100+ జాతీయ, అంతర్జాతీయ తొలి సంఘటనలు – తొలి వ్యక్తులు AP GK Questions

జాతీయ, అంతర్జాతీయ తొలి సంఘటనలు – తొలి వ్యక్తులు

సంఘటన వ్యక్తి/ వ్యక్తులు
» ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ – లండన్ (1863)
» ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ – లండన్ (1890)
» ప్రపంచంలో తొలి గ్రంథం – రుగ్వేదం
» భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్ – అప్సర (1956)
» తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు – ఇండో – గ్రీకులు
» భారత్‌లో తొలి పత్రిక – బెంగాల్ గెజిట్ (1780)
» దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం – ఆంధ్రప్రదేశ్ (1956)
» ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం – ముంబయి
» భారత్‌లో మొదటి మహిళా కళాశాల – బెతూన్ కళాశాల, కలకత్తా (1879)
» దేశంలో తొలి చమురు బావి – దిగ్బోయ్ (అస్సాం, 1890)
» ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం – జపాన్ (టోక్యో, 1964)
» మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు – కుక్క
» మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం – రాగి
» దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం – చామ్రవట్టం (కేరళ)
» భారత్‌లో తొలి నాగరికత – సింధు
» భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం – ముంబయి (1885)
» తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం – జనతా ప్రభుత్వం (1977 – 79)
» మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం – న్యూజిలాండ్ (1893)
» తొలి క్లోన్‌డ్ జంతువు – డాలీ అనే గొర్రె (1996)
» భారత్‌లో తొలిసారిగా భారజల ఉత్పత్తిని ప్రారంభించిన కేంద్రం – నంగల్ (పంజాబ్)
» భారత్‌లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా – పాలక్కడ్ (కేరళ)
» భారతదేశంలో సౌరశక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం – చోగ్లామ్‌సార్ (జమ్ము, కాశ్మీర్)
» తొలి ఇ-నెట్‌వర్క్ జిల్లా – మలప్పురం (కేరళ)
» భారత్‌లో వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం – మైసూర్ (కర్ణాటక)
» భారత్‌లో మొదటి సమాచార సాంకేతికత ఉన్న జిల్లా – పాలక్కడ్ (కేరళ)
» భారత్‌పై దండెత్తిన తొలి యూరోపియన్ – అలెగ్జాండర్ (క్రీ.పూ. 326)
» భారత్‌లో పూర్తిగా విద్యుదీకరించిన తొలి నగరం – బెంగళూరు (1906)
» భారత్‌లో తొలి మహిళా విశ్వవిద్యాలయం – ఇండియన్ ఉమెన్స్ యూనివర్సిటీ (పుణె)
» మొదటి యాంటీ బయోటిక్ డ్రగ్ – పెన్సిలిన్
» భారత్‌లో మొదటి అణు పరీక్ష – పోఖ్రాన్ (రాజస్థాన్ – 1974)
» భారత్‌లో తొలి సైన్స్ నగరం – కలకత్తా
» భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం – ఆర్యభట్ట (1975)
» కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి కృత్రిమ ఉపగ్రహం – స్పుత్నిక్ (రష్యా – 1957)
» ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ – రజియా సుల్తానా
» భారత్‌లో మొదటి రైల్వే లైను – ముంబయి నుంచి థానే (1853)
» ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైను – కలకత్తా, డైమండ్ హార్బర్‌ల మధ్య (1851)
» శని గ్రహంపైకి పంపిన తొలి స్పేస్ క్రాఫ్ట్ – కేసినీ హ్యుగిన్స్ (2004)
» భారత్ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం – ఆపిల్ (1981)
» భారత్ ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ – PSLVC – 2
» భారత్‌లో తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరం – కలకత్తా (1727)
» మనదేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం – ముంబయి, కలకత్తాల మధ్య (1927)
» ఇండియాలో తొలి మూగ (మూకి) సినిమా – రాజా హరిశ్చంద్ర (1913)
» ప్రపంచంలో మొదటి టాకీ సినిమా – ది జాజ్ సింగర్ (1927)
» భారత్‌లో మొదటి టాకీ సినిమా – ఆలం ఆరా (1931)
» పూర్తినిడివి ఉన్న మొదటి కార్టూన్ చిత్రం – స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్
» భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం – టాటా ఐరన్, స్టీల్ కంపెనీ (1907)
» విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం – మదర్ ఇండియా
» భారతదేశ మొదటి యోగా శాస్త్రవేత్త – పతంజలి
» భారతదేశంలో మొదటిసారిగా స్థాపించిన పోలీసు మ్యూజియం – ఘజియాబాద్ (ఉత్తర్‌ ప్రదేశ్)
» ప్రపంచంలో మొదటిసారిగా నిర్వహించిన అందాల పోటీలు – కార్నిత్ (గ్రీకు క్రీ.పూ. 700)
» మొదటి కంపాక్ట్ డిస్క్ – సోనీ, ఫిలిప్స్ కంపెనీలు తయారు చేశాయి (1978)
» భారత్ తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ – ఇంగ్లండ్‌తో (1932)
» భారత్ తొలి ఎలక్ట్రిక్ రైలు – ముంబయి నుంచి వి.టి. కుర్లా వరకు (1925)
» మొదటి ఆటంబాంబు – లిటిల్ బాయ్ (1945)
» ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం – భారతదేశం
» భారత దేశాన్ని సందర్శించిన తొలి చైనీస్ యాత్రికుడు – పాహియాన్
» భారత దేశంలో శాసనాలు వేయించిన తొలి చక్రవర్తి – అశోకుడు
» దేశంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం – పంజాబ్
» బోర్లాగ్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ – డాక్టర్ అమితా పటేల్ (1992)
» భార‌త‌ దేశ మొదటి రాష్ట్రపతి – డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1950 – 1962)
» భారత దేశ మొదటి ఉపరాష్ట్రపతి – సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952 – 62)
» భారత దేశ మొదటి ప్రధానమంత్రి – జవహర్‌లాల్ నెహ్రూ (1947 – 64)
» భారత దేశ మొదటి ఉప ప్రధానమంత్రి – సర్దార్ వల్లభాయ్ పటేల్ (1947 – 50)
» సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి – హీరాలాల్ జె.కానియా (1950 – 51)
» సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి – మీరా సాహెబ్ ఫాతిమా బీబీ (1989)
» భారత దేశ తొలి మహిళా అడ్వకేట్ – కోర్నేషియా సొరాబ్జి (కోల్‌క‌తా 1894)
» భారత దేశ హైకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి – లీలాసేథ్ (ఢిల్లీ)
» భారత్‌లో హైకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి – అన్నాచాంది
» స్వాతంత్య్రం రాకముందు భారత దేశ మొదటి గవర్నర్ జనరల్ – విలియం బెంటింగ్ (1828 – 35)
» భారతదేశ చివరి గవర్నర్ జనరల్, మొదటి వైస్రాయ్ – లార్డ్ కానింగ్ (1856 – 62)
» స్వతంత్ర భారత మొదటి, చివరి గవర్నర్ జనరల్ – మౌంట్ బాటన్ (1947 – 48)
» స్వతంత్ర భారత మొదటి, చివరి భారతీయ గవర్నర్ జనరల్ – సి. రాజగోపాలాచారి

 

» ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ – విజయలక్ష్మి పండిట్ (1953)
» భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన మొదటి మహిళ – అనిబిసెంట్ (1917, కలకత్తా)
» భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ – సరోజినీ నాయుడు (1925 – కాన్పూర్)
» భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు – ఉమేష్ చంద్ర బెనర్జి (1885 – బొంబయి)
» భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడు – బద్రుద్దీన్ త్యాబ్జీ (1887 – మద్రాసు)
» భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు – పి. ఆనందాచార్యులు (1891 – నాగపూర్)
» వరుసగా రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయిన తొలి వ్యక్తి – రాస్ బిహారీ ఘోష్ (1907 – సూరత్, 1908 – మద్రాస్)
» విడివిడిగా రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయిన తొలి వ్యక్తి – దాదాభాయ్ నౌరోజీ (1886 – కలకత్తా, 1906 – కలకత్తా)
» భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కువసార్లు జరిగిన మొదటి పట్టణం – కలకత్తా (1886, 1906, 1917, 1928)
» భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు – జార్జి యూల్ (1888 – అలహాబాదు)
» భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి పార్శీ మతస్తుడు – దాదాభాయ్ నౌరోజీ
» బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు – దాదాభాయ్ నౌరోజీ
» భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు హాజరైన తొలి మహిళ – కాదంబినీ గంగూలీ (1901)
» భారత్‌లో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి – బేబి హర్ష (1986)
» రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి గవర్నరు – ఒస్‌బ‌ర్న్ స్మిత్ (1935 – 37)
» ఆర్‌బీఐ తొలి భారతీయ గవర్నరు – సి.డి. దేశ్‌ముఖ్ (1943 – 49)
» ఆర్‌బీఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నరు – కె.జె. ఉదేశి
» వెండితెరపై మొదటి నటి – దేవికారాణి
» గుండె మార్పిడి చికిత్స నిర్వహించిన మొదటి భారతీయుడు – డాక్టర్ వేణుగోపాల్
» భారత రత్న పురస్కారం పొందిన మొదటి వ్యక్తులు – సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తుల రాజగోపాలచారి, సి.వి.రామన్ (1954)
» భారతరత్న పొందిన తొలి మహిళ – ఇందిరాగాంధీ (1971)
» భారతరత్న అవార్డు పొందిన తొలి ఉప రాష్ట్రపతి – సర్వేపల్లి రాధాకృష్ణన్ (1954)
» భారతరత్న అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త – సి.వి.రామన్ (1954)
» భారతరత్న అవార్డు పొందిన మొదటి ఇంజినీర్ – మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1955)
» భారతరత్న అవార్డు పొందిన తొలి ప్రధాని – జవహర్‌లాల్ నెహ్రూ (1955)
» భారతరత్న అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి – బాబూ రాజేంద్రప్రసాద్ (1962)
» మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి – లాల్‌బహదూర్ శాస్త్రి (1966)
» భారతరత్న అవార్డు పొందిన తొలి విదేశీయుడు – ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ (1987)
» భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా నటుడు – ఎం.జి. రామచంద్రన్ (1988)
» భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా దర్శకుడు – సత్యజిత్ రే (1992)
» సంగీతంలో భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి, తొలి మహిళ – ఎం.ఎస్. సుబ్బులక్ష్మి(1998)
» పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి – డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1969)
» పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి – కృష్ణకాంత్ (2002)
» తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి – వరాహగిరి వెంకటగిరి (1969 మే – 1969 జులై)
» మొదటి ముస్లిం రాష్ట్రపతి – డాక్టర్ జాకీర్ హుస్సేన్
» మొదటి సిక్కు రాష్ట్రపతి – జ్ఞానీ జైల్‌ సింగ్
» అత్యధిక కాలం రాష్ట్రపతిగా పనిచేసిన తొలి రాష్ట్రపతి – డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
» ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి పదవి చేపట్టిన మొదటి వ్యక్తి – డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
» మొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతి – డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1962)
» అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా వ్యవహరించిన రాష్ట్రపతి – డాక్టర్ జాకీర్ హుస్సేన్
» మొదటి కాంగ్రెసేతర రాష్ట్రపతి – వరాహగిరి వెంకటగిరి
» స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మొదటి రాష్ట్రపతి – వరాహగిరి వెంకటగిరి
» సుప్రీంకోర్టులో సాక్షిగా హాజరైన మొదటి రాష్ట్రపతి – వరాహగిరి వెంకటగిరి
» అతి ఎక్కువ ఆర్డినెన్స్‌లు జారీచేసిన రాష్ట్రపతుల్లో ప్రథముడు – ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్
» ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి – ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్
» ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి – నీలం సంజీవరెడ్డి
» పిన్న వయసులోనే (63 సంవత్సరాలు) రాష్ట్రపతి మొదటి వ్యక్తి – నీలం సంజీవరెడ్డి
» ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా (ఆంధ్రప్రదేశ్), స్పీకర్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి – నీలం సంజీవరెడ్డి
» తొలి దళిత రాష్ట్రపతి – కె.ఆర్. నారాయణన్
» ఓటు హక్కు ఉపయోగించుకున్న తొలి రాష్ట్రపతి – కె.ఆర్.నారాయణన్
» తొలి మహిళా రాష్ట్రపతి – ప్రతిభా దేవీసింగ్ పాటిల్
» అత్యధిక కాలం (2 పర్యాయాలు) (1952 – 62) ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి వ్యక్తి – డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
» తొలి ముస్లిం ఉపరాష్ట్రపతి – డాక్టర్ జాకీర్ హుస్సేన్
» అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన వ్యక్తి – వరాహగిరి వెంకటగిరి
» తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి ఉపరాష్ట్రపతి – వరాహగిరి వెంకటగిరి
» ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి – జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా
» పెద్ద వయసులో ఉపరాష్ట్రపతిగా (73 ఏళ్లు) వ్యవహరించిన తొలి వ్యక్తి – ఆర్.వెంకట్రామన్
» అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి – జవహర్ లాల్ నెహ్రూ (17 సంవత్సరాలు; 1947 – 64)
» . పదవిలో ఉండగా మరణించిన మొదటి ప్రధాని – జవహర్‌లాల్ నెహ్రూ
» ఆర్థికమంత్రి హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని – జవహర్‌లాల్ నెహ్రూ
» విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని – లాల్‌బహదూర్‌శాస్త్రి
» మొదటి మహిళా ప్రధాని – ఇందిరాగాంధీ
» ప్రధానిగా వ్యవహరిస్తూ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన మొదటి ప్రధాని – ఇందిరాగాంధీ (1977)
» రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానిగా ఎన్నికైన మొదటి వ్యక్తి – ఇందిరాగాంధీ
» అత్యధిక రాజ్యాంగ సవరణలు చేసిన మొదటి ప్రధాని – ఇందిరాగాంధీ
» ఎక్కువసార్లు రాష్ట్రపతి పాలన విధించిన మొదటి ప్రధాని (48 సార్లు) – ఇందిరాగాంధీ
» హత్యకు గురైన మొదటి ప్రధాని – ఇందిరాగాంధీ
» అరెస్టు అయిన మొదటి ప్రధాని – ఇందిరాగాంధీ
» మొదటి కాంగ్రెసేతర ప్రధాని – మొరార్జీ దేశాయ్
» పెద్ద వయసులో ప్రధానిగా (81 ఏళ్లు) వ్యవహరించిన వ్యక్తి – మొరార్జీ దేశాయ్
» ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి – మొరార్జీ దేశాయ్
» మొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి – చరణ్ సింగ్
» తన పదవీకాలంలో పార్లమెంటులో అడుగుపెట్టని ఏకైక ప్రధాని – చరణ్ సింగ్
» అతి పిన్న వయసులో (47 ఏళ్లు) ప్రధాని పదవిని అధిష్టించిన తొలి వ్యక్తి – రాజీవ్ గాంధీ
» విశ్వాస తీర్మానం ద్వారా తొలగించబడిన ఏకైక ప్రధాని – విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్
» ఎర్రకోట నుంచి ప్రసంగించని ఏకైక ప్రధాని – చంద్రశేఖర్
» దక్షిణ భారత దేశం నుంచి ప్రధాని అయిన మొదటి వ్యక్తి – పి.వి. నరసింహారావు
» పార్లమెంటులో సభ్యత్వం లేకుండా ప్రధాని అయిన తొలి వ్యక్తి – పి.వి. నరసింహారావు
» ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధాని – అటల్ బిహారీ వాజ్‌పేయ్
» ‘వరల్డ్ స్టేట్స్‌మెన్’ అవార్డు పొందిన ఏకైక ప్రధాని – ఐ.కె. గుజ్రాల్
» ప్రధానమంత్రి పదవిని అలంకరించిన మొదటి ఆర్థికవేత్త – మన్మోహన్ సింగ్
» ఏకైక తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి – గుల్జారీలాల్ నందా
» లోక్‌సభ తొలి స్పీకర్ – గణేష్ వాసుదేవ్ మౌలాంకర్
» లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు – నీలం సంజీవరెడ్డి
» రెండు లోక్‌సభలకు స్పీకర్‌గా చేసిన తొలి వ్యక్తి – డాక్టర్ బలరాం జక్కర్
» లోక్‌సభకు తొలి దళిత స్పీకర్ – జి.ఎం.సి. బాలయోగి
» లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్ – మీరాకుమార్‌
» భారత తొలి ఎన్నికల కమిషనర్ – సుకుమార్ సేన్
» భారత ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు – ఆర్.ఎ.ఎస్. పేరిశాస్త్రి
» భారత ఎన్నికల తొలి మహిళా కమిషనర్ – వి.ఎస్. రమాదేవి
» అతి తక్కువ కాలం ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరించిన వ్యక్తి – వి.ఎస్. రమాదేవి (16 రోజులు)
» మొదటి మహిళా గవర్నర్ – సరోజినీ నాయుడు (ఉత్తర్ ప్రదేశ్, 1947 – 49)
» మొదటి మహిళా ముఖ్యమంత్రి – సుచేతా కృపాలానీ (ఉత్తర్ ప్రదేశ్, 1963 – 67)
» మొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి – మాయావతి (ఉత్తర్ ప్రదేశ్, 1995)
» మొదటి దళిత ముఖ్యమంత్రి – దామోదరం సంజీవయ్య (ఆంధ్రప్రదేశ్, 1960 – 62)
» ముఖ్యమంత్రి అయిన తొలి సినిమా నటుడు – ఎం.జి. రామచంద్రన్ (తమిళనాడు)
» ముఖ్యమంత్రి అయిన తొలి స్వతంత్ర అభ్యర్థి – బిశ్వనాథ్ దేశ్ (1971)
» అవినీతి కుంభకోణంపై అరెస్టు అయి జైలుకు వెళ్లిన తొలి ముఖ్యమంత్రి – జయలలిత (తమిళనాడు, 1996)
» ప్రజలు ఎన్నుకున్న తొలి లెఫ్ట్ ప్రభుత్వాధినేత (ప్రపంచంలో కూడా) – నంబూద్రిపాద్ (కేరళ, 1957)
» ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి హిజ్రా – షబ్మమ్ మౌసి (మధ్యప్రదేశ్, 2000)
» ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయురాలు – భాను అథయా (1983)
» ఆస్కార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు పొందిన తొలి భారతీయుడు – సత్యజిత్ రే (1992)
» రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి భారతీయుడు – ఆచార్య వినోబా భావే (1958)
» రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి మహిళ – మదర్ థెరిసా (1962)
» రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి ఆసియావాసి – ఆచార్య వినోబా భావే(1958)
» రామన్ మెగసెసె అవార్డును మొదటిగా గ్రహించింది – ఆచార్య వినోబా భావే
» సామాజిక నాయకత్వంలో రామన్‌మెగసెసె అవార్డును తొలిగా గ్రహించింది – ఆచార్య వినోబా భావే(1958)
» రామన్‌మెగసెసె అవార్డు పొందిన తొలి తండ్రీకొడుకులు – బాబా ఆమ్టే (1985), ప్రకాష్ ఆమ్టే (2008)
» రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి భార్యాభర్తలు – మందాకినీ ఆమ్టే (2008), ప్రకాశ్ ఆమ్టే (2008)
» ఎమర్జంట్ లీడర్‌షిప్ అంశం కింద రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి భారతీయుడు – సందీప్ పాండే (2002)
» జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి వ్యక్తి – శంకర కురూప్ (1965) (రచన: ఒడక్క జుల్, మలయాళం)
» జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి మహిళ – ఆషాపూర్ణాదేవి (1976, ప్రథమ్, ప్రతిశ్రుతి, బెంగాలీ)
» బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయుడు – వి.ఎస్. నైపాల్ (1971)
» బుకర్‌ప్రైజ్ పొందిన తొలి భారతీయ మహిళ – అరుంధతీ రాయ్ (ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, 1997)
» పులిట్జర్ బహుమతి పొందిన తొలి భారతీయ మహిళ – ఝంపా లాహిరి (2000)
» దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి వ్యక్తి – దేవికారాణి రోరిచ్ (1969)
» దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి ఆంధ్రుడు – బి.ఎన్.రెడ్డి (1974)
» బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన తొలి వ్యక్తి – ఇంద్రజిత్ గుప్తా (1993)
» ఎన్టీఆర్ అవార్డు పొందిన తొలి వ్యక్తి – అక్కినేని నాగేశ్వరరావు (1996)
» వైశ్రాయ్ కౌన్సిల్ మొదటి భారతీయ సభ్యుడు – ఎస్.పి. సిన్హా
» సుప్రీంకోర్టు మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి – కె.జి. బాలకృష్ణన్ (2007)
» మహాభియోగ తీర్మానాన్ని ఎదుర్కొన్న తొలి, ఏకైక సుప్రీంకోర్టు న్యాయమూర్తి – జస్టిస్ వి. రామస్వామి (1993)
» తొలి మహిళా మేజిస్ట్రేట్ – ఓమన కుంజమ్మ
» అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు – డాక్టర్ నాగేందర్ సింగ్
» రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు – విశ్వనాథన్ ఆనంద్ (చదరంగం, 1991 – 94)
» రాజీవ్‌ఖేల్‌రత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారిణి – కరణం మల్లేశ్వరి (1995)
» రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పొందిన తొలి క్రికెటర్ – సచిన్ టెండూల్కర్ (1997)
» బాక్సింగ్‌లో రాజీవ్‌ఖేల్‌రత్న అవార్డు పొందిన తొలి మహిళ – మేరికోమ్ (మణిపూర్)
» పరమవీర చక్ర అవార్డు పొందిన తొలి వ్యక్తి – సోమనాథ్ శర్మ
» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు – టెన్సింగ్ నార్కే (1953, మే 29)
» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలు – బచేంద్రిపాల్ (1984)
» ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన తొలి భారతీయురాలు – సంతోష్‌యాదవ్ (1993, మే 10)
» ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న తొలి దక్షిణ భారతీయుడు – శేఖర్ బాబు (ఆంధ్రప్రదేశ్)
» ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన తొలి వ్యక్తి – నవాంగ్ గొంబూ (1965)
» ఎవరెస్ట్ శిఖరాన్ని ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన తొలి వ్యక్తి – పూదోర్జి
» తొలి భారతీయ ఐ.పి.ఎస్. అధికారి – సత్యేంద్రనాథ్ ఠాగూర్
» తొలి మహిళా ఐ.ఎ.ఎస్. అధికారి – అన్నాజార్జ్
» తొలి మహిళా ఐ.పి.ఎస్. అధికారి – కిరణ్‌బేడి (1972)
» తొలి మహిళా డి.జి.పి. అధికారి – కంచన్ చౌదరి భట్టాచార్య (ఉత్తరాఖండ్)
» ఐక్యరాజ్యసమితి సివిల్ పోలీస్‌కు సలహాదారుడిగా నియమితులైన తొలి భారతీయ మహిళ – కిరణ్‌బేడి
» భారతీయ రైల్వే బోర్డులో మొదటి మహిళా సభ్యురాలు – విజయలక్ష్మీ విశ్వనాథన్
» తొలి మహిళా రాయబారి – విజయలక్ష్మి పండిట్ (మాజీ సోవియట్‌కు, 1947 – 49)
» తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి – చోకిలా అయ్యర్
» ఇంగ్లిష్‌ఛానెల్ ఈదిన తొలి మహిళ – ఆర్తిసాహా (1959)
» ఇంగ్లిష్ ఛానెల్‌ను ఈదిన తొలి భారతీయుడు – మిహిర్‌సేన్ (1958)
» ఇంగ్లిష్ ఛానెల్‌ను రెండుసార్లు ఈదిన తొలి భారతీయురాలు – బులా చౌదరి (2004)
» సప్త సముద్రాల్లోని 7 జలసంధులను ఈదిన తొలి భారతీయురాలు – బులా చౌదరి (ప్రపంచంలోనే మొదటి వ్యక్తి)
» జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన మొదటి భారతీయ మహిళ – ఆర్తి సాహా
» అయిదు ఖండాల్లో సముద్రాలను ఈదిన తొలి మహిళ – బులా చౌదరి
» స్వతంత్ర భారత పోస్టల్ స్టాంపుపై దర్శన మిచ్చిన తొలి వ్యక్తి – మహాత్మా గాంధీ (1948)
» మొదటి భారతీయ మహిళా ఫొటో జర్నలిస్ట్ – హోమియా వ్యారవల్లా (బాంబే క్రానికల్, 1938)
» రైల్వే ఇంజిన్ డ్రైవర్ అయిన మొదటి భారతీయ మహిళ – సురేఖా యాదవ్ (ఇండియన్ రైల్వేస్, 1992)
» నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు – ఒమనా అబ్రహం (కొట్టాయం, కేరళ)
» భారత్‌ను పాలించిన తొలి మహిళ – రజియా సుల్తానా (1236 – 1240)
» అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు – రాకేష్ శర్మ (1984)
» అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ టూరిస్ట్ – సంతోష్ జార్జి (కేరళ)
» అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన తొలి మహిళ – కల్పనా చావ్లా
» ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం పొందిన తొలి భారతీయుడు – ఖాషాబా జాదవ్ (1952, రెజ్లింగ్, కాంస్యం)
» ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారతీయురాలు – కరణం మల్లేశ్వరి (2000, వెయిట్‌లిఫ్టింగ్, కాంస్యం)
» ఒలింపిక్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళ – పి.టి. ఉష (1984)
» ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయుడు – రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (2004, ఏథెన్స్, షూటింగ్)
» ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు – అభినవ్ బింద్రా (2008, బీజింగ్, షూటింగ్)
» భూగోళం చుట్టివచ్చిన మొదటి భారతీయుడు – లెఫ్టినెంట్ కల్నల్ కె.ఎస్. రావు
» భూగోళం చుట్టివచ్చిన తొలి భారతీయ మహిళ – ఉజ్వల రాయ్
» చదరంగంలో తొలి భారతీయ గ్రాండ్‌మాస్టర్ – విశ్వనాథన్ ఆనంద్
» చదరంగంలో తొలి భారతీయ మహిళా గ్రాండ్ మాస్టర్ – ఎస్. విజయలక్ష్మి (2000)
» ప్రపంచ బిలియర్డ్స్ ట్రోఫీని గెలుచుకున్న తొలి భారతీయుడు – విల్సన్ జోన్స్
» ప్రపంచ అథ్లెటిక్స్‌లో పతకం పొందిన తొలి భారతీయ మహిళ – అంజూ బాబీ జార్జ్
» అంటార్కిటికాను చేరిన తొలి భారతీయుడు – లెఫ్టినెంట్ రామ్‌చరణ్ (1960)
» అంటార్కిటికాను చేరుకున్న తొలి భారతీయ మహిళ – మోహర్‌మూస్ (1976)
» మొదటి భారతీయ ప్రపంచ సుందరి – రీటా ఫారియా (1966)
» మొదటి భారతీయ విశ్వసుందరి – సుస్మితాసేన్ (1994)
» మొదటి మిస్ ఇండియా – ప్రమీల (1947)
» మొదటి మిస్ ఏసియా పసిఫిక్ – దియామీర్జా (2000)
» పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి నటి – నర్గీస్ దత్
» నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు (ఆసియావాసి) – రవీంద్రనాధ్ ఠాగూర్ (1913)
» నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ వనిత – మదర్ థెరిసా (శాంతి, 1971)
» ఆసియాన్ గేమ్స్‌లో వ్యక్తిగత బంగారు పతకం పొందిన తొలి భారతీయ మహిళ – కమలజిత్ సంధూ (1970)
» భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ – సి.కె. నాయుడు (1932)
» స్వతంత్ర భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ – లాలా అమర్‌నాథ్ (1947 – 48)
» తొలి టెస్ట్ సెంచరీ సాధించిన భారతీయుడు – లాలా అమర్‌నాథ్ (ఇంగ్లండ్‌పై)
» ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడు – వీరేంద్ర సెహ్వాగ్ (పాకిస్థాన్, 2004)
» టెస్టుల్లో పదివేల పరుగులు పూర్తిచేసిన తొలి భారతీయుడు – సునీల్ గవాస్కర్
» టెస్టుల్లో వన్డేల్లో పదివేల పరుగులు పూర్తిచేసిన తొలి భారతీయుడు – సచిన్ టెండూల్కర్
» టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయుడు – హర్భజన్ సింగ్ (ఆస్ట్రేలియాపై 2001)
» భారతదేశ మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ – విలియం బెంటిక్
» భారత్‌లో హత్యకు గురైన ఏకైక వైశ్రాయి – లార్డ్ మేయో (1872)
» బెంగాల్ మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ – వారన్ హేస్టింగ్స్
» భారత్‌లో మొదటి పైలట్ – జె.ఆర్.డి. టాటా (1929)
» ఎయిర్ బస్ మొదటి భారతీయ మహిళా పైలట్ – దుర్గా బెనర్జీ
» వైమానిక దళంలో పైలట్‌గా పనిచేసిన తొలి భారతీయ మహిళ – హరితాకౌర్ దయాల్
» మొదటి భారతీయ ఎయిర్ మార్షల్ – అర్జున్ సింగ్
» వైమానిక దళ తొలి మహిళా ఎయిర్ వైస్ మార్షల్ – పద్మా బందోపాధ్యాయ
» మొదటి వైమానిక దళాల ప్రధానాధికారి – ఎస్.కె. ముఖర్జి (1954 – 60)
» మొదటి నావికా దళాల ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ – ఆర్.డి. కటారి (1958 – 62)
» నావికా దళంలో మొదటి మహిళా వైస్ అడ్మిరల్ – పునీతా అరోరా
» సైనికా దళంలో తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్ – పునీతా అరోరా
» సైనిక దళాల మొదటి ప్రధానాధికారి – జనరల్ ఎమ్. రాజేంద్ర సింగ్ (1955)
» తొలి ఫీల్డ్ మార్షల్ జనరల్ – మానెక్ షా (1973)
» స్వతంత్ర భారత మొదటి ఎయిర్ చీఫ్ ఎయిర్ మార్షల్ – సర్ థామస్ ఎల్ మ్రిస్ట్ (1947 – 50)
» స్వతంత్ర భారత తొలి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ – కె.ఎం. కరియప్ప (1949 – 53)
» డబ్ల్యూహెచ్‌వో ఆరోగ్య సమావేశాలకు అధ్యక్షత వహించిన మొదటి మహిళ – రాజకుమారి అమృత కౌర్ (1950)
» తొలి భారతీయ మహిళా వైద్యురాలు – కాదంబినీ గంగూలీ (1886)
» పదవిలో ఉండగా మరణించిన ఏకైక స్పీకర్ – జి.ఎం.సి. బాలయోగి
» మొదటి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ – ఎస్.వి. కృష్ణమూర్తి (1952)
» రాజ్యసభకు తొలి మహిళా డిప్యూటీ ఛైర్మన్ – వయిలెట్ ఆల్వా (1962 – 69)
» రాజ్యసభ మొదటి మహిళా సెక్రటరీ జనరల్ – వి.ఎస్. రమాదేవి
» మొదటి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ – అనంతశయనం అయ్యంగార్ (1952 – 56)
» మొదటి మహిళా కేంద్రమంత్రి – రాజకుమారి అమృతకౌర్ (ఆరోగ్యశాఖ 1947 – 57)

 

» మొదటి విద్యాశాఖామంత్రి – మౌలానా అబుల్ కలాం ఆజాద్
» తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి – ఆర్.కె. షుణ్ముగం చెట్టి (1947)
» రాష్ట్రాల పరంగా తొలి మహిళా మంత్రి – విజయలక్ష్మీ పండిట్ (ఉత్తర ప్రదేశ్)
» రాష్ట్రాలపరంగా మొదటి మహిళా స్పీకర్ – షానోదేవి (హర్యానా)
» సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేసినవారు – వై.వి. చంద్రచూడ్ (7 ఏళ్లకు పైగా)
» సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం పనిచేసినవారు – కె.ఎన్. సింగ్ (18 రోజులు)
» మొదటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ – వి. నరహరి రావు
» మొదటి అటార్నీ జనరల్ – ఎం.సి. సెతల్‌వాడ్
» మొదటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ – హెచ్.కె. కృపలాని
» దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టిన తొలి ప్రధాని – వి.పి. సింగ్
» కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ప్రధాని – మన్మోహన్ సింగ్
» రఘుపతి వెంకయ్య అవార్డు పొందిన తొలి వ్యక్తి – ఎల్.వి. ప్రసాద్
» టెంపుల్టన్ అవార్డు పొందిన తొలి భారతీయుడు – సర్వేపల్లి రాధాకృష్ణన్
» రైట్ టు లైవ్‌లీ హుడ్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి – రూత్ మనోరమ
» ఎర్రకోటపై ఎక్కువసార్లు జాతీయ జెండాను ఎగరవేసిన తొలి ప్రధాని – జవహర్‌లాల్ నెహ్రూ (17 సార్లు)
» తొలి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్ – డాక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్
» చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులైన తొలి వ్యక్తి – ఎన్. శ్రీనివాసరావు
» జాతీయ సమగ్రతా మండలికి తొలి అధ్యక్షుడు – జవహర్‌లాల్ నెహ్రూ
» జాతీయ భద్రతా మండలికి తొలి అధ్యక్షుడు – బ్రిజేష్ మిశ్రా
» జాతీయ వినియోగదారుల కమిషన్ మొదటి ఛైర్మన్ – జస్టిస్ వి. బాలకృష్ణ ఎరాడి
» తొలి కేంద్ర‌ న్యాయశాఖామంత్రి – డాక్టర్ అంబేద్కర్
»తొలి కేంద్ర‌ కార్మిక శాఖామంత్రి – బాబూ జగ్‌జ్జీవన్ రామ్
» తొలి కేంద్ర‌ రక్షణ శాఖామంత్రి – బల్‌దేవ్‌సింగ్
» తొలి కేంద్ర‌ హోంశాఖామంత్రి – సర్దార్ వల్లభాయ్ పటేల్
» తొలి కేంద్ర‌ వ్యవసాయ శాఖామంత్రి – బాబూ రాజేంద్రప్రసాద్
» తొలి కేంద్ర‌ ఆర్థికమంత్రి – ఆర్.కె. షణ్ముగం చెట్టి
» ఉత్తర ధ్రువాన్ని చేరుకున్న తొలి వ్యక్తి – రాబర్ట్ పియరీ (1909)
» దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి మహిళ – కరోలిన్ మికెల్‌సెన్ (1935)
» దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి వ్యక్తి – అముండ్‌సెన్ (నార్వే, 1911)
» దేశానికి అధ్యక్షురాలైన తొలి మహిళ – ఇసబెల్ పెరాన్ (అర్జెంటీనా, 1974)
» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులు – టెన్సింగ్ నార్కే (భారత్), ఎడ్మండ్ హిల్లరీ (న్యూజిలాండ్) 1955
» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి తల్లీకూతుళ్లు – చెరైల్ బర్ట్, సిక్కి (ఆస్ట్రేలియా, 2008)
» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి దంపతులు – ఆండ్రిజ్, మరిజా స్ట్రీమ్‌ఫెల్జ్ (స్లోవేకియా)
» ఎవరెస్ట్ శిఖరాన్ని ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన తొలి వ్యక్తులు – పీటర్ హబెలర్ (ఆస్ట్రేలియా), రెన్‌హోల్డ్ మెస్నర్ (ఇటలీ)
» ఎవరెస్ట్ శిఖరంపై అధిక సమయం గడిపిన తొలి వ్యక్తి – బాబూ చిరిషెర్పా
» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి అతిపిన్న వయస్కురాలు – డిక్కిడోల్మ
» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వికలాంగుడు – టామ్ విట్టేకర్
» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి అంధుడు – ఎరిక్ విహెన్మియర్ (అమెరికా, 2001)
» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ – జుంకోతాబి (జపాన్, 1975)
» తొలి విశ్వసుందరి – ఆర్మికౌసెల (ఫిన్‌లాండ్, 1952)
» తొలి ప్రపంచ సుందరి – కెర్‌స్టిన్ కికి హాకోన్సన్ (స్వీడన్, 1951)
 
» చంద్రుడిపై కాలు మోపిన తొలి వ్యక్తి – నీల్ఆర్మ్‌స్ట్రాంగ్ (అమెరికా 1969)
» బ్రిటన్ మొదటి ప్రధాని – రాబర్ట్ వాల్‌పోల్ (1721)
» బ్రిటన్ మొదటి మహిళా ప్రధాని – మార్గరెట్ థాచర్ (కన్జర్వేటివ్ పార్టీ, 1979 – 90)
» సముద్ర మార్గంలో ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి వ్యక్తి – ఫెర్టినాండ్ డిమాజిలాన్ (స్పెయిన్)
» జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి మహిళ – ఆర్తి సాహా (భారత్)
» జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి వికలాంగుడు – తారానాథ్ షెనాయ్ (1988)
» అమెరికా మొదటి అధ్యక్షుడు – జార్జి వాషింగ్టన్ (1789)
» రాజీనామా చేసిన మొదటి అమెరికా అధ్యక్షుడు – రిచర్డ్ నిక్సన్ (1974)
» హత్యకు గురైన మొదటి అమెరికా అధ్యక్షుడు – అబ్రహం లింకన్ (1865)
» గ్రాండ్ స్లామ్ సాధించిన తొలి మహిళ – మౌరీన్ క్యాథరిన్ (1953)
» మొదటి ప్రపంచ చెస్ ఛాంపియన్ – విల్‌హెల్మ్ స్టెయిన్ట్జ్ (1886)
» ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న తొలి మహిళ – చార్లొట్టే కూపర్ (యూకే టెన్నిస్, 1900)
» జర్మనీ మొదటి మహిళా ఛాన్సెలర్ – ఎంజెలా మెర్కెల్ (2005)
» దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన తొలి నల్ల జాతీయుడు – నెల్సన్ మండేలా (1994)
» అమెరికాకు అధ్యక్షుడైన తొలి నల్ల జాతీయుడు – బరాక్ హుస్సేన్ ఒబామా
» తొలి మహిళా బిషప్ – రీవ్ బార్బరా సి హ్యారీస్ (1988, అమెరికా)
» అంతరిక్షంలోకి పంపిన తొలి జీవి – లైలా అనే కుక్క (స్పుత్నిక్ – 2, 1957)
» అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి అమెరికా వ్యోమగామి – అలెన్ షెపర్డ్ (1961)
» అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి – యూరీ గగారిన్ (సోవియట్ యూనియన్ 1961)
» అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ – వాలెంటీనా తెరిష్కోవా (యూఎస్ఎస్ఆర్, 1963)
» అంతరిక్షంలో నడిచిన తొలి వ్యక్తి – అలెక్సి లియనోవ్ (యూఎస్ఎస్ఆర్, 1965)
» అంతరిక్షంలో నడిచిన తొలి మహిళ – స్వెత్లానా సవిత్సకయ (యూఎస్ఎస్ఆర్, 1982)
» అంతరిక్షంలో పర్యటించిన తొలి స్పేస్ టూరిస్ట్ – డెన్నిస్ టిటో (అమెరికా, 2001)
» అంతరిక్షంలో పర్యటించిన తొలి మహిళా టూరిస్ట్ – అనౌషి అన్సారి (2006)
» అంతరిక్షంలోకి వెళ్లిన తొలి ముస్లిం మహిళ – అనౌషి అన్సారి (2006)
» ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు పొందిన తొలి వ్యక్తి – ఎమిల్ జెన్నింగ్స్ (1928)
» ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు పొందిన తొలి నల్ల జాతీయురాలు – హాలీ బెర్రి (2002)
» ఓడపై ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి వ్యక్తి – ఫెర్డినాండ్ మాజిలాన్ (స్పెయిన్)
» పులిట్జర్ బహుమతి పొందిన తొలి నల్లజాతీయురాలు – జి.బ్రూక్స్ (1950)
» ఐక్యరాజ్యసమితి తొలి సెక్రెటరీ జనరల్ – ట్రిగ్వేలీ (నార్వే, 1946 – 53)
» ఐక్యరాజ్యసమితి తొలి డిప్యూటీ సెక్రెటరీ జనరల్ – లూయిస్ ఫ్రీ చెట్టి
» గ్రాడ్యుయేట్ అయిన తొలి మూగ, చెవిటి మహిళ – హెలెన్ కెల్లర్ (1904)
» అంటార్కిటిక్ వలయాన్ని దాటిన తొలి వ్యక్తి – జేమ్స్ కుక్ (1773)
» ప్రపంచంలో అన్ని ఖండాల్లోని ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ – అన్నా బిల్లీబెండ్
» ఇంగ్లిష్ ఛానెల్ ఈదిన తొలి వ్యక్తి – మాథ్యువెబ్ (1875)
» తొలి టెస్ట్‌ట్యూబ్ బేబి – లూయిస్ బ్రౌన్ (1978, ఇంగ్లండ్)
» గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించిన తొలి వ్యక్తి – క్రిస్టియన్ బెర్నార్డ్ (1967, దక్షిణాఫ్రికా)
» భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి – విలియం రాంట్‌జన్ (1901, జర్మనీ)
» రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి – జాకబ్స్ వాంట్ హాప్ (1901, నెదర్లాండ్స్)
» వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి – ఎమిల్ అడాల్ఫ్ వాన్ బేరింగ్ (1901, జర్మనీ)
» ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తులు – రాగ్నర్ ఫ్రిష్ (నార్వే), జాన్ టిన్ బెర్జెన్ (నెదర్లాండ్స్) 1969
» నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి వ్యక్తులు – జీన్ హెన్రీ డ్యునాంట్ (స్విస్), ఫ్రెడరిక్ పాసీ (ఫ్రాన్స్)
» సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి – సల్లీప్రుదోమ్మి (ఫ్రాన్స్, 1901)
» నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి నల్లజాతీయుడు – రాల్ఫ్ బంచె (1950)
» రెండుసార్లు నోబెల్ బహుమతి అందుకున్న తొలి వ్యక్తి – మేరీ క్యూరి (భౌతికశాస్త్రం (1903), రసాయన శాస్త్రం (1911))
» నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి ముస్లిం మహిళ – షిరిన్ ఎబాది (ఇరాన్, 2003)
» అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ – రోజాలిన్ హిగ్గిన్స్
» జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ మొదటి ఛైర్మన్ – సూరజ్ భాను
» జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ మొదటి ఛైర్మన్ – కున్వర్ సింగ్
» జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ మొదటి ఛైర్మన్ – ఆర్.ఎన్. ప్రసాద్
» జాతీయ మైనారిటీల కమిషన్ మొదటి ఛైర్మన్ – జస్టిస్ ఎం.డి. సర్దార్ అలీఖాన్
» జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ మొదటి ఛైర్మన్ – శాంతా సిన్హా
» జాతీయ మానవ హక్కుల కమిషన్ మొదటి ఛైర్మన్ – జస్టిస్ రంగనాథ్ మిశ్రా
» వయోపరిమితి సమస్య ఎదుర్కొన్న తొలి సైనిక దళాల ప్రధాన అధికారి – జనరల్ వి.కె. సింగ్
» 1987లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి యుద్ధ ట్యాంకు – వైజయంతి
» భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి పైలట్ రహిత యుద్ధ విమానం – నిశాంత్
» భారత నావికాదళంలో తొలి యుద్ధ నౌక – ఐఎన్ఎస్ సావిత్రి
» ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి యుద్ధ నౌక – ఐఎన్ఎస్ తరంగిణి
» భారత్‌లో తొలి విమాన వాహక నౌక – ఐఎన్ఎస్ విశ్రాంత్
» మన దేశ తొలి గూఢచార నౌక – ఐఎన్ఎస్ శివాలిక్
» స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన దేశ తొలి క్షిపణి నౌక – ఐఎన్ఎస్ విభూతి
» దేశీయ పరిజ్ఞానంతో తయారైన తొలి సబ్‌మెరైన్ – ఐఎన్ఎస్ షల్కి
» భారత దేశ తొలి అణు సబ్‌మెరైన్ – ఐఎన్ఎస్ చక్ర
» స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి అణు జలాంతర్గామి – అరిహంత్ (2009)
» మన దేశ తొలి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం – భాస్కర – 1
» ప్రపంచంలోనే తొలిసారిగా సముద్ర పరిశోధనలకు ప్రయోగించిన ఉపగ్రహం – ఓషన్‌శాట్ – 1
» చంద్రుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం – చంద్రయాన్ – 1
» సింగపూర్ తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం – ఎక్సోశాట్
» జీఎస్ఎల్వీ శ్రేణిలో మొదటి నౌక – జీఎస్ఎల్వీ – డీ1
» స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి – పృథ్వీ
» గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉన్న తొలి క్షిపణి – అగ్ని-2
» భారతదేశ తొలి ఖండాంతర క్షిపణి – సూర్య
» భారతదేశ తొలి అణు పరిశోధనా కేంద్రం – బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బీఏఆర్‌సీ)
» భారతదేశ తొలి ప్రయోగాత్మక భూపరిశీలన ఉపగ్రహం – భాస్కర – 1
» భారతదేశ తొలి జియో స్టేషనరీ ఉపగ్రహం – ఆపిల్
» అమెరికా తొలి రోదసి నౌక – ఎక్స్‌ప్లోరర్
» మనదేశంలో తొలి ఎఫ్.ఎం. స్టేషన్ ప్రారంభమైన నగరం – చెన్నై (1977)
» ప్రైవేటు రంగంలో తొలి ఎఫ్.ఎం. ప్రారంభమైన నగరం – బెంగళూరు (2001)
  100+ భారత దేశంలోని పారిశ్రామిక నగరాలు AP GK Questions in Telugu

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top