధం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. దీన్నే కోడ్ భాషలో STD (Sexually Transmitted Disease) అంటారు.
» వ్యాధి సంక్రమణ కాలం 2 నుంచి 8 రోజులు.
» జననావయవాలు ఈ వ్యాధి బారిన పడతాయి.
వ్యాధి లక్షణాలు:
» జననాంగాలు ఎరుపెక్కడం లేదా వాయడం, జననాంగాలపై పుండ్లు లేదా ఏర్పడిన పుండ్ల నుంచి చీము కారడం, మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట రావడం ఈ వ్యాధి లక్షణాలు.
సిఫిలిస్
» ‘ట్రిపోనిమా పల్లిడమ్’ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» ట్రిపోనిమా పల్లిడమ్ అనేది సర్పిలాకారంలో ఉండే సూక్ష్మజీవి.
» ప్రధానంగా లైంగిక చర్యల ద్వారా సంక్రమిస్తుంది. కానీ ప్రత్యక్ష స్పర్శ ద్వారా కూడా సంక్రమిస్తుంది.
వ్యాధి లక్షణాలు:
» జననావయవాలపై గట్టి పుండ్లు ఏర్పడటం లేదా ఎర్రటి గుల్లలు ఏర్పడతాయి. చర్మంపై తీవ్రమైన బొబ్బలు ఏర్పడతాయి.
» జననావయవాలు ఈ వ్యాధివల్ల ప్రభావానికి గురవుతాయి.
» కణజాల ధ్వంసం కూడా సంభవిస్తుంది.
» వ్యాధి సంక్రమణకు 10 నుంచి 90 రోజులు పడుతుంది.
» వ్యాధి నిర్ధారణకు VDRL (Venerial Disease Research Lab) పరీక్ష చేస్తారు.
మెనింజైటిస్
» ‘నిస్సెరా మెనింజైటిస్’ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» కలుషిత నీరు ఈ వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది.
» ఈ వ్యాధి వల్ల మెదడు, వెన్నుపాము ప్రభావితమవుతాయి.
గొంతు పుండు
» ఈ వ్యాధిని ‘థ్రోట్ ఇన్‌ఫెక్షన్’ అని కూడా అంటారు.
» ‘స్ట్రెప్టోకోకస్’ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» ఈ బ్యాక్టీరియా సోకిన గొంతు నుంచి నోటి ద్వారా వెలువడే తుంపర్లు ఈ వ్యాధికి వాహకంగా పని చేస్తాయి.
» ముక్కు పొరల నుంచి కూడా ఈ బ్యాక్టీరియా వెలువడి వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది.
» వ్యాధి సంక్రమణకు 3 నుంచి 5 రోజులు పడుతుంది.
» ఈ వ్యాధికి గొంతు, ముక్కు ప్రభావితమవుతాయి.
వ్యాధి లక్షణాలు: గొంతు పుండు పడటం; తరచుగా దగ్గు, జ్వరం రావడం.
బొటులిజం
» ‘క్లాస్ట్రీడియం బొటులినమ్’ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

 

» కలుషిత ఆహారం ఈ వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది.
» జీర్ణాశయం ఈ వ్యాధి బారిన పడుతుంది.
» ఈ వ్యాధి సంక్రమణకు 18 నుంచి 66 గంటలు మాత్రమే పడుతుంది.
వ్యాధి లక్షణాలు: వాంతులు, విరేచనాలు, వికారం, అలసట, అతిసారం, దృష్టి లోపాలు, పక్షవాతం.
ఆంథ్రాక్స్
» ‘బాసిల్లస్ ఆంథ్రాసిస్’ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» పశువుల పాలు, మాంసం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» ఈ వ్యాధి నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది.
ప్లేగు
» ఈ వ్యాధిని ‘బ్యుబోనిక్ ప్లేగు’ అని కూడా అంటారు.
» ‘షార్ట్‌రాడ్ యెర్సినియా పెస్టిస్’ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.
» ఈ బ్యాక్టీరియాను ‘పాశ్చరెల్లా పెస్టిస్’ అని కూడా అంటారు.
» ఎలుకల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
» వ్యాధి సంక్రమణకు 2 నుంచి 10 రోజులు పడుతుంది.
వ్యాధి లక్షణాలు:
» అకస్మాత్తుగా జ్వరం రావడం, వాంతులు, వేడితో కూడిన పొడి చర్మం, చర్మంమీద నల్లటి మచ్చలు, ఉరఃసంధిలోని శోషరస కణుపులు వాయడం, కండరాలు వంకరపోవడం.
» వ్యాధి నివారణకు ‘టెట్రాసైక్లిన్’ అనే మందును వాడతారు.
బాసిల్లరి డీసెంట్రీ
» ఇది ‘షిజెల్లా డిసెంట్రియా’ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.
» ఈగలు, కలుషిత ఆహారం, కలుషిత నీరు వాహకాలుగా పనిచేస్తాయి.
» వ్యాధి సంక్రమణకు ఒకటి నుంచి 4 రోజులు పడుతుంది.
వ్యాధి లక్షణాలు: జ్వరం, వికారం, వాంతులు, విరేచనాలు, పొత్తికడుపులో నొప్పి, మలంలో రక్తం పడటం.

 

100+ భారతదేశంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి AP GK

భారతదేశంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి

అతిపెద్దవి
» అతిపెద్ద డెల్టా సుందర్ బన్స్
» అతిపెద్ద జిల్లా లడఖ్ (జమ్మూ-కాశ్మీర్)
» అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం మధుర (ఉత్తర ప్రదేశ్)

 

ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
» అతిపెద్ద విశ్వవిద్యాలయం ఇగ్నో
» అతిపెద్ద చర్చి సె కెథెడ్రల్ (పాత గోవా)
» అతిపెద్ద నౌకాశ్రయం ముంబాయి
» అతిపెద్ద ద్వీపం మధ్య అండమాన్
» అతిపెద్ద నగరం (వైశాల్యంలో) కోల్ కతా
» అతిపెద్ద జైలు తీహార్ (ఢిల్లీ)

 

తీహార్ జైలు (ఢిల్లీ)
» అతిపెద్ద మంచినీటి సరస్సు ఊలార్ (జమ్మూ-కాశ్మీర్)
» అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్ (రాజస్థాన్)
» అతిపెద్ద నివాస భవనం రాష్ట్రపతి భవన్ (న్యూఢిల్లీ)
» అతిపెద్ద మసీదు జామా మసీదు (ఢిల్లీ)

 

జామా మసీదు (ఢిల్లీ)
» అతిపెద్ద డోమ్ గోల్ గుంబజ్ (బీజాపూర్, కర్ణాటక)
» అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
» అతిపెద్ద తెగ గోండ్
» అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు గోవింద సాగర్ (హర్యానా)
» అతిపెద్ద వన్యమృగ సంరక్షణ కేంద్రం శ్రీశైలం-నాగార్జున సాగర్ అభయారణ్యం
» అతిపెద్ద నదీ ద్వీపం మజోలి (బ్రహ్మపుత్ర నదిలో – అసోమ్)
» అతిపెద్ద లైబ్రరీ నేషనల్ లైబ్రరీ (కోల్ కతా)
» అతిపెద్ద ప్లానెటోరియం బిర్లా ప్లానిటోరియం (కోల్ కతా)
» అతిపెద్ద ఎడారి ధార్ ఎడారి
» అతిపెద్ద స్తూపం సాంచి (మధ్యప్రదేశ్)
» అతిపెద్ద జూ జూలాజికల్ గార్డెన్స్(కోల్ కతా)
» అతిపెద్ద గుహ అమరనాథ్ (పహల్గాం –జమ్మూకాశ్మీర్)
» అతిపెద్ద బొటానికల్ గార్డెన్ నేషనల్ బొటానికల్ గార్డెన్ (కోల్ కతా)
» అతిపెద్ద మ్యూజియం ఇండియన్ మ్యూజియం (కోల్ కతా)
» అతిపెద్ద గురుద్వారా స్వర్ణ దేవాలయం (అమృతసర్)
» అతిపెద్ద గుహాలయం ఎల్లోరా (మహారాష్ట్ర)

 

ఎల్లోరా గుహాలయం (మహారాష్ట్ర)
» అతిపెద్ద పోస్టాఫీస్ జీపీవో – ముంబాయి
» అతిపెద్ద ఆడిటోరియమ్ శ్రీ షణ్ముఖానంద హాల్ (ముంబాయి)
» అతిపెద్ద ప్రాజెక్ట్ భాక్రానంగల్ (పంజాబ్, హర్యానా, రాజస్థాన్)
» అతిపెద్ద విగ్రహం నటరాజ విగ్రహం (చిదంబరం)
» అతిపెద్ద ఉప్పు తయారీ కేంద్రం మిధాపూర్ (గుజరాత్)
అతిపొడవైనవి
» అతి పొడవైన స్తూపం సాంచీ (మధ్యప్రదేశ్)
» అతి పొడవైన టన్నెల్ జవహర్ టన్నెల్ (జమ్మూ-కాశ్మీర్)
» అతి పొడవైన రోడ్డు గ్రాండ్ ట్రంక్ రోడ్డు (అమృతసర్-కోల్ కతా)
» అతి పొడవైన నది గంగానది (భారత్ లో 2415 కి.మీ.)

 

గంగానది (భారత్ లో 2415 కి.మీ.)
» అతి పొడవైన ఉపనది యమున
» అతి పొడవైన డ్యామ్ హీరాకుడ్ డ్యామ్ (24.4 కి.మీ. –ఒడిశా)
» అతి పొడవైన బీచ్ మెరీనా బీచ్ (13 కి.మీ. –చెన్నై)
» అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ ఖరగ్ పూర్ (833 మీ. – పశ్చిమబెంగాల్)
» అతి పొడవైన జాతీయ రహదారి ఏడో నెంబరు జాతీయ రహదారి (2325 కి.మీ. వారణాసి-కన్యాకుమారి)
» అతి పొడవైన పర్వత శ్రేణి హిమాలయాలు
» అతి పొడవైన కాలువ రాజస్థాన్ కాలువ/ ఇందిరాగాంధీ కాలువ (959 కి.మీ.)
» అతి పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం గుజరాత్
» అతిపొడవైన హిమనీనదం సియాచిన్ హిమనీనదం (75.6 కి.మీ.)
» అతిపెద్ద పొడవైన రోడ్డు బ్రిడ్జి మహాత్మాగాంధీ సేతు (5575 మీ.) (పాట్నా వద్ద గంగానదిపై)
» అతిపొడవైన రైల్వే బ్రిడ్జి (నదిపై) దెహ్రి (సోన్ నదిపై –బీహార్ లోని ససారం)
» అతిపొడవైన సముద్రపు బ్రిడ్జి అన్నా ఇందిరాగాంధీ బ్రిడ్జి (2.34 కి.మీ.) (మండపం-రామేశ్వరం మధ్య)
అతి ఎత్తయినవి
» అతి ఎత్తయిన డ్యామ్ భాక్రా డ్యామ్ (సట్లేజ్ నదిపై)
» అతి ఎత్తయిన పర్వత శిఖరం కాంచన జంగా (8611 మీ.)
» అతి ఎత్తయిన రోడ్డు లేహ్ –మనాలి (జమ్మూకాశ్మీర్)
» అతి ఎత్తయిన జలపాతం జోగ్ లేదా జెర్సొప్పా(292 మీ. – కర్ణాటక)
» అతి ఎత్తయిన ప్రవేశద్వారం బులంద్ దర్వాజా (53.5 మీ.)
» అతి ఎత్తయిన సరస్సు దేవతల్
» అతి ఎత్తయిన జల విద్యత్తు కేంద్రం రోహ్ తంగ్ (హిమాచల్ ప్రదేశ్)
ఇతరాలు
» అతి చల్లని ప్రాంతం డ్రాస్ సెక్టార్ (జమ్మూకాశ్మీర్)
» అతి ప్రాచీన చర్చి సెయింట్ థామస్ చర్చి ((క్రీ.శ. 52 నాటిది)
» అతి రద్దీ ఉన్న విమానాశ్రయం ఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి

 

ఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి
» అతిపురాతన చమురుశుద్ది కర్మాగారం దిగ్బోయ్ (1835 – అసోమ్)
» అతి పురాత టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కోల్ కతా

 

100+ ప్రభుత్వ రంగ సంస్థలు – నెలకొన్న ప్రదేశాలు AP GK Questions in Telugu

ప్రభుత్వ రంగ సంస్థలు – నెలకొన్న ప్రదేశాలు

సంస్థ ప్ర‌దేశం
» ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా న్యూ దిల్లీ

 

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – న్యూ దిల్లీ
» షిప్పింగ్ కార్పొరేషన్ ముంబయి
» ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ ఆల్వే (కేరళ)
» రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపుర్తల (పంజాబ్)

 

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ – కపుర్తల
» ఇండియన్ ఎయిర్ లైన్స్ న్యూదిల్లీ
» నేషనల్ ఇన్‌స్ట్రుమెంట్స్ లిమిటెడ్ కోల్‌కత
» డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి (ఉత్తర ప్రదేశ్)
» ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బెంగళూరు (కర్ణాటక)
» భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ పిప్‌లాని, భోపాల్ (మధ్యప్రదేశ్)
» ఇంజినీర్స్ (ఇండియా) లిమిటెడ్ న్యూదిల్లీ
» హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ
» రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపుర్తల (పంజాబ్)
» కొచ్చిన్ రిఫైనరీస్ లిమిటెడ్ కోచి (కేరళ)
» హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు (కర్ణాటక)
» ఇండియన్ డ్రగ్స్ & ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ రుషికేష్ (యాంటీ బయోటిక్స్), హైదరాబాద్ (సింథటిక్ డ్రగ్స్), చెన్నై (సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్)
» హిందుస్థాన్ యాంటిబయోటిక్స్ లిమిటెడ్ పింప్రి, పుణె (మహారాష్ట్ర)
» హిందుస్థాన్ ఫొటో ఫిల్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉదక మండలం

 

హిందుస్థాన్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్ – విశాఖపట్టణం
» హిందుస్థాన్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్ విశాఖపట్టణం, కోచి (కేరళ)
» హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ రూప్‌నారాయణ్‌పూర్ 
(పశ్చిమ బంగా)
» హిందుస్థాన్ టెలిప్రింటర్స్ లిమిటెడ్ చెన్నై
» ఎయిర్ ఇండియా కార్పొరేషన్ ముంబయి
» భారత్ గోల్డ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోలార్
» ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్ (తమిళనాడు)

 

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ – నైవేలి
» నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ నైవేలి (తమిళనాడు)
» ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ న్యూదిల్లీ
» ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ముంబయి
» భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రాణిపూర్ (హరిద్వార్), రామచంద్రాపురం (హైదరాబాద్), తిరుచిరాపల్లి, బెంగళూరు, భోపాల్
» హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ రాంచి (ఝార్ఖండ్)
» భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ బెంగళూరు
» మజగావ్ డాక్ లిమిటెడ్ ముంబయి
» హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ రాంచి
» గార్డెన్‌రీచ్ వర్క్‌షాప్ లిమిటెడ్ కోల్‌కతా
» భారత్ ఎలక్ట్రికల్స్ లిమిలెడ్ పిప్‌లాని, భోపాల్
» స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ న్యూదిల్లీ
» భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిలెడ్ విశాఖపట్నం
» చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ చిత్తరంజన్ (పశ్చిమ బంగా)
» హెవీ మెషిన్ బిల్డింగ్ ప్లాంట్ రాంచి
» న్యూస్ ప్రింట్ ఫ్యాక్టరి నేపానగర్ (మధ్యప్రదేశ్)
» స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ లఖ్‌నవూ
» హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఉదయ్‌పూర్ (రాజస్థాన్)
» హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కోల్‌కతా
» హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ కొలాబా (మహారాష్ట్ర)
» హిందుస్థాన్ పేపర్ కార్పొరేషన్ న్యూ దిల్లీ
» నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ హైదరాబాద్
» నేషనల్ బైస్కిల్ కార్పొరేషన్ ముంబయి
» భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జలహళ్లి (బెంగళూరు), ఘజియాబాద్ (ఉత్తర ప్రదేశ్), పూణె.
» ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ వడోదర
» భారత ప్రమాణాల సంస్థ న్యూ దిల్లీ
» హిందూస్థాన్ మోటార్స్ లిమిటెడ్ ఉత్తర్‌పరా (కోల్‌కతా)
» కృత్రిమ అవయవాల కేంద్రం పుణె
మరికొన్ని ……
» ఎరీ మిల్క్ కాలనీ ముంబయి
» నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ కర్నాల్ (హరియాణా)

 

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ – బెంగళూరు
» ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూరు
» ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ నాసిక్
» హై ఆల్టిట్యూడ్ కాస్మిక్ రేస్ ల్యాబోరేటరి గుల్‌మార్గ్ (కశ్మీర్)
» రవీంద్ర రంగసాల (ఓపెన్ ఎయిర్ థియేటర్) న్యూదిల్లీ
» న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్

 

సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం – శ్రీహరికోట
» సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్)
» అంతరిక్ష ప్రయోగ కేంద్రం బాలాసోర్ (ఒడిశా)
» విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం (కేరళ)
» సోలార్ అబ్జర్వేటరి జోధ్‌పూర్
» అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ హైదరాబాద్ (తెలంగాణ)
» ఇండో – ఆస్ట్రేలియన్ షీప్ ఫార్మ్ హిస్సార్ (హరియాణా)
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ హైదరాబాద్
» శాటిలైట్ కమ్యూనికేషన్ కళాశాల అహ్మదాబాద్
» వర్లీ డెయిరీ ముంబయి
» నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా న్యూ దిల్లీ
» స్పేస్ కమిషన్ బెంగళూరు
» ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్ట్ బెంగళూరు
» తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ తుంబా (తిరువనంతపురం)
» ఫిజికల్ రిసెర్చ్ ల్యాబోరేటరి అహ్మదాబాద్
» స్పేస్ అప్లికేషన్ సెంటర్ స్పేస్ అప్లికేషన్ సెంటర్

 

నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ – షాద్‌నగర్
» నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ షాద్‌నగర్ (హైదరాబాద్)
» ఇన్‌శాట్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటి హసన్ (కర్ణాటక)
» నేషనల్ మెసోస్పియర్/ స్ట్రాటోస్పియర్/ ట్రోపోస్పియర్ రాడార్ ఫెసిలిటీ గాదంకి (తిరుపతి)
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అహ్మదాబాద్
» సోలార్ ఫిజికల్ అబ్జర్వేటరి కొడైకెనాల్
» సెంట్రల్ మెరైన్ రిసెర్చ్ స్టేషన్ చెన్నై
» సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సిమ్లా
» కాఫీ బోర్డ్ ప్రధాన కార్యాలయం బెంగళూరు
» పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఖీ రిసెర్చ్ చండీగఢ్
» ఇన్‌కం ట్యాక్స్ ట్రైనింగ్ స్కూల్ నాగపూర్
» ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సిమ్లా
» ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ బెంగళూరు
» నేషనల్ ఏరోనాటికల్ ల్యాబోరేటరి బెంగళూరు
» ఉపాధ్యాయ విద్యా జాతీయ మండలి న్యూదిల్లీ
» నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ స్పైసెస్ కోజికోడ్, కేరళ
» నేషనల్ మెటలర్జికల్ ల్యాబోరేటరి జంషెడ్‌పూర్
» సదరన్ రీజియన్ ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్ అనంతపూర్ (ఆంధ్రప్రదేశ్)
» శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ తిరువనంతపురం
» ప్రొపెల్లింగ్ ఫ్యూయల్ కాంప్లెక్స్ తిరువనంతపురం

 

100+ మానవుల్లో వైరస్ వల్ల వచ్చే వ్యాధులు AP GK Questions in Telugu

మానవుల్లో వైరస్ వల్ల వచ్చే వ్యాధులు

పోలియో
» ఈ వ్యాధి ‘ఎంటిరోవైరస్’ లేదా ‘పోలియోవైరస్’ వల్ల సంక్రమిస్తుంది.

 

» ఈగలు, కలుషిత ఆహారం, కలుషిత నీరు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.
» ఈ వ్యాధి నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది.
» పోలియోను ‘శిశు పక్షవాతం’ అని కూడా అంటారు.
» జూనాస్ సాల్క్ అనే శాస్త్రవేత్త పోలియో టీకాను కనుక్కున్నాడు.
» ఇంజక్షన్ ద్వారా తీసుకునే పోలియో టీకాను ‘సాల్వాక్’ అంటారు.
» నోటి ద్వారా తీసుకునే చుక్కల మందును ‘సాబిన్’ అంటారు.
» పోలియో వల్ల చాలకనాడులు నశించిపోయి కాళ్లూ, చేతులు చచ్చుబడిపోతాయి.
» 7 నుంచి 14 రోజుల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
వ్యాధి లక్షణాలు: తలనొప్పి, వాంతులు, వికారం, తీవ్రమైన జ్వరం, అతిసారం, పక్షవాతం.
జలుబు (రొంప)
» ‘రినో వైరస్’ అనే వైరస్ వల్ల ఇది సంక్రమిస్తుంది.
» దీనికి గాలి వాహకంగా పనిచేస్తుంది.
» దీనివల్ల ముక్కు తీవ్రంగా ప్రభావితమవుతుంది.
» వ్యాధి సోకిన వ్యక్తుల శ్వాసనాళాల నుంచి ఈ వైరస్ విడుదలవుతుంది.
» ఒకటి లేదా 2 రోజుల్లో ఇది సంక్రమిస్తుంది.
వ్యాధి లక్షణాలు: ముక్కు కారడం, తలనొప్పి, దగ్గు, కొద్దిగా జ్వరం రావడం.
మశూచి
» ఈ వ్యాధినే ‘స్మాల్‌పాక్స్ (Smallpox) ‘ లేదా ‘స్పోటకం’ అని అంటారు.
» ‘వరియొల వైరస్’ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» మొత్తం శరీరం ఈ వ్యాధికి లోనవుతుంది.
» ప్రత్యక్ష స్పర్శ, రోగి వాడిన వస్తువులను వాడటం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» ఎడ్వర్డ్ జెన్నర్ ఈ వ్యాధికి మొదటిసారిగా టీకా మందును కనిపెట్టాడు.
» మశూచిని భారత్‌లో పూర్తిగా నిర్మూలించారు.
వ్యాధి లక్షణాలు:
» అకస్మాత్తుగా లేదా క్రమంగా జ్వరం, తలనొప్పి, వెన్ను నొప్పి.
» ఈ వ్యాధి సోకిన మూడోరోజు శరీరం మీద ఎర్రని చిన్న గుల్లలు ఏర్పడి బొబ్బలుగా మారతాయి.
» చివరకు ఒకలాంటి ద్రవంతో పొక్కులుగా మారతాయి. ఈ పొక్కులు శరీరంపై గుంటలతో కూడిన మచ్చల్ని శాశ్వతంగా ఏర్పరుస్తాయి.
రేబిస్
» ఈ వ్యాధి వల్ల ‘జల భీతి’ కలుగుతుంది. అందువల్ల దీన్ని ‘జల భీతి’ వ్యాధి అని కూడా అంటారు.
» ‘రేబిస్ వైరస్’ అనే వైరస్ వల్ల సంక్రమిస్తుంది.
» రేబిస్ వైరస్‌నే ‘రాబ్డో వైరస్’ అని కూడా అంటారు.
» కుక్క కాటు ద్వారా ఈ వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
» 2 నుంచి 16 వారాల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కొన్ని సందర్భాల్లో మరింత ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు.
వ్యాధి లక్షణాలు:
» తలనొప్పి, జ్వరం, నీటిని చూస్తే భయం, వణుకు, పక్షవాతం, వాంతులు, గొంతు వాపు.
» ఈ వ్యాధి నివారణకు ‘యాంటీ రేబిస్’ అనే మందును ఇస్తారు.
» యాంటీ రేబిస్‌ను లూయీపాశ్చర్ కనుక్కున్నాడు.
» ఈ వ్యాధి నివారణకు వాడే మరో మందు ‘రేబీపోల్’.
డెంగ్యూ
» ఈ వ్యాధిని ఎల్లో ఫీవర్, బ్రేక్ ఫీవర్, బోన్ ఫీవర్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.
» డెంగ్యూ వైరస్ (ఆర్బో వైరస్) ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» పగటి పూట కుట్టే ‘ఎడిస్ ఈజిప్టు’ అనే దోమకాటు ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
» ఈ వ్యాధి వల్ల రక్తఫలకికల సంఖ్య తీవ్రంగా తగ్గిపోతుంది.
» 4 నుంచి 8 రోజుల్లో వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ వ్యాధి వస్తుంది.
» కీళ్లు, చర్మం ఈ వ్యాధి ప్రభావానికి గురవుతాయి.
వ్యాధి లక్షణాలు:
» తీవ్ర జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి, కొన్ని రోజుల పాటు చర్మం మీద చిన్న చిన్న గుల్లలు ఈ వ్యాధి వల్ల ఏర్పడి అలాగే ఉండిపోవడం.
గవద బిళ్లలు (మంప్స్)
» ‘పారా మిక్సో వైరస్’ అనే వైరస్ వల్ల ఇవి సంక్రమిస్తాయి.
» లాలాజలంలోని, చీమిడిలోని వైరస్ శరీరంలోకి ప్రవేశించి లాలాజల గ్రంథుల మీద దాడిచేస్తుంది.
» ప్రత్యక్ష స్పర్శ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.
» 12 నుంచి 21 రోజులు ఈ వ్యాధి సంక్రమించడానికి పడుతుంది.
» గొంతు, మెడ, దవడలు ప్రభావానికి గురవుతాయి.
» ఈ వ్యాధికి ఎక్కువగా దవడలు ప్రభావితమవుతాయి.
» ఈ ప్రభావమనేది 7 నుంచి 10 రోజుల పాటు ఉంటుంది.
వ్యాధి లక్షణాలు: చెవుల దగ్గర, దవడల దగ్గర లాలాజల గ్రంథులు వాయడం.
తట్టు (మీజిల్స్ లేదా పొంగు)
» ‘పారా మిక్సోవైరస్’ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» మాట్లాడేటప్పుడు, దగ్గేటప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
» వ్యాధి సంక్రమించడానికి 10 నుంచి 14 రోజుల సమయం పడుతుంది.
» చర్మం ఈ వ్యాధి ప్రభావానికి గురవుతుంది.
» ఈ వ్యాధి నివారణకు MMR (Measles, Mumps, Rubella) వ్యాక్సిన్ ఇస్తారు.
వ్యాధి లక్షణాలు:
» జలుబు, జ్వరం, తలనొప్పి, తుమ్ములు, చర్మంపై చిన్న చిన్న ఎర్రని గుల్లలు ఏర్పడటం.
» వ్యాధి సోకిన 4 రోజుల తర్వాతే ఈ ఎర్రని గుల్లలు ఏర్పడతాయి.
చికెన్ ఫాక్స్ (అమ్మవారు) (ఆటలమ్మ)
» ‘వెరిసెల్లా వైరస్’ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» చర్మం ఈ వ్యాధి ప్రభావానికి గురవుతుంది.
» తుంపర్ల ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
» వ్యాధి సంక్రమణకు 2 నుంచి 5 రోజులు పడుతుంది.
వ్యాధి లక్షణాలు:
» జలుబు, జ్వరం, తలనొప్పి, చర్మంపై చిన్న చిన్న ఎర్రని గుల్లలు ఏర్పడటం.
» ఏర్పడిన గుల్లలు 5 నుంచి 20 రోజుల లోపల రాలిపోతాయి.
» వైరస్ సోకిన 36 గంటల్లో గుల్లలు ఏర్పడతాయి.
మెదడువాపు వ్యాధి (జపనీస్ ఎన్‌సెఫలైటిస్)
» ‘ఎన్‌సెఫాలిటిస్ (ఆర్బో వైరస్) వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» ఆడ క్యూలెక్స్ దోమ పందిని కుట్టి, మనిషిని కుడితే ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
» 4 నుంచి 21 రోజుల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» మెదడు ఈ వ్యాధి ప్రభావానికి గురవుతుంది.
» బెల్లడోనా మందును ఈ వ్యాధి చికిత్సకు వాడతారు.
వ్యాధి లక్షణాలు:
» అకస్మాత్తుగా జ్వరం, తలనొప్పి, వాంతులు, మత్తుగా ఉండటం, మెడ బిగుసుకుపోవడం, వెన్నునొప్పి. మానసిక అస్థిరత్వం.
» ఈ వ్యాధి వల్ల అంధత్వం, చెవుడు, పక్షవాతం, మనోవైకల్యం లాంటి దుష్ఫలితాలు సంభవిస్తాయి.
చికున్ గున్యా
» ‘ప్లావీ వైరస్ (ఆల్ఫా వైరస్)’ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» ప్లావీ వైరస్‌నే ‘చిక్ వైరస్’ లేదా ‘CK వైరస్’ అని కూడా అంటారు.
» ఈ వ్యాధిని మొదటగా టాంజానియా (ఆఫ్రికా)లో గుర్తించారు.
» ‘ఎడిస్ ఈజిప్టి’ అనే దోమ కాటు వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» ఆఫ్రికాలో ‘మాకొండే’ అనే భాషలో, కెన్యాలోని ‘స్వాహిలీ’ అనే భాషలో చికున్ గున్యా అంటే వంగి నడవటం అని అర్థం.
వ్యాధి లక్షణాలు:
» జ్వరం, కీళ్ల నొప్పులు, కీళ్ల మధ్య వాపులు, కండరాల వాపులు
హెపటైటిస్
» ‘హెపటైటిస్-బి’ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» ‘హెప’ అంటే కాలేయం అని అర్థం.
» ఇది కాలేయానికి వచ్చే వ్యాధి.
» మొదటిసారిగా హైదరాబాద్‌లోని శాంతా బయోటెక్ అనే సంస్థ ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను కనిపెట్టింది.
» వ్యాక్సిన్ పేరు ‘శాన్‌వాక్స్’.
వ్యాధి లక్షణాలు:
» జ్వరం, వికారం, పచ్చకామెర్లు, కాలేయంలో వాపు.
ఇన్‌ఫ్లుయెంజా (ఫ్లూ)
» ‘ఆర్థోమిక్సో వైరస్’ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» ఈ వ్యాధికి గాలి వాహకంగా పనిచేస్తుంది.
» కండరాలు, గొంతు, ఊపిరితిత్తులు ఈ వ్యాధి ప్రభావానికి గురవుతాయి.
» 1, 2 రోజుల్లోనే ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
వ్యాధి లక్షణాలు:
» జ్వరం, కండరాల నొప్పి, గొంతు పుండు పడటం, పొడి దగ్గు.
» ఈ వ్యాధి ప్రభావంతో ఊపిరితిత్తుల మీద బ్యాక్టీరియా దాడి చేస్తుంది. ఇది ‘న్యూమోనియా’కు దారితీసే అవకాశముంది.
హెర్పెస్ సింప్లెక్స్
» ‘హెర్పెస్ సింప్లెక్స్’ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» లాలాజలం, మలం, కలుషితమైన వస్తువులు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.
వ్యాధి లక్షణాలు:
» చర్మంపై, శ్లేష్మపటలంపై అక్కడక్కడా బొబ్బల్లాంటి గుల్లలు.
ఎయిడ్స్
» AIDS – Acquired Immuno Deficiency Syndrome
» AIDSను కలుగచేసే వైరస్ HIV.
» HIV విస్తరణ రూపం Human Immuno Deficiency Virus.
» హ్యూమన్ టి సెల్ (ల్యూకేమియా వైరస్/రెట్రో వైరస్) ఈ వ్యాధికి కారకాలు.
» లైంగిక సంబంధాలు, రక్తం, సిరంజీలు ఈ వ్యాధి సంక్రమించడానికి దోహదం చేస్తాయి.
» రోగ నిరోధక వ్యవస్థపై ఈ వ్యాధి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
» HIV వైరస్‌ను 1983లో ‘ల్యూక్ మాంటెగ్నర్’ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు.
» ఈయన ఫ్రాన్స్ దేశస్థుడు.
» ఈ వైరస్‌కు ఆయన పెట్టిన పేరు: LAV – 2
» LAV – 2 విస్తరణ రూపం: Lymphadenopathy Associated Virus – 2
» 1984లో అమెరికాకు చెందిన ‘రాబర్ట్ గాలో’ అనే శాస్త్రవేత్త ఇదే వైరస్‌ను కనిపెట్టాడు.
» ఈ వైరస్‌కు ఆయన పెట్టిన పేరు ‘HTLV-III’.
» ‘HTLV – III’ విస్తరణ రూపం Human T-Cell Lympotropic Virus-III.
» ప్రపంచంలోనే మొదటిసారిగా మానవుల్లో ఈ వ్యాధిని 1981లో అమెరికాలో కనుక్కున్నారు.
» మన దేశంలో మొదటిసారిగా ఈ వ్యాధిని 1986లో చెన్నైలో కనుక్కున్నారు.
» 1987లో హైద‌రాబాద్‌లో ఈ వ్యాధి కేసు మొదటిసారిగా నమోదైంది.
» ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న దేశం దక్షిణాఫ్రికా.
» భారత్‌లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర.
» ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న జిల్లా గుంటూరు.
» ఈ వ్యాధి లక్షణాలు వ్యాధిని సోకిన తర్వాత 3-5 సంవత్సరాల మధ్యలో కనిపిస్తాయి.
» 20-49 సంవత్సరాల వయసువారే ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు.
» ఎయిడ్స్ / HIV వ్యాధి ఉన్న స్త్రీ గర్భం దాల్చితే పుట్టే శిశువుకు కూడా HIV సంక్రమిస్తుంది.
» పుట్టే శిశువుకు ఈ వైరస్ సోకకుండా వైద్యుడి పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు.
» HIV వైరస్ రిట్రో విరిడే అనే కుటుంబానికి చెందింది.
» HIV ఉన్న RNA ‘రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేజ్’ అనే ఎంజైమ్‌ను కలిగి ఉంటుంది.
వ్యాధి లక్షణాలు:
» పదేపదే జ్వరం రావడం, తరచుగా విరేచనాలు, దగ్గు, న్యూమోనియా, రక్త నాళాలు చిట్లడం, బరువు విపరీతంగా తగ్గిపోవడం, చర్మ వ్యాధులు, రాత్రిపూట తీవ్రమైన చెమటలు పట్టడం, లింఫ్ గ్రంథుల్లో వాపు.
» ఈ వ్యాధి రోగ నిరోధక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం చూపిందో ‘సీడీ – 4’ కణాల సంఖ్యను బట్టి తెలుసుకోవచ్చు.
» ఆరోగ్యవంతమైన మానవుడిలో సీడీ – 4 కణాల సంఖ్య ప్రతి మిల్లీమీటరుకు రక్తంలో 500 నుంచి 1500 వరకు ఉంటాయి.
» HIV వైరస్ తరచూ తన రూపాన్ని మార్చుకుంటుంది. అందుకే మందు తయారుచేయడమనేది కష్టసాధ్యమౌతోంది.
» ఎయిడ్స్‌ను నిర్ధారించడానికి చేసే పరీక్షలు:
        i) ELISA
ii) WESTERN BLOT TECHNIQUE
iii) TRIDOT TEST
iv) PCR
వీటిల్లో ఏ ఒక్క పరీక్ష ద్వారానైనా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు.
» ELISA విస్తరణ రూపం Enzyme Linked Immuno Sorbent Assay.
» PCR విస్తరణ రూపం Polymerase Chain Reaction.
» HIV పరీక్షను వేగవంతంగా, సులభంగా చేయడానికి అమెరికాలో కొలంబియా విశ్వవిద్యాలయంలో ‘శామ్యూల్ కెంసియా’ అనే శాస్త్రవేత్త ఎం.చిప్ అనే పరికరాన్ని కనుక్కున్నారు.
» ఎం.చిప్ పరికరం ద్వారా ఒకే ఒక్క రక్తపు చుక్కతో 15 నిమిషాల్లో HIV స్థితిని తెలుసుకోవచ్చు.
» ELISA పరీక్ష కంటే 10 రెట్ల వేగంతో ఎం.చిప్ పరికరం పనిచేస్తుంది.
» HIV బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న చికిత్స ART.
» ART విస్తరణ రూపం Anti Retro Virus Therapy.
» ART చికిత్సలో ఇచ్చే మందులు జిడోవుడెన్ (ZDV), అజిటో థయమిన్ (AZT), డైడి ఆక్సీ సైటిడిన్ (DDC).
» 1992లో భారత ప్రభుత్వం ఎయిడ్స్ నివారణకు, నియంత్రణకు NACO అనే సంస్థను స్థాపించింది.
» NACO విస్తరణ రూపం National Aids Control Organisation.
» ఆంధ్రప్రదేశ్‌లో ‘AASHA’ అనే పథకం అమల్లో ఉంది.
హెర్పెస్ జోస్టర్
» ‘హెర్పెస్ జోస్టర్’ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» నోటి తుంపరలు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.
» 7 నుంచి 14 రోజులు ఈ వ్యాధి సంక్రమణకు పడుతుంది.
వ్యాధి లక్షణాలు:
» చర్మంపై బొబ్బలు, చర్మం లేదా శ్లేష్మపట‌లంలో తీవ్రమైన బాధ, జ్వరం, నోటిలో పుండ్లు ఏర్పడటం.
స్వైన్ ఫ్లూ
» H1N1 అనే వైరస్ వల్ల ఇది సంక్రమిస్తుంది.
» H1N1 అనేది ఇన్‌ఫ్లుయెంజా వైరస్ రకం.
» ‘స్వైన్’ అనే జాతి పందుల ద్వారా ఈ వైరస్ వెలువడుతుంది. అందువల్ల దీనికి ‘స్వైన్ ఫ్లూ’ అనే పేరు పెట్టారు.
» ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుంది.
» మొదట పందుల నుంచి మనిషికి సంక్రమించి ఆ తర్వాత మనిషి నుంచి మనిషికి త్వరితగతిన సంక్రమిస్తుంది.
»ఈ వ్యాధి మెక్సికో, లాటిన్ అమెరికా దేశాలకు మాత్రమే పరిమితమైనప్పటికీ ఇప్పుడు దాదాపుగా అన్ని దేశాలకు వ్యాపించింది.
» ఈ వ్యాధి చికిత్సకు ‘టామీ ఫ్లూ’ అనే మందును వాడతారు.
వ్యాధి లక్షణాలు:
» చలి, జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, ఛాతీ నొప్పి, ముక్కులో నుంచి రక్తం కారడటం, తీవ్రమైన జలుబు.
బర్డ్ ఫ్లూ
» H5N1 అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» ఈ వ్యాధి అతి వేగంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది.
» ఈ వ్యాధి ఎక్కువగా పక్షులకు, కోళ్లకు వస్తుంది.
» మానవుల్లో ఈ వ్యాధి రావడం అరుదు.
» హాంకాంగ్‌లో ఈ వైరస్‌ను 1997లో మానవుల్లో గుర్తించారు.
SARS
» SARS విస్తరణ రూపం Severe Acute Respiratory Syndrome.
» కరోనా వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» ఈ వ్యాధిని ‘మృత్యుకారక న్యూమోనియా’ అని కూడా అంటారు.
» ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి.
» న్యూమోనియా కూడా ఊపిరితిత్తులకు సంబంధించిందే. కానీ మరణం సంభవించదు. కానీ SARS వల్ల ప్రాణపాయం ఉంటుంది.
వ్యాధి లక్షణాలు:
» జ్వరం, తలనొప్పి, దగ్గు.
» ఈ వ్యాధిని మొదటగా చైనాలో గుర్తించారు.
» ఈ వ్యాధి వల్ల గతంలో కెనడాలో అనేకమంది మరణించారు.

 

100+ ప్రపంచంలోని ప్రధాన సరస్సులు AP GK Questions in Telugu

ప్రపంచంలోని ప్రధాన సరస్సులు

ప్రధాన సరస్సు దేశం
» సుపీరియర్ అమెరికా, కెనడా (ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు)

 

సుపీరియర్ సరస్సు
» కాస్పియన్ రష్యా, ఇరాన్ (ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు)
» బైకాల్ రష్యా (ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు)

 

టిటికాకా సరస్సు
» టిటికాకా బొలివియా, పెరూ (ప్రపంచంలో అతి ఎత్తయిన మంచినీటి సరస్సు)
» ఆరల్ రష్యా
» విక్టోరియా ఉగాండా, టాంజానియా
» ఒంటారియో అమెరికా, కెనడా
» మిచిగాన్ అమెరికా
» నెట్టిలింగ్ కెనడా
» గ్రేట్ బేర్ కెనడా
» ఓనేగా రష్యా
» న్యాసా మాలావి, మొజాంబిక్, టాంజానియా

 

టోరెన్స్ సరస్సు
» టోరెన్స్ దక్షిణ ఆస్ట్రేలియా
» టాంగన్యీకా టాంజానియా, జైర్
» చాద్ చాద్
» వోల్టా ఘనా
» మలావి ఆఫ్రికా
» హ్యురాన్ అమెరికా
» బల్ కాష్ కజకిస్థాన్
» ఇరి అమెరికా
» కరీబా జింబాబ్వే
» మరకైబో వెనిజులా
» గ్రేట్ సాల్ట్ అమెరికా
» తానా ఇథియోపియా

 

100+ పాత్రలు – సృష్టికర్తలు AP GK Questions in Telugu

పాత్రలు – సృష్టికర్తలు

పాత్ర సృష్టికర్త
» మిక్కీ మౌస్ వాల్డ్ డిస్ని

 

మిక్కీ మౌస్ – వాల్డ్ డిస్నిల్
» టార్జాన్ ఎడ్గర్ రైస్‌బరోస్
» జేమ్స్‌బాండ్ ఇయాన్ ఫ్లెమింగ్
» విన్నిదిపూ ఎ.ఎ.మిల్ని
» యుగిఓ కజుకి తకహషి

 

హ్యారీ పోటర్ – జె.కె.రౌలింగ్
» హ్యారీ పోటర్ జె.కె.రౌలింగ్
» వాల్వరైన్ స్టాన్లీ, జాక్ కిల్బి
» స్పైడర్ మ్యాన్ స్టాన్లీ, స్టీవ్ డిట్కో

 

స్పైడర్ మ్యాన్ – స్టాన్లీ, స్టీవ్ డిట్కో
» ఫ్రోడో బ్యాగిన్స్ జె.ఆర్.ఆర్.టోల్సిస్
» పోకేమాన్ సతోషి తాజిరి
» స్పాంజ్‌బాబ్ స్పాంజ్‌బాబ్