100+ రకరకాల ఫోబియాలు (భయాలు) AP GK Questions in Telugu

రకరకాల ఫోబియాలు (భయాలు)

ర‌కం ఫోబియా పేరు
» ఉష్ణోగ్రత థర్మోఫోబియా
» చలి సైక్రో ఫోబియా లేదా క్రియో ఫోబియా
» కొత్తవారు క్సెనో ఫోబియా
» స్త్రీలు గైనో ఫోబియా
» పక్షులు ఆర్నితో ఫోబియా
» విమానాలు (ఎగరటం) ఏరో ఫోబియా లేదా టెరో ఫోబియో
» వర్షం ఓంబ్రో ఫోబియా
» ఎగరటం అవిటో ఫోబియా (ఏరో ఫోబియా)
» దెయ్యాలు డెమనో ఫోబియా
»జంతువులు జూ ఫోబియా
» మంచు చినో ఫోబియా
» లోతు బాతో ఫోబియా
» మురికి, మలినం రూపో ఫోబియా లేదా మైసో ఫోబియా
» రక్తం హెమటో ఫోబియా లేదా హెమో ఫోబియా
» చీకటి నిక్టో ఫోబియా లేదా స్కాటో ఫోబియా
» నీరు హైడ్రో ఫోబియా
» దంత వైద్యుడు డెంటో ఫోబియా
» సూర్యుడు లేదా సూర్యకాంతి హీలియో ఫోబియా
» గర్భం మాయూసియో ఫోబియా
» అంతరిక్షం ఆస్ట్రో ఫోబియా
» గుర్రాలు ఈక్వినో ఫోబియా/ హిప్పో ఫోబియా
» క్యాన్సర్ క్యాన్సరో ఫోబియా/ కార్సినో ఫోబియా
» ఎత్తులు అక్రో ఫోబియా
» పురుషులు అండ్రో ఫోబియా
» క్రిములు ఎంటమో ఫోబియా
» తాగుడు డిప్సో ఫోబియా
» అందం కల్లో ఫోబియా
»కుక్కలు కైనో ఫోబియా
» విదేశీయులు గ్జెనో ఫోబియా
» ఆహారం కైబో ఫోబియా
» సంఖ్యలు ఆర్థిమో ఫోబియా/ న్యూమరో ఫోబియా
» చిన్న పిల్లలు పిడో ఫోబియా
» మార్పు నియో ఫోబియా
» భిక్షగాళ్లు హోబో ఫోబియా
» సముద్రం తలస్సో ఫోబియా
» అందవిహీనత కాకో ఫోబియా
» అనారోగ్యం నోసో ఫోబియా లేదా పాతో ఫోబియా
» సంపద ఫ్లూటో ఫోబియా
» శబ్దం ఫోనో ఫోబియా
» కీటకాలు స్కోయిలికి ఫోబియా లేదా హెల్మింథో ఫోబియా
» కూరగాయలు లచనో ఫోబియా
»మరణించిన దేహాలు తనాటో ఫోబియా
» తొండలు, బల్లులు హెర్పిటో ఫోబియా
» నిప్పులు పైరో ఫోబియా
» బంగారం ఓరో ఫోబియా
» వెంట్రుకలు చాటో ఫోబియా
» పిల్లులు అల్యురో ఫోబియా
» రంగులు క్రోమో ఫోబియా
» దుమ్ము కోనియో ఫోబియా
» కాంతి అస్ట్రా ఫోబియా/ కిరౌనో ఫోబియా
» సాలిపురుగులు అరాక్నో ఫోబియా
» పాములు ఒపిహియో ఫోబియా
» రోడ్డును దాటటం అజిరో ఫోబియా
» వృద్ధాప్యం జెరాస్కో ఫోబియా
» కొత్తదనం కైనలో ఫోబియా
» కదులుట కైవసో ఫోబియా
» చేపలు ఇక్తియో ఫోబియా
» శస్త్ర చికిత్స ఎర్గాసిమో ఫోబియా/ టోమో ఫోబియా
» దొంగతనం క్లెప్టో ఫోబియా
» ఇంజక్షన్లు ట్రైపనో ఫోబియా
» సజీవంగా పూడ్చటం తాపో ఫోబియా
» ఒంటరితనం మోనో ఫోబియా
» పూజారులు హయరో ఫోబియా
» విద్యుత్ ఎలక్ట్రో ఫోబియా
» ఆల్కహాల్ మేథి ఫోబియా
» జ్వరం ఫెబ్రి ఫోబియా
» అబద్ధాలు చెప్పుడం మితో ఫోబియా
» ప్రయాణం హోడో ఫోబియా
» రైలు సైడి రోడ్రోమో ఫోబియా
» ఆటోమొబైల్స్ మొటోర్ ఫోబియా
» తాగటం డిస్సో ఫోబియా
» విఫలమవడం అటిబి ఫోబియా
» పొగమంచు హోమిచ్‌లో ఫోబియా
» టోర్నడోలు లితోప్సో ఫోబియా
» భూతాలు పోస్మో ఫోబియా
» అందమైన స్త్రీలు వెనుస్ట్ర ఫోబియా
» కూర్చుండుట కాతిసో ఫోబియా
» వీధులు/ వీధులు దాటుట డ్రోమో ఫోబియా
» బహిరంగ ప్రదేశాలు అగ్రో ఫోబియా/ సినో ఫోబియా
» వాంతులు ఎమిటో ఫోబియా
» ఖాళీ ప్రదేశాలు కెనో ఫోబియా
» ప్రత్యేక ప్రదేశం టోపా ఫోబియా
» వేగం టాకో ఫోబియా
» చిట్టెలుక మ్యాసో ఫోబియా
» ఆసుపత్రులు నోసాకొమె ఫోబియా
» చర్చ్‌లు ఎక్లిసియో ఫోబియా
» ఉరుము కెరౌనో ఫోబియా
» గడ్డం, మీసపు వెంట్రుకలు పోగోన్ ఫోబియా
» తుఫానులు అనిమో ఫోబియా
» వైద్యుని దగ్గరకు వెళ్లటం ఇయట్రో ఫోబియా
» పిల్లలు గెట్టో ఫోబియా
» విష ప్రయోగం టాక్సికో ఫోబియా లేదా ఇయో ఫోబియా
» ఎడారులు/ పొడి ప్రదేశాలు గ్జిరో ఫోబియా
» సరిహద్దులు లేదా ప్రహరీలు క్లిత్‌రో ఫోబియా లేదా క్లస్ట్‌రో ఫోబియా
» సొర చేపలు గలియో ఫోబియా
» ఈగలు అపియో ఫోబియా/ మెలిస్సో ఫోబియా
» సామూహికం ఆంత్రో ఫోబియా/ సోషియో ఫోబియా
» నొప్పి అగ్లియో ఫోబియా
» మందులు ఫార్మకో ఫోబియా
» ఇళ్లు డొమటో ఫోబియా
» ధనం క్రోమెటో ఫోబియా
» వెర్రి, పిచ్చి మానియా ఫోబియా లేదా ఇస్పో ఫోబియా
» మొక్కలు, పువ్వులు అంతో ఫోబియా
» 13 (సంఖ్య) ట్రిస్కైడికా ఫోబియా
» బొచ్చు దొరా ఫోబియా
» చెదలు ఇసోప్టర్ ఫోబియా
» ఊసరవెల్లులు లేదా సరీసృపాలు హెర్పిటో ఫోబియా
» పేరు లేదా ప్రత్యేక పదం ఒనమాటో ఫోబియా
» నిద్ర హిప్నో ఫోబియా
» గుంపులు లేదా సమూహాలు అక్లో ఫోబియా లేదా డెమో ఫోబియా
» సూక్ష్మక్రిములు మైక్రో బయో ఫోబియా
» వంతెనలు లేదా వంతెనలు దాటుట జీపైరో ఫోబియా
» మాట్లాడుట, ప్రజలముందు మాట్లాడుట లాలో ఫోబియా లేదా గ్లస్పో ఫోబియా
» మరణం నెక్రో ఫోబియా

 

100+ తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్ AP GK Questions in Telugu

తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్

1. ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది?
జ : వాషింగ్ టన్
2 మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?
జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు)
3 యూరప్‌లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది?
జ : స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌.
4 దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు?
జ : డా. అక్కినేని నాగేశ్వర్‌రావు
5 ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది?
జ : కెనడా. (దీని తీరరేఖ పొడవు 2,02,080 కి.మీ.)
6 బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు?
జ : ది హాంగ్‌
7 గంగానదిని బంగ్లాదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు?
జ : పద్మానది
8 గంగానది పొడవు ఎంత?
జ : 2,523 కి.మీ.
9 ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది?
జ : మహాభారతం. (ఇందులో 74 వేల పద్యాలు, 1.8 లక్షల పదాలు ఉన్నాయి)
10 మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది?
జ : న్యూజీలాండ్‌.
11 భారతదేశంలో మొదటి ‘మున్సిపల్‌ కార్పోరేషన్‌’ను ఎక్కడ స్థాపించారు?
జ : మద్రాసులో
12 భారతదేశంలో మొట్టమొదటి ‘పట్టణాభివృద్ధి సంస్థ’ను ఎక్కడ ఏర్పాటు చేసారు?
జ : ఢిల్లిలో. (1964)
13 శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది?
జ : రోహిణి.
14 భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్‌ ఎవరు?
జ : విక్రం సారభాయ్‌
15 స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి?
జ : అవతార్‌
16 ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌, ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌ వ్యవస్థ పేరేమిటి?
జ : గగన్‌
17 అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేశ్‌ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరేమిటి?
జ : సోయజ్‌
18 భారతదేశం ప్రయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహం ‘మెట్‌శాట్‌’కు ఏ పేరు పెట్టారు?
జ : కల్పన – 1
19 అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ పేరేమిటి?
జ : కల్పనా చావ్లా
20 అంతరిక్షయానం చేయనున్న మొదటి భారత టూరిస్ట్‌ ఎవరు?
జ : సంతోష్‌ జార్జ్‌ కులంగర్‌.
21 భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి?
జ : ఆర్యభట్ట (1975 ఏప్రిల్‌ 19న ప్రయోగించారు)
22 ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎక్కడ ఉంది?
జ : తిరువనంతపురంలో
23 అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్‌ స్పేస్‌ రీసర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జ : 1969లో.
24 ‘ఇస్రో’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జ : బెంగుళూరులో.
25 ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది?
జ : మొసలి
26 ప్రపంచ బ్యాంక్‌ ప్రస్తుత ప్రెసిడెంట్‌ పేరేమిటి?
జ : రాబర్ట్‌ జోలిక్‌.
27 ‘లా కమీషన్‌’ ప్రస్తుత చైర్మన్‌ పేరేమిటి?
జ : పి. వెంకటరామిరెడ్డి.
28 నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమీషన్‌ (కఐఈ) ప్రస్తుత చైర్మన్‌ ఎవరు?
జ : జస్టిస్‌ కె.జి.బాలకృష్ణన్‌.
29 2010 సంవత్సరానికిగాను ‘టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ గా ఎవరు ఎంపికయ్యారు?
జ : మార్క్‌ జుకెర్‌బర్గ్‌ . (ఫేస్‌ బుక్‌ ఫౌండర్‌)
30 2010 సంవత్సరానికిగాను’రాజీవ్‌ ఖేల్‌రత్న’ అవార్డు ఎవరికి లభించింది?
జ : సైనా నెహ్వాల్‌కు
31 ‘యునైటెడ్‌ నేషన్స్‌’ పేరును ఎవరు సూచించారు?
జ : ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌.
 ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రెటరీ జనరల్‌ ఎవరు?
జ : బాన్‌ కీ మూన్‌. (దక్షిణ కొరియా)
32 ‘సార్క్‌’ మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది?
జ : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా (1985)లో
33 ‘సార్క్‌’లో 2007లో 8వ దేశంగా చేరిన దేశం ఏది?
జ : అఎn్గానిస్తాన్‌.
34 2011 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది?
జ : అంతర్జాతీయ అడవుల సంవత్సరం, అంతర్జాతీయ రసాయన సంవత్సరం.
35 ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది?
జ : అంటార్కిటికా (దీనికి మంచు ఖండం అనికూడా పేరు)
36 ‘జీ-8’ కూటమిలోని దేశాలు ఏవి?
జ : అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, కెనడా, జపాన్‌, జర్మనీ.
37 రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (ఆూ) ప్రస్తుత డైరెక్టర్‌ పేరేమిటి?
జ : సంజీవ్‌ త్రిపాది
38 లోక్‌సభ ప్రస్తుత సెక్రటరీ జనరల్‌ పేరేమిటి?
జ : టి.కె. విశ్వనాథన్‌
39 రాజ్యసభ ప్రస్తుత సెక్రటరీ జనరల్‌ పేరేమిటి?
జ : వివేక్‌ కుమార్‌ అగ్నిహోత్రి
40 యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (ీాఈ) ప్రస్తుత చైర్మన్‌ ఎవరు?
జ : ప్రొఫెసర్‌ డి.పి. అగర్వాల్‌.
41 ‘బీసీ’ల జాతీయ కమీషన్‌ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?
జ : జస్టిస్‌. ఎం.ఎన్‌.రావు.
42 యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ (ీఏఈ) ప్రస్తుత చైర్మన్‌ పేరేమిటి?
జ : ప్రొఫెసర్‌ వేద్‌ ప్రకాశ్‌.
43 ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఒఇ) ప్రస్తుత డైరెక్టర్‌ ఎవరు?
జ : నెహ్‌చాల్‌ సంధు.
44 నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ ్స (కాఏ) ప్రస్తుత డైరెక్టర్‌ జనరల్‌ ఎవరు?
జ : ఆర్‌.కె.మెదెకర్‌
45 లోక్‌సభ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ పేరేమిటి?
జ : కరియా ముందా.
46 ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల ప్రకారం 2060 నాటికి భారతదేశం జనాభా ఎంత పెరుగుతుంది?
జ : 171.8 కోట్లకు
47 అంతర్జాతీయ ద్రవ్యనిధి నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌ పేరేమిటి?
జ : క్రిస్టిన్‌ లాగార్డే.
48 కొత్తగా ఇటీవల అవతరించిన దక్షిణ సూడాన్‌ రాజధాని పేరేమిటి?
జ : జుబా.
49 భారత నూతన సొలిసిటర్‌ జనరల్‌ పేరేమిటి?
జ : రోహింగ్టన్‌ నారిమన్‌.
    * ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు?
          జ)  తాబేలు.
    * తక్కువ సాంద్రత కల్గిన పదార్థం?
          జ)  చెక్క
    * మహా భారతానికి గల మరో పేరు?
          జ)  జయ సంహిత. 
    * హిమోగ్లోబిన్‌లో ఉన్న లోహం?
          జ)  ఐరన్.
    * రామచరిత మానస్ ను రచించింది ఎవరు?
          జ)  తులసీ దాస్.
    * నవ్వించే వాయువు ఏది?
          జ)  నైట్రస్ ఆక్సైడ్.
    * ప్రపంచ పర్యావణ దినముగా ఏ రోజు జరుపబడును?
          జ)  జూన్ 5.
    * చంద్రుని పై మొదట కాలిడిన తొలి మానవుడు?
          జ)  నీల్ ఆమ్ స్ట్రాంగ్.
    * రెడ్ ప్లానట్‌గా పిలువబడే గ్రహం ఏది?
          జ)  మార్స్.
    * రేడియం దేనినుండి లభిస్తుంది?
          జ)  పిచ్ బ్లెండ్.
    * అత్యధిక జనభా గల దేశమేది?
          జ)  చైనా.
    * శ్వేత విప్లవం దేనికి సంబంధించింది?
          జ)  పాల ఉత్పత్తి.
    * సప్త పర్వతముల నగరం’ అని దేనికి పేరు?
          జ)  రోమ్.
    * తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు?
          జ)  సెరి కల్చర్.
    * ఏ దశాబ్దాన్ని సార్క్ పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది
          జ)  2005-.
    * భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది?
          జ)  ఎన్నికల సంఘం.
    * ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
          జ)  జెనీవా.
    * డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది?
          జ)  ఇండోనేసియా.
    * ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు?
          జ)  దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.
    * భారతదేశ అధికార మతం?
          జ)  లౌకికరాజ్యం కనుక అధికార మతం ఉండదు.
    * మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు?
          జ)  కారల్ మార్క్స్.
    * ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు?
          జ)  రాజకీయ హక్కు
    * డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?
          జ)  జశ్వంత్‌సింగ్.
    * మన సౌరకుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది?
          జ)  భూమి.
    * ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
          జ)  న్యూయార్క్
    * భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
          జ)  ఆంధ్రప్రదేశ్.
    * మనదేశంలో ఎన్ని పోస్టల్ జోనులున్నాయి?
          జ)  ఎనిమిది.
    * మనదేశంలో ఎన్ని రాష్ట్రలున్నాయి?
          జ)  28.
    * డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది?
          జ)  టెన్నిస్
    * పద్మశ్రీ గెల్చుకున్న తొలినటి?
          జ)  నర్గిస్ దత్ 
    * హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు?
          జ)  సంస్కృతం 
    * పాలను పెరుగుగా మార్చే ఎంజైయం ఏది?
          జ)  రెనిన్.
    * మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి?
          జ)  చిక్కుడు గింజ ఆకారంలో.
    * మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి?
          జ)  2.
    * ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ?
          జ)  ఇండియా.
    * ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్ లను రద్దు చేయాలని సూచించిన కమీషన్ ఏది?
          జ)  రాజా మన్నార్ కమీషన్.
    * సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సం|| నుండి వేరు చేశారు?
          జ)  1924.
    * ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ఎన్ని పోస్టాఫీస్‌లు గలవు?
          జ)  1 లక్ష యభై వేలు.
    * వైట్ కోల్ ‘ అని దేనిని పిలుస్తారు ?
          జ)  వజ్రం.
    * మనదేశంలో మొబైల్ ఎ.టి.ఎమ్. సర్వీసును మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది?
          జ)  ఐ.సి.ఐ.సి.ఐ.
    * 2005 సవస్తరంలో అత్యధిక జననాల రేటు నమోదైన దేశం ఏది?
          జ)  భారత్.
    * అధిక సంఖ్యలో అణు రియాక్టర్‌లను కలిగి ఉన్న దేశం ఏది?
          జ)  అమెరికా.
    * టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం?
          జ)  బ్రిటన్.
    * ‘క్రైం అండ్ మనీ లాండరింగ్ ‘ అనే గ్రంథ రచయిత ఎవరు?
          జ)  జ్యోతి ట్రెహన్.
    * క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏది?
          జ)  పంజాబ్ నేష్నల్ బ్యాంక్.
    * ప్రపంచంలో 100 అతి పెద్ద బిజినెస్ స్కూల్స్‌లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మేనేజిమెంట్ విధ్యా సంస్థ ?
          జ)  ఐఐయం అహ్మదాబాద్.
    * బులెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారుచేస్తారు?
          జ)  జాకాల్ అనే మిశ్రమంతో.
    * పవన విద్యుదుత్పత్తిలో ఆగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
          జ)  తమిళనాడు.
    * నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది?
          జ)  ఫాథమ్.
    * పింజర్ ‘ నవల రచయిత్రి ఎవరు?
          జ)  అమృతా ప్రీతమ్.
    * ప్రపంచంలో బౌద్దుల జనాభా అధికంగా గల దేశం ఏది?
          జ)  చైనా.
    * భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి?
          జ)  మహారాష్ట్ర
    * ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది?
          జ)  డెహ్రాడూన్.
    * వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
          జ)  డాక్టిలోగ్రఫీ.
    * రాణ్ ఆఫ్ కచ్ ‘ అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది?
          జ)  గుజరాత్.
    * భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది?
          జ)  26 జనవరి 1950.
    * మహామన్య బిరుదు ఎవరికిచ్చారు?
          జ)  మదన్ మోహన్ మాలవ్య.
    * దాల్ సరస్సు ఎక్కడ ఉంది?
          జ)  శ్రీనగర్.
    * భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం?
          జ)  అస్సాం.
    * అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత?
          జ)  4 సంవత్సరాలు.

 

 

100+ ముఖ్యమైన ఆపరేషన్లు AP GK Questions in Telugu

ముఖ్యమైన ఆపరేషన్లు | Important operations AP GK Questions and Answers in Telugu

ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఉద్దేశం
» రెయిన్ బో ఈస్ట్ 2004 డిసెంబరు 26న వచ్చిన సునామీ బాధితుల సాయం కోసం మనదేశ నౌకాదళం, శ్రీలంక చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ పవన్ శ్రీలంక లోని భారత శాంతి స్థాపక దళ కార్యక్రమాలు
» ఆపరేషన్ రెడ్ డాన్ ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను పట్టుకోడానికి అమెరికా సైన్యం చేపట్టింది.
» ఆపరేషన్ ఓవర్ లోడ్ ఫ్రాన్స్ ను నాజీల నుంచి విముక్తం చేయడానికి అమెరికా చేపట్టిన సైనికచర్య.
» ఆపరేషన్ ఈగల్ శ్రీలంకలోని తమిళులకు ఆహార పదార్థాలు, వైద్య సదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి భారత శాంతిస్థాపక దళం చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ లీప్ ఫార్వర్డ్ ఎల్.టి.టి.ఇ (లిబరేషన్ ఆఫ్ తమిళ ఈలం) స్థావరాలను ధ్వంసం చేయడానికి శ్రీలంక సైన్యం, వైమానిక, నౌకాదళాలు సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ ఆల్ క్లియర్ భూటాన్ లోని భారత వ్యతిరేక శక్తులైన ఉల్ఫా, కమటాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ల కోసం చేపట్టిన చర్య.
» ఆపరేషన్ తొపక్ మన దేశ యువకులకు అక్రమంగా సైనిక శిక్షణ ఇచ్చి మన దేశంలో అలజడులు సృష్టించడానికి పాకిస్థాన్ అధ్యక్షుడు 1988 లో ఏర్పాటు చేసింది.
» ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ అల్ ఖైదా ఉగ్రవాద సంస్థను అరికట్టడానికి అమెరికా చేపట్టిన సైనిక చర్య.
» ఆపరేషన్ సన్ షైన్ 1995లో ఎల్.టి.టి.ఈ స్థావరమైన జాఫ్నాపై శ్రీలంక సైన్యం చేపట్టిన చర్య.
» ఆపరేషన్ చెక్ మేట్ ఎల్.టి.టి.ఈ కి వ్యతిరేకంగా భారత శాంతిదళాలు తీసుకున్న చర్యలు.
» ఆపరేషన్ డిజర్ట్ ఫాక్స్ ఇరాక్ పై దాడికి అమెరికా వైమానిక దళం చేపట్టిన చర్య.
» ఆపరేషన్ స్యార్ యర్ ఇరాక్ లోని ఉగ్రవాదులను నాశనం చేయడానికి అమెరికా వైమానిక దళం 2006 లో చేపట్టిన దాడులు.
» ఆపరేషన్ రెస్టోర్ హోష్ సోమాలియాలో కరవు నివారణ కోసం యూఎన్ వో చేపట్టిన చర్యలు.
» ఆపరేషన్ సైలెన్స్ లాల్ మసీదులోని తీవ్ర వాదులను, మత ఛాందసులను నిరోధించడానికి పాకిస్థాన్ సైన్యం చేసిన కార్యక్రమం
» ఆపరేషన్ పుష్ బాల్ బంగ్లాదేశ్ నుంచి భారత దేశంలోకి వలస వచ్చిన వారిని వెనక్కి పంపే కార్యక్రమం
» ఆపరేషన్ ఖఖరి రివల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్ కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి చేపట్టిన చర్య ఇది. సియెర్రాలియోన్ లో జరిగింది. 222 మంది భారత సైనికులను విడిపించడానికి ఈ చర్య చేపట్టారు.
» ఆపరేషన్ డెవలప్ మెంట్ ఎఫర్ట్ బంగ్లాదేశ్ లోని తుపాను బాధితుల కోసం చేపట్టిన ఆపరేషన్ ఇది. అమెరికా నావికా దళాలు దీన్ని నిర్వహించాయి.
» ఆపరేషన్ ఎర్త్ క్వేక్ ఎల్ టీటీఈ తీవ్రవాదులను నాశనం చేయడానికి శ్రీలంక సైన్యం ఈ చర్యను చేపట్టింది.
» ఆపరేషన్ జాయింట్ ఎండీవర్ నాటో ఆధ్వర్యంలో శాంతి స్థాపన కోసం బోస్నియాలో జరిగిన కార్యక్రమం.
» ఆపరేషన్ అనకొండ తోరాబోరా గుహల్లో దాక్కొని ఉన్న అల్ ఖైదా తీవ్రవాదులను చంపడానికి అమెరికా ఈ ఆపరేషన్ నిర్వహించింది.
» ఆపరేషన్ ఒడిస్సీడాన్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా తదితర దేశాల సైన్యంతో కూడిన అంతర్జాతీయ దళాలు లిబియాపై చేపట్టిన చర్య.
» ఆపరేషన్ జరోనిమా అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను చంపడానికి అమెరికా సైన్యాలు చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ ఖంజర్ తాలిబన్ ల ఏరివేతకు అమెరికా సైన్యం, అప్ఘానిస్థాన్ సైన్యం సంయుక్తంగా చేపట్టిన చర్య.
జాతీయ స్థాయిలో చేపట్టిన కొన్ని ముఖ్యమైన ఆపరేషన్లు
» ఆపరేషన్ విజయ్ 1999 మే 14న కార్గిల్ లో అక్రమంగా చొరబడిన వారిని నిరోధించడానికి భారత సైన్యం చేపట్టిన చర్య.
» ఆపరేషన్ టోర్నడో ముంబయిలో తీవ్రవాదుల దాడి జరిగినప్పుడు నారీమన్ హోటల్లో చిక్కుకున్న బందీలను విడిపించడానికి సైన్యం నిర్వహించిన చర్య.
» ఆపరేషన్ బ్లూ స్టార్ అమృతసర్ లోని స్వర్ణదేవాలంలో ఉన్న తీవ్రవాదులను చంపడానికి 1984లో భారత సైన్యం చేపట్టిన చర్య ఇది.
» ఆపరేషన్ సైక్లోన్ ముంబయి నగరంపై 2009 సంవత్సరం నవంబరు 26న జరిగిన దాడిలో తాజ్ హోటల్ లో దాక్కున ఉగ్రవాదులను నాశనం చేయడానికి నిర్వహించిన కార్యక్రమం.
» ఆపరేషన్ కోబ్రా జమ్మూ-కశ్మీర్ లో తీవ్రవాదుల ప్రాబల్య నిరోధానికి చేపట్టిన చర్య.
» ఆపరేషన్ పరాక్రమ్ భారత పార్లమెంటుపై 2001లో దాడి జరిగినప్పుడు తలెత్తిన అవాంఛనీయ పరిస్థితులు, ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ సరిహద్దులోకి సైన్యాన్ని తరలించే చర్య.
» ఆపరేషన్ గుడ్ విల్ జమ్మూ-కశ్మీర్ లోని ప్రజల విశ్వాసాన్ని సంపాదించడానికి భారత సైన్యం చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ సెర్చ్ ప్రత్యేక ఖలిస్థాన్ దేశం కోసం స్వర్ణదేవాలయం కేంద్రంగా పోరాడుతున్న ఖలిస్థాన్ తీవ్రవాదులను నిరోధించడానికి భారత సైన్యం చేసిన చర్య.
» ఆపరేషన్ కూంబింగ్ -1 పంజాబ్ లో తీవ్రవాదుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో వారిని నిరోధించడానికి చేపట్టిన చర్య.
» ఆపరేషన్ ఉడ్ రోజ్ 1984లో పంజాబ్ లో తీవ్రవాదుల ఏరివేత చర్య
» ఆపరేషన్ షాప్ 1984లో స్వర్ణ దేవాలం మినహా మిగతా గురుద్వారాలలో చేపట్టిన చర్య.
» ఆపరేషన్ బ్లాక్ థండర్ 1988లో స్వర్ణ దేవాలయం నుంచి తీవ్రవాదుల ఏరివేత.
» ఆపరేషన్ రక్షక్ 1, 2 పంజాబ్ లో తీవ్రవాదుల అరాచకాలకు అడ్డుకట్ట వేసి, అక్కడ ప్రశాంత ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన చర్య.
» ఆపరేషన్ నైట్ డామినెన్స్ పంజాబ్ లో రాత్రి వేళల్లో గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడం.
» ఆపరేషన్ ఫైనల్ ఎసాల్ట్ పంజాబ్ లో ఉగ్రవాద అణచివేత చర్యలు.
» ఆపరేషన్ విన్ ఓవర్ పంజాబ్ లో ప్రజల అభిమానాన్ని పొందడానికి సైన్యం చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ హంట్ డౌన్ సరిహద్దు భద్రతా దళం, కశ్మీర్ లోని పోలీసులతో కలిసి కశ్మీర్ లోని ఉగ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన ఆపరేషన్.
» ఆపరేషన్ టైగర్ జమ్మూ-కశ్మీర్ లో ఉగ్రవాద నిరోధానికి చేపట్టిన చర్య.
» ఆపరేషన్ ఫాక్స్ జమ్మూ – కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి నిర్వహించిన కార్యక్రమం ఇది.
» ఆపరేషన్ విక్రమ్ ఉగ్రవాదుల నిర్మూలనకు, శాంతి స్థాపనకు జమ్మూ-కశ్మీర్ లో నిర్వహించిన సైనిక చర్య.
» ఆపరేషన్ క్రాంతి అసోమ్ లో చెలరేగిన తీవ్రవాదులను నిర్మూలించి ప్రజలకు రక్షణ కల్పించడానికి భారత సైన్యం ఈ చర్య చేపట్టింది.
» ఆపరేషన్ భజరంగ్ 1980లో అసోమ్ లో ఉల్ఫా తీవ్రవాదుల ఏరివేతకు సైన్యం చేపట్టిన చర్య ఇది. ఇది విఫలమైంది.
» ఆపరేషన్ రైనో ఆపరేషన్ భజరంగ్ విఫలం కావడంతో అసోమ్ తీవ్రవాదలను అణచివేయడానికి చేపట్టిన చర్య.
» ఆపరేషన్ క్లౌడ్ బరస్ట్ ఇది కూడా అసోమ్ లోని తీవ్రవాదుల నిర్మూలన కోసం చేపట్టిందే.
» ఆపరేషన్ బ్లూ ప్రింట్ ఉల్ఫా తీవ్రవాదులు అసోమ్ లో చేస్తున్న కార్యకలాపాలను వెలుగులోకి తీసుకురావడానికి చేపట్టిన చర్య.
» ఆపరేషన్ సహయోగ్ అసోంలో ప్రజల అభిమానాన్ని సంపాదించడం కోసం భారత సైన్యం నిర్వహించిన కార్యక్రమం.
» ఆపరేషన్ అగ్ని ఉత్తర ప్రదేశ్ లోని తెరాయ్ ప్రాంతంలోని తీవ్రవాదుల ఏరివేతకు చేపట్టిన చర్య.
» ఆపరేషన్ సైకో హజ్రత్ మహల్ మసీదులో దాక్కున్న తీవ్రవాదులకు ఆహార పదార్థాలు అందకుండా అడ్డుకుంటూ వారిపై ఒత్తిడి పెంచడానికి చేపట్టిన సైనిక చర్య.
» ఆపరేషన్ పోలో 1948లో హైదరాబాద్ సంస్థానం స్వాధీనానికి భారత ప్రభుత్వం చేపట్టిన పోలీసు చర్య.
» ఆపరేషన్ లోటస్ బోఫోర్స్ కుంభకోణంలోని రహస్యాలను ఛేదించడానికి చేపట్టిన పోలీసు కార్యక్రమం.
» ఆపరేషన్ శాండల్ ఫాక్స్ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను పట్టుకోడానికి చేపట్టిన పోలీసు చర్య ఇది.
» ఆపరేషన్ మిడ్ నైట్ సెంట్రల్ రిజర్వ్ పోలీసు, పంజాబ్ పోలీసులు 1987లో స్వర్ణ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ కోకూన్ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను బంధించడానికి తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన చర్య.
» ఆపరేషన్ ధన్వంతరి దొంగ మందులను తయారు చేస్తున్న 4 పరిశ్రమలను గుర్తించి వాటిని నాశనం చేయడానికి బిహార్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ త్రీ స్టార్ పార్లమెంట్ పై దాడి జరిగిన కేసులో ప్రధాన నిందితుడు అఫ్జల్ గురును ఉరి తీయడానికి చేపట్టిన చర్య.
» ఆపరేషన్ ఎక్స్ ముంబయిలో తీవ్రవాదుల దాడి కేసులో పట్టుబడిన అజ్మల్ కసబ్ ను పుణేలోని ఎరవాడ జైల్లో రహస్యంగా ఉరి తీసిన చర్య.
ఇతర ముఖ్యమైన ఆపరేషన్లు
» ఆపరేషన్ తోడర్ మల్ బిహార్ లో భూ సంస్కరణలను వేగంగా, నిష్పాక్షికంగా నిర్వహించడానికి చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ గ్రీన్ గోల్డ్ వెదురు ఉత్పత్తులను పెంచడానికి చేపట్టిన చర్య.
» ఆపరేసన్ బ్లూ రెమ్యూషన్ చేపల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం.
» ఆపరేషన్ ఫ్లడ్ 1970లో భారత దేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ టీ-14 పెరిగిపోతున్న అవినీతికి వ్యతిరేకంగా 1984లో నిర్వహించిన చర్య.
» ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ప్రాథమిక విద్యను పరిపుష్టం చేయడానికి చేపట్టిన కార్యక్రమం ఇది. దీని ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో కనీస వసతులు కల్పించారు.
» ఆపరేషన్ – 100 కార్లకు నల్లటి అద్దాలు ఉపయోగించ కూడదనే నిబంధనలతో హైదరాబాద్ పోలీసులు చేపట్టిన కార్యక్రమం ఇది.
» ఆపరేషన్ సేవా తీవ్రవాదం భయంతో జమ్మూ-కశ్మీర్ ను విడిచి వెళ్లిన ప్రజలకు సహాయం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం.
» ఆపరేషన్ గజ 2008లో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు సృష్టించిన అలజడిని నిరోధించడానికి అటవీశాఖ చేపట్టిన చర్య ఇది.
» ఆపరేషన్ ఎక్స్ లెన్స్ 1990 ఏసియన్ క్రీడల్లో ఉన్నత ప్రతిభా ప్రదర్శన లక్ష్యంగా భారత క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ దుర్యోధన్ పార్లమెంట్ లో ప్రశ్నలు అడగటానికి పదకొండు మంది ఎంపీలు డబ్బు తీసుకుంటున్న విషయాన్ని ఆజ్ తక్ టీవీ ఛానల్, కోబ్రా పోస్టు న్యూస్ పోర్టల్ సంయుక్తంగా నిర్వహించిన చర్య ఇది.
» ఆపరేషన్ చక్రవ్యూహ్ ఎంపీ లాడ్స్ పథకం కింద పనులు చేపట్టేందుకు అక్రమ మార్గాలను ఎంచుకున్న ఎంపీల దురాగతాలను బహిర్గతం చేయడానికి డెడికేటర్ ఇన్వెస్టిగేటివ్ గిల్డ్, స్టార్ న్యూస్ ఉమ్మడిగా చేపట్టిన చర్య.

100+ ప్రముఖ ఆవిష్కరణలు – ఆవిష్కర్తలు AP GK Questions in Telugu

ప్రముఖ ఆవిష్కరణలు – ఆవిష్కర్తలు

ఆవిష్కరణ ఆవిష్కర్త
» విమానం రైట్ సోదరులు (ఆర్‌విల్లే, విల్‌బర్ రైట్)

 

» కృత్రిమ గుండె విలియం కాఫ్
» ఎలక్ట్రాన్ జె.జె. థామ్సన్
» ప్రోటాన్ రూథర్‌ఫర్డ్
» న్యూట్రాన్ ఛాడ్విక్
» ఎక్స్‌రే విలియం కె.రాంట్‌జన్
» డీఎన్ఏ నిర్మాణం వాట్సన్, క్రిక్
» కారు (పెట్రోల్) కార్ల్ బెంజ్
» కంప్యూటర్ ఛార్లెస్ బాబేజ్
» పెన్సిలిన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్
» డైనమో మైకేల్ ఫారడే
» ట్రాన్స్‌ఫార్మర్ మైకేల్ ఫారడే
» ఎలక్ట్రిక్ జనరేటర్ మైకేల్ ఫారడే
» ఎలక్ట్రిక్ ల్యాంప్ థామస్ అల్వా ఎడిసన్
» హైడ్రోజన్ బాంబు రాబర్ట్ ఓవెన్ హెయిర్
» మైక్రోఫోన్ అలెగ్జాండర్ గ్రాహంబెల్
» టెలిఫోన్ అలెగ్జాండర్ గ్రాహంబెల్
» టెలిగ్రాఫ్ కోడ్ శామ్యూల్ ఎఫ్.బి. మోర్స్
» డైనమైట్ ఆల్ఫ్రెడ్ నోబెల్
» రేడియో కార్బన్ డేటింగ్ విల్లార్డ్ లిబ్బి
» పీరియాడిక్ టేబుల్ మెండలీఫ్
» బారోమీటర్ టారిసెల్లి

 

» థర్మామీటర్ గెలీలియో గెలీలి
» స్టెతస్కోప్ లెన్నెక్
» మైక్రోస్కోప్ జాన్సన్ జడ్
» రక్త ప్రసరణ విలియం హార్వే
» రేడియో మార్కొని
» కదిలే చిత్రాలు లూయీస్ ప్రిన్స్
» లేజర్ ఛార్లెస్ టౌన్స్
» సైకిల్ మాక్మిలన్
» బ్యాక్టీరియా లీవెన్ హుక్
» డీజిల్ ఇంజిన్ రుడాల్ఫ్ డీజిల్

 

» టెలివిజన్ జె.ఎల్. బైయర్డ్
» హెచ్ఐవీ ఎం. కొకెరెల్
» బాల్‌పాయింట్ పెన్ జాన్ జె. లౌండ్
» ఆవిరి ఓడ ఫెరియర్
» సిమెంట్ (పోర్ట్‌లాండ్) జోసెఫ్ ఆస్పిడిన్
» కెమెరా జోసెఫ్ నిప్పస్
» సేఫ్టీల్యాంప్ హంఫ్రీ డేవి
» నియాన్ ల్యాంప్ జార్జి క్లౌడె
» ప్లాస్టిక్ హ్యాత్
» రిఫ్రిజిరేటర్ జేమ్స్ హారిసన్
» ఎయిర్ కండిషనర్ క్యారియర్
» వైర్‌లెస్ మార్కొని
» బ్లీచింగ్ పౌడర్ టెన్నాస్ట్
» కుట్టుమిషన్ థియోనీర్
» లిఫ్ట్ ఎలిషా ఓటిస్
» పాశ్చరైజేషన్, కుక్క కాటుకు టీకా మందు లూయిస్ పాశ్చర్
» హెలికాప్టర్ ఓమిచిన్
» సినిమా నికొలాస్, ల్యూమెరి
» గుండె మార్పిడి శస్త్రచికిత్స క్రిస్టియన్ బెర్నార్డ్
» జనరేటర్ ఫికియోట్టి
» ఫిల్మ్‌పై ఫొటోగ్రఫీ జాన్ కార్బట్
» రాడార్ టేలర్, యంగ్
» ప్రింటింగ్ ప్రెస్ జాన్ గూటెన్ బర్గ్
» వాచ్ బి. మాన్‌ప్రైడి
» టైప్ రైటర్ పెల్లెగ్రీన్ టార్రీ
» ప్రెషర్ కుక్కర్ డెనిస్ ఫాసిన్
» ఎలక్ట్రిక్ బ్యాటరీ ఓల్టా
» ఆప్టికల్ ఫైబర్ న‌రింద‌ర్ సింగ్ క‌ప‌ని
» సబ్ మెరైన్ డేవిడ్ బుష్ వెల్
» బాలిస్టిక్ మిసైల్ వెమ్‌హెర్ వోన్ బ్రౌన్
» మైక్రోఓవెన్ పెర్సి, లిబార్న్ స్పెన్సర్
» పారాచూట్ ఎ.జె. గార్నెరీన్
» వాషింగ్ మెషిన్ బెర్నెస్ వాలిస్
» స్టీల్ హెన్రీ బెస్సిమర్
» లౌడ్ స్పీకర్ హోరాస్ షార్ట్
» సూపర్ కంప్యూటర్ జె.హెచ్. వాన్ టస్సెల్
» టెలిగ్రాఫ్ ఎం. లామెండ్
» జిరాక్స్ చెస్టర్ క్లార్‌సన్
» లైట్నింగ్ కండక్టర్ బెంజిమిన్ ఫ్రాంక్లిన్
» ఎలక్ట్రిక్ వాషింగ్ మెషిన్ ఆల్వా జె.ఫిషర్
» స్టెయిన్‌లెస్ స్టీల్ హారీ బ్రీర్లే
» ఆటంబాంబు ఒట్టోవాన్
» DDT డాక్టర్ పాల్‌ముల్లర్
» విటమిన్ D హాప్‌కిన్స్
» లాగరిథమ్ జాన్ నేపియర్
» ఉత్తర ధ్రువం రాబర్ట్ పియరి
» దక్షిణ ధ్రువం అముండ్‌సేన్
» అణుశక్తి రూథర్‌ఫర్డ్
» విటమిన్‌లు ఫంక్

 

» థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఛార్లెస్ డార్విన్
» థియరీ ఆఫ్ రిలెటివిటి ఐన్‌స్టీన్
» భారతదేశానికి సముద్రమార్గం వాస్కోడిగామా
» వాయిస్ మెయిల్ గోర్డాన్ మ్యాథ్యూస్
» అయస్కాంత బలసూత్రం కూలుంబ్
» విక్టోరియా జలపాతం లివింగ్‌స్టన్
» జనాభా సిద్ధాంతం మాల్థస్
» రేడియం మేడం క్యూరి

 

» క్రెస్కోగ్రాఫ్ జగదీష్ చంద్రబోస్
» ఎఫ్ఎమ్ (ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్) ఇ.హెచ్. ఆర్మ్‌స్ట్రాంగ్
» ఎలక్ట్రో ప్లేటింగ్ లుయిగి బ్రునాటెల్లి
» ఎలక్ట్రో మ్యాగ్నెట్ విలియమ్ స్టర్జన్
» ఎలక్ట్రిక్ మోటార్ (DC) జినోబ్ గ్రామీ
» ఎలక్ట్రిక్ మోటార్ (AC) నికోల టెస్లా
» ఎలక్ట్రిక్ ఐరన్ హెన్రీ డబ్ల్యూ సీలే
» సింథసైసర్ మూగ్
» CT – స్కాన్ ఆంథోని ఎ. ప్లాంట్‌సన్
» క్రాస్‌వర్డ్ పజిల్ ఆర్థర్ విన్నె
» బున్సెన్ బర్నర్ ఆర్. విల్‌హెల్మ్ బున్సెన్
» వీడియో టేప్ క్యాసెట్ సోని
» ఆడియో క్యాసెట్ ఫిలిప్స్ కంపెనీ
» ఎలక్ట్రాన్ ఉనికి మిల్లికాన్
» స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని బెన్నెట్
» రేయాన్ సర్ జోసఫ్ శ్వాన్
» విద్యుత్ విశ్లేషణ మైకేల్ ఫారడే
» యోగ పతంజలి
» ఆయుర్వేదం ఆత్రేయ
» విటమిన్ A మాక్‌కొల్లుమ్, ఎం. డేవిస్ (అమెరికా)
» విటమిన్ B1 మినాట్, మర్ఫీ (అమెరికా)
» విటమిన్ C ప్రోలిక్ హోస్ట్ (నార్వే)
» విటమిన్ K డోయిజి డామ్ (అమెరికా)
» బ్లడ్ బ్యాంక్ డ్రూ
» కలరా, టీబీ క్రిములు రాబర్ట్ కోచ్
» క్యాన్సర్ సంబంధిత జన్యువులు రాబర్ట్ వెయిన్‌బర్గ్
» మనుష్యుల్లో జన్యు చికిత్స మార్టిన్ క్లైవ్
» డిఫ్తీరియా క్రిములు క్లెబ్స్, లోఫ్లర్
» కిడ్నీ యంత్రం కోల్ఫో
» కార్డియాక్ పేస్‌మేకర్ హైమన్
» యాంటీ టాక్సిన్స్ బేరింగ్, కిటసాటో
» మలేరియా కారక క్రిములు లావరన్
» కుష్టుకారక బ్యాక్టీరియా హాన్‌సన్
» ఫౌంటెన్ పెన్ లెవిస్ ఇ. వాటర్ మ్యాన్
» కొడాక్ కెమెరా వాకర్ ఈస్ట్‌మ్యాన్
» నైలాన్ కరోథర్స్
» క్రిస్టల్ డైనమిక్స్ సర్ సి.వి. రామన్
» లూప్ డాక్టర్ డాక్‌లిప్సే
» కాంతి వేగం ఫిజి
» పరమాణు సంఖ్య మోస్లే
» ఆక్సిజన్ ప్రీస్ట్లీ
» హైడ్రోజన్ కావెండిష్
» నైట్రస్ ఆక్సైడ్ (లాఫింగ్ గ్యాస్) ప్రీస్ట్లీ
» ఇంటలిజెంట్ పరీక్షలు బినేట్
» అంధులకు ముద్రణ బ్రెయిలీ
» క్లోరిన్ షీలే
» శృతి దండం కోనింగ్
» అయస్కాంత అణు సిద్ధాంతం ఈవింగ్, వెబర్
» మైక్రోస్కోప్ (ఎలక్ట్రిక్) రస్కా నాల్
» ఫొటో కాపియర్ కార్ల్‌సన్
» ఫొటోగ్రఫిక్ పేపర్ టాల్బట్
» ఫొటోఫిల్మ్ ట్రాన్సపరెంట్ గుడ్‌విన్ ఈస్ట్‌మెన్
» పియానో క్రిస్టోఫోరి
» లోకోమోటివ్ రిచర్డ్ ట్రెవితిక్
» గాల్వనో మీటర్ ఆండ్రి మారి ఆంపియర్
» సేఫ్టీపిన్ వాల్టర్ హంట్
» మత్తు పదార్థం (స్పైనల్) బియర్
» మత్తు పదార్థం (లోకల్) కోలర్
» క్రయో సర్జరీ హెన్రీ స్వాన్
» పోలియో చుక్కలు ఆల్బర్ట్ సాబిన్
» పోలియో టీకామందు జోనాస్ సాల్క్
» టైఫస్‌కు టీకామందు జె. నికోల్
» లాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఓమ్
» నియాన్ వాయువు డబ్ల్యూ. రామ్సే
» బెలూన్ మాంటిగోల్ ఫియర్
» పరమాణు సిద్ధాంతం డాల్టన్
» పీరియాడిక్ లా మెండలీఫ్
» ఆవిరి యంత్రం జేమ్స్‌వాట్
» సేఫ్టీ రేజర్ గిల్లెట్
» డ్యుటీరియం హెచ్.సి. యూరే
» ఇన్సులిన్ ఎఫ్. బ్యాంటింగ్
» క్వాంటం సిద్ధాంతం మాక్స్‌ప్లాంక్
» గ్లైడర్ సర్ జార్జ్ కేలె
» హోలోగ్రఫి డెనిస్ గాసన్
» కెవ్లార్ బ్లేడ్స్ వోలెక్
» కంప్యూటర్ లాప్‌టాప్ సింక్లెయిర్
» పెండ్యులమ్ క్లాక్ క్రిస్టియన్ హైగెన్స్
» మెకానికల్ క్లాక్ ఐ – హైసింగ్, లియాంగ్ లింగ్ త్సాంగ్
» క్యాల్‌క్యులస్ న్యూటన్
» బైఫోకల్ లెన్స్ బెంజిమిన్ ఫ్రాంక్లిన్
» బైస్కిల్ టైర్స్ (న్యూమేటిక్) జాన్‌బాయిడ్ డన్‌లప్
» బేక్‌లైట్ లియో హెచ్ బేక్‌ల్యాండ్
» విమానం జెట్ ఇంజిన్ హాన్స్ ఒహెయిన్
» ఎయిర్‌షిప్ (రిజిడ్) జి.ఎఫ్. వాన్ జెప్లిన్
» ఎయిర్‌షిప్ (నాన్ రిజిడ్) హెన్రీ జెఫర్డ్
» అంటించే టేప్, స్కాచ్ రిచర్డ్ డ్రివ్
» ఎలక్ట్రిక్ బ్యాటరీ ఎలెస్సాండ్రో వోల్టా
» ప్లాస్టిసైన్ విలియమ్ హార్బర్ట్
» పార్కింగ్ మీటర్ కార్ల్‌టన్ సి.మేగి
» కాట్ స్కానర్ గాడ్‌ఫ్రే హౌన్స్‌ఫీల్డ్
» సిద్ధయోగ వృదుకుంట
» కృత్రిమ ప్రతిజనకాలు లాండ్ స్టీనర్
» సెక్స్ హార్మోన్‌లు యూగెన్ స్ట్రీనాక్
» నాడీ శాస్త్రం జాసఫ్ గాల్
» వెస్ట్రన్ సైంటిఫిక్ థెరపీ హిప్పోక్రటిస్ (గ్రీస్)
» కీమోథెరపి పరాసెల్సస్
» అష్టాంగ హృదయ వాగ్భాట
» మార్ఫిన్ ఫ్రెడరిక్ సెర్ట్యూమర్
» LSD (డ్రగ్) హాఫ్‌మెన్ (స్విట్జర్లాండ్)
» రోలర్ బ్లేడ్స్ స్కాట్, బ్రెన్నన్ ఓల్సన్
» సెల్ఫ్ స్టార్టర్ ఛార్లెస్ ఎఫ్. కెటరింగ్
» రేడియో టెలిగ్రఫీ డాక్టర్ మాహ్‌లన్ లూమిస్
» ధనధ్రువ కిరణాలు గోల్డ్ స్టెయిన్
» రేడియో ట్రాన్సిస్టర్ సోనీ
» టెడ్డీ బేర్ మార్గరెట్ స్టీఫ్
» గర్భ నిరోధక నోటి మాత్రలు (ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్) గ్రిగరి పింకస్, రాక్
» సైకో ఎనాలసిస్ సిగ్మండ్ ఫ్రాయిడ్
» ట్రైక్లోరో ఈథేన్ పాల్‌ముల్లర్ (జర్మనీ)
» ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ విల్లెమ్ ఏన్తోలెన్
» ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్ హాన్స్‌బర్గర్
» మశూచి టీకా ఎడ్వర్డ్ జెన్నర్
» టీకా మందు ఎడ్వర్డ్ జెన్నర్
» ఆస్ప్రిన్ డ్రెసర్
» మొద‌టి టెస్ట్‌ట్యూబ్ బేబి టూయిస్ బ్రౌన్ (ఇంగ్ల‌డ్‌)
» హైపోడెర్మిక్ సిరంజీ అలెగ్జాండర్ వుడ్
» స్టీమ్ ఇంజిన్ థామస్ సేవరి
» స్టీమ్ షిప్ జె.సి. పెరియర్
» టర్బైన్ షిప్ సర్.సి. పార్సన్స్
» టెర్లిన్ జె.ఆర్. విన్‌ఫెల్డ్, జె.టి. డిక్‌సన్
» రికార్డ్ (లాంగ్ ప్లేయింగ్) పీటర్ గోల్డ్ మార్క్
» థైరాక్సిన్ ఎడ్వర్డ్ కాల్విన్ కండల్
» టెర్రామైసిన్ ఫిన్‌లే
» స్ట్రెప్టోమైసిన్ సెల్మన్ వాక్స్‌మన్
» Rh ఫ్యాక్టర్ కార్ల్ లాండ్‌స్టీనర్
» ఇన్సులిన్ (చక్కెర వ్యాధికి ) బాంటింగ్ (కెనడా), బెస్ట్ (బ్రిటన్)
» ఫిల్మ్ (టాకింగ్) జె.ఎన్జిల్, జె.ముస్సోలి, హెచ్.వాట్
» ఫ్రోజన్ ఫుడ్ క్లారెన్స్ బర్డ్‌సెయి
» మెషిన్‌గన్ రిచర్డ్ గాట్టింగ్

 

» మూవీ ప్రొజెక్టర్ థామస్ ఆల్వా ఎడిసన్
» హెలికాప్టర్ బ్రెక్వెంట్
» లాస్ ఆఫ్ హెరిడిటీ గ్రెగర్ మెండల్
» లాస్ ఆఫ్ గ్రావిటేషన్ న్యూటన్
» సౌర వ్యవస్థ కోపర్నికస్
» గ్రహాల చలనం కెప్లర్
» అమెరికా క్రిస్టోఫర్ కొలంబస్
» బ్రెజిల్ పెడ్రో అల్వారెజ్ కాబ్రాల్
» శాండ్‌విచ్ ద్వీపాలు కెప్టెన్ కుక్
» ఆస్ట్రేలియా జాన్ ఎం.స్టంప్ట్
» అంటార్కిటికా ఛార్లెస్ విల్కిస్
» బ్యాక్టీరియాలజీ ఫెర్డినాండ్ కోన్
» బయో కెమిస్ట్రీ జాన్ బాప్టిస్టా వాన్ హెల్‌మంట్
» ఎంబ్రియాలజీ ఎర్నెస్ట్ వాన్ బేర్
» ఎండోక్రైనాలజీ బేలిస్, స్టార్లింగ్
» సిరాలజీ పాల్ ఎర్లిచ్
» వైరాలజీ ఐవానోస్కి, బైజరింగ్
» ఫిజియాలజీ వాన్ హేలర్ (స్విట్జర్లాండ్)
» r – DNA టెక్నాలజీ పాల్‌బర్గ్, హెచ్. డబ్ల్యూ. బోయర్, ఎస్. కోహెల్
» డెంటల్ ప్లేట్ (రబ్బరు) ఛార్లెస్ గుడ్ ఇయర్
» సెల్లోఫేన్ డాక్టర్ జె. బ్రాన్‌డెన్‌బెర్జర్
» బోల్ట్ యాక్షన్ రైఫిల్ పి. వాన్ మౌసర్
» లినోలియమ్ ఫ్రెడరిక్ వాల్టన్
» హూవర్ క్రాఫ్ట్ క్రిస్టోఫర్ కోకరెల్
» రేజర్ (ఎలక్ట్రిక్) కర్నల్ జాకబ్ షిక్
» రివాల్వర్ శామ్యూల్ కోల్ట్
» సెల్యులర్ టెలిఫోన్ బెల్ లాబ్స్
» టెలిస్కోప్ హాన్స్ లిప్పర్ షె
» డిస్క్ బ్రేక్ డాక్టర్ ఎఫ్. లాన్ చెస్టర్
» టేప్ రికార్డర్ ఫెస్సెండెన్ పౌల్‌సెన్
» టెలివిజన్ (ఎలక్ట్రానిక్) పి.టి. ఫార్న్‌స్‌వర్త్
» అటామిక్ రియాక్టర్ (యురేనియం ఫిజన్) ఎస్. ఫెర్మి
» వీడియో టేప్ ఛార్లెస్ గిన్స్‌బర్గ్
» వాక్యూమ్ క్లీనర్ స్పాంగ్లర్
» మైక్రోఫోన్ అలెగ్జాండర్ గ్రాహంబెల్
» మైక్రో ప్రాసెసర్ రాబర్ట్ నాయిస్, గోర్డన్ మూర్
» న్యూట్రాన్ బాంబ్ సామ్యూల్ కొహెన్
» మ్యాగ్నటిక్ రికార్డింగ్ టేప్ ఫ్రిట్జ్ ఫ్లుమర్
» జెట్ ఇంజిన్ సర్ ఫ్రాంక్ విటెల్
» పెన్సిల్ జాక్వెస్ నికోలస్ కాంటి
» స్టీమ్ కార్ నికోలస్ కనాట్
» కాలిక్యులేటర్ పాస్కల్
» ఎసిటలిన్ గ్యాస్ బెర్‌థెలాట్
» ఆటోమేటిక్ రైఫిల్ జాన్ బ్రౌనింగ్
» సెల్యులాయిడ్ అలెగ్జాండర్ పార్క్స్
» క్రోనోమీటర్ జాన్ హారిసన్
» క్షీరదాల క్లోనింగ్ ఇమున్ విల్మట్
» ఎలక్ట్రానిక్ కంప్యూటర్ డాక్టర్ ఆలెన్ ఎమ్ ట్యురింగ్
» గ్యాస్ లైటింగ్ విలియం మర్‌డాక్
» గ్లాస్ (స్టెయిన్డ్) ఆగ్స్‌బర్గ్
» గైడెడ్ మిసైల్ వెర్న్‌హర్ వార్న్ బ్రౌన్
» గ్రామ్‌ఫోన్ థామస్ అల్వా ఎడిసన్
» మోటర్ సైకిల్ జి. డెయిమ్లర్
» ఫొటో ఎలక్ట్రిక్ సెల్ జులియస్ ఎల్‌స్టర్, హాన్స్ ఎఫ్ గెయిటెల్
» ఫొటోగ్రఫి ఎల్. గుడ్‌రిక్
» కాస్మిక్ కిరణాలు ఆర్.కె. మిల్లికాన్
» వ్యాక్సినేషన్ ఎడ్వర్డ్ జెన్నర్
» రక్త మార్పిడి లాండ్ స్టీనర్
» పెన్సిలిన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్
» క్లోరోఫామ్ సర్ జేమ్స్ యంగ్ సింసన్
» ఓపెన్ హార్ట్ సర్జరీ వాల్టన్ లిల్లేహెల్ (అమెరికా)
» యాంటి పోలియో వ్యాక్సిన్ డాక్టర్ జోనాఫ్ ఇ.సాల్క్
» కార్టిసోన్ ఎడ్వర్డ్ కాల్విన్ కెండల్
» రివాల్వ‌ర్ శామ్యూల్ కోల్ట్‌

 

100+ ప్రపంచంలోని పారిశ్రామిక నగరాలు AP GK Questions in Telugu

ప్రపంచంలోని పారిశ్రామిక నగరాలు

బ్రిటన్
ప్రాంతం ప్రసిద్ధ పరిశ్రమ
» లీడ్స్ నూలు
» బర్మింగ్ హామ్ ఇనుము – ఉక్కు

 

వస్త్రపరిశ్రమ
» మాంచెస్టర్ వస్త్రపరిశ్రమ
అమెరికా
» డెట్రాయిట్ ఆటోమొబైల్
» చికాగో మాంసం
» లాస్ ఏంజెల్స్ చలన చిత్రం
» హాలీవుడ్ చలన చిత్రం

 

హాలీవుడ్
» ఫిలడెల్ఫియా లోకోమోటివ్
» పిట్స్ బర్గ్ ఇనుము- ఉక్కు
జపాన్
» కవాసాకి ఇనుము – ఉక్కు
» నగోయా ఆటోమొబైల్ (కార్లు)
జర్మనీ
» రూర్కీ ఇనుము – ఉక్కు
» మ్యూనిచ్ గాజు
దక్షిణాఫ్రికా
» జోహాన్స్ బర్గ్ బంగారం

 

జోహాన్స్ బర్గ్
» కింబర్లీ వజ్రం
ఇతర దేశాలు
» లెనిన్ గ్రాడ్ (రష్యా) నౌకా నిర్మాణం
» క్యూబా (క్యూబా) సిగార్
» హవానా (క్యూబా) సిగరెట్లు
» బాకు (అజర్ బైజాన్) పెట్రోలియం

 

కుండలు
» ముల్తాన్ (పాకిస్థాన్) కుండలు
» క్రివైరాగ్(ఉక్రెయిన్) ఇనుము-ఉక్కు
» లయాన్స్ (ఫ్రాన్స్) పట్టు
» ఢాకా (బంగ్లాదేశ్) మస్లిన్
» మిలాన్ (ఇటలీ) పట్టు

 

100+ భారత దేశ చరిత్రలో ముఖ్య సంఘటనలు AP GK Questions in Telugu

భారత దేశ చరిత్రలో ముఖ్య సంఘటనలు

క్రీస్తు పూర్వం
» 3000-1500 సింధునాగరికత కాలం

 

బుద్ధుడు
» 576 బుద్ధుడి జననం
» 527 మహావీరుడి జననం
» 327-326 భారత దేశంపైకి అలెగ్జాండర్ దండయాత్ర. దీని వల్ల యూరోప్ నుంచి మన దేశానికి భూమార్గం మొదటిసారి ఏర్పడింది.
» 313 జైన గ్రంథాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు సింహాసనం అధిష్టించిన సంవత్సరం.
» 305 సెల్యుకస్ నికెటర్ ను చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడు.
» 273 – 232 అశోకుడి పాలన
» 145 – 101 చోళ వంశానికి చెందిన శ్రీలంక రాజు ఎలరా పాలన కాలం.
» 58 విక్రమ శకం ప్రారంభం
క్రీస్తు శకం
» 78 శక యుగం ప్రారంభం
» 120 కనిష్కుడి పట్టాభిషేకం
» 320 గుప్తుల పాల ప్రారంభం (భారత్ లో స్వర్ణయుగం)
» 380 విక్రమాధిత్యుడి పట్టాభిషేకం
» 405-411 ఫాహియాన్ భారత సందర్శన
» 415 మొదటి కుమారగుప్తుడి పట్టాభిషేకం
» 455 స్కందగుప్తుడి పట్టాభిషేకం
» 606-647 హర్షవర్థనుడి పాలనా కాలం
» 712 మొదటిసారిగా భారత దేశం పై అరబ్బుల దండయాత్ర
» 836 కనౌజ్ లో భోజరాజు పట్టాభిషేకం
»985 రాజరాజచోళుడి పట్టాభిషేకం
» 998 సుల్తాన్ మహమ్మద్ పట్టాభిషేకం
» 1001 భారత దేశంపై గజనీ మహమ్మద్ మొదటి దండయాత్ర. ఇందులో పంజాబ్ రాజు జయపాలుడిని గజనీ ఓడించాడు.
» 1025 గజనీ మహమ్మద్ దండయాత్రలో సోమనాథ దేవాలయం ధ్వంసం.
» 1191 మొదటి తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ చౌహాన్ ల మధ్య జరిగింది. 
పృథ్విరాజ్ విజయం సాధించాడు.
» 1192 తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ ల మధ్య జరిగింది. ఈసారి విజయం ఘోరీ మహమ్మద్ ను వరించింది.
» 1206 కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. బానిస వంశ స్థాపన
» 1210 కుతుబుద్దీన్ ఐబక్ మరణం
» 1221 భారత దేశంపై మంగోలుల దండయాత్ర. ఛెంఘిజ్ ఖాన్ దండెత్తి వచ్చాడు.
» 1236 రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించింది.
» 1240 రజియా సుల్తానా మరణం.
» 1246 బాల్బన్ పాలన ప్రారంభం
» 1296 అల్లాఉద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఎక్కాడు.
» 1316 అల్లాఉద్దీన్ ఖిల్జీ మరణం.
» 1325 మహమ్మద్ బీన్ తుగ్లక్ పాలన ప్రారంభం.
» 1327 తుగ్లక్ పాలనలో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు రాజధాని మార్పు.
» 1336 దక్షిణాదిన విజయనగర సామ్రజ్యానికి పునాదులు.
» 1351 ఫిరోజ్ షా సింహాసనానికి వచ్చాడు.
» 1388 ఫిరోజ్ తుగ్లక్ మరణం
» 1398 భారత్ పై తైమూర్ దండయాత్రలు

 

గురునానక్
» 1469 గురునానక్ జననం
» 1494 ఫర్ఘానాలో సింహాసనాన్ని అధిష్టించిన బాబర్.
» 1497-98 భారత దేశానికి సముద్రమార్గం కనుగొన్న వాస్కొడిగామా.
» 1526 మొదటి పానిపట్టు యుద్ధం. బాబర్ చేతిలో ఇబ్రహీం లోడీ పరాజయం. మొగలు సామ్రాజ్య స్థాపన.
» 1527 కణ్వ యుద్ధం. ఇందులో రాణా సంగాను బాబర్ ఓడించాడు.
» 1530 బాబర్ మరణం. హుమాయున్ రాజ్యానికి వచ్చాడు.
» 1539 హుమాయున్ ను ఓడించి షేర్ షా సూరి భారత దేశ రాజ్యాధినేత అయ్యాడు.
» 1540 కనౌజ్ యుద్ధం
» 1555 ఢిల్లీ సింహాసనాన్ని హుమాయున్ తిరిగి దక్కించుకున్నాడు.
» 1556 రెండో పానిపట్టు యుద్ధం
» 1557 గోవాలో మొట్టమొదటి పుస్తక ప్రచురణ
» 1565 తల్లికోట యుద్ధం
» 1576 హల్దీఘాట్ యుద్ధం. అక్బర్ చేతిలో రాణా ప్రతాప్ ఓటమి.
» 1582 దీన్-ఇ-ఇలాహీ అనే కొత్త మతాన్ని అక్బర్ ఏర్పాటు చేశాడు.
» 1597 రాణా ప్రతాప్ మరణం
» 1600 ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన
» 1605 అక్బర్ మరణం. జహంగీర్ పాలన ప్రారంభం.
» 1611 నూర్జహన్ తో జహంగీర్ వివాహం.
» 1616 జహంగీర్ సభను సందర్శించిన సర్ థామస్ రో.

 

శివాజీ
» 1627 శివాజీ జననం. జహంగీర్ మరణం.
» 1628 షాజహన్ భారత దేశ చక్రవర్తి అయ్యాడు.
» 1631 ముంతాజ్ మహల్ మరణం.
» 1634 భారత దేశంలో బ్రిటిష్ వర్తకానికి బెంగాల్ లో అనుమతి.
» 1659 సింహాసనాన్ని అధిష్టించిన ఔరంగజేబు. షాజహాన్ కు జైలు శిక్ష
» 1665 శివాజీని ఖైదు చేసిన ఔరంగజేబు.
» 1666 షాజహన్ మరణం.
» 1675 సిక్కుల తొమ్మిదో గురువు తేజ్ బహదూర్ కి ఉరిశిక్ష
» 1680 శివాజీ మరణం.
» 1684 బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ బొంబాయిలో మొదటి ముద్రణాలయాన్ని స్థాపిచింది.
» 1707 ఔరంగజేబు మరణం.
» 1708 గురుగోవింద్ సింగ్ మరణం.
» 1780-84 రెండో మైసూర్ యుద్ధం.
» 1784 పిట్స్ చట్టం.
» 1790-92 మూడో మైసూర్ యుద్ధం
» 1793 బెంగాల్ శాశ్వత సెటిల్ మెంట్
» 1799 నాలుగో మైసూర్ యుద్ధం – టిప్పు సుల్తాన్ మరణం.
» 1802 బేసిన్ ఒప్పందం
» 1809 అమృతసర్ ఒప్పందం

 

రాజా రామమోహన్ రాయ్
» 1828 రాజారామమోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ఏర్పాటు.
» 1829 సతీసహగమన ఆచారం నిషేధం
» 1830 బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజారామమోహన్ రాయ్ ఇంగ్లండ్ సందర్శన
» 1833 రాజారామమోహన్ రాయ్ మరణం.
» 1838 కలకత్తాలో మొట్ట మొదటి నూలు మిల్లు ఏర్పాటు
» 1839 మహారాజా రంజిత్ సింగ్ మరణం
» 1839-42 మొదటి ఆగ్రా యుద్ధం
» 1845-46 మొదటి ఆంగ్లో – సిక్ యుద్ధం
» 1852 రెండో ఆంగ్లో – బర్మా యుద్ధం
» 1853 బాంబే, థానేల మధ్య మొదటి రైలు ప్రయాణం. కలకత్తాలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ ఏర్పాటు
» 1857 సిపాయి తిరుగుబాటు లేదా ప్రథమ స్వాతంత్ర్య పోరాటం
» 1861 రవీంద్రనాథ్ ఠాగూర్ జననం

 

రవీంద్రనాథ్ ఠాగూర్
» 1867 బొంబాయిలో డాక్టర్ ఆత్మారామ్ పాండురంగ ఆధ్వర్యంలో ప్రార్థనా సమాజ్ ఏర్పాటు.
» 1869 మహాత్మా గాంధీ జననం
» 1875 స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ఏర్పాటు; దివ్యజ్ఞాన సమాజం ఏర్పాటు.
» 1876 సురేంద్రనాథ్ బెనర్జీ భారతీయ సంఘం (ఇండియన్ అసోసియేషన్) ఏర్పాటు.
» 1885 భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన
» 1885 – 1905 మితవాద యుగం
» 1889 జవహర్ లాల్ నెహ్రూ జననం

 

స్వామి వివేకానంద
» 1893 చికాగోలో స్వామి వివేకానంద చరిత్రాత్మక ప్రసంగం.
» 1897 సుభాస్ చంద్రబోస్ జననం
» 1904 టిబెట్ యాత్ర
» 1905 లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో మొదటి బెంగాల్ విభజన
» 1906 ముస్లిం లీగ్ స్థాపన
» 1906 – 1920 అతివాద యుగం
» 1909 మింటో – మార్లే సంస్కరణలు
» 1911 ఢిల్లీ దర్బార్; బ్రిటిష్ రాజు, రాణి భారత సందర్శన; భారత్ రాజధానిగా ఢిల్లీ.
» 1913 గదర్ పార్టీ ఏర్పాటు
» 1914 మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం
» 1915 భారత దేశానికి గాంధీజీ రాక.
» 1916 కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య లక్నో ఒప్పందం; మద్రాస్ లో హోమ్ రూల్ లీగ్ ఏర్పాటు.
» 1917 చంపారన్ ఉద్యమం
» 1918 మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు
» 1919 మాంటేగ్ – ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలు, రౌలత్ చట్టం, అమృతసర్ లో జలియన్ వాలాభాగ్ ఉదంతం
» 1920 ఖిలాఫత్ ఉద్యమం
» 1921 ఉత్తర ప్రదేశ్ లో రైతుల పోరాటం, మోప్లా తిరుగుబాటు.
» 1922 చౌరీచౌరా సంఘటన, సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల.
» 1922 మొదటి కమ్యూనిస్టు పత్రిక సోషలిస్టు ప్రచురణ.
» 1926 భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపన.
» 1927 సైమన్ కమిషన్ బహిష్కరణ; భారత్ లో బ్రాడ్ కాస్టింగ్ ప్రారంభం.
» 1928 పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ మరణం
» 1929 మీరట్ కుట్ర కేసు
» 1929 లాహోర్ లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానం
» 1930 సహాయ నిరాకరణ ఉద్యమం, గాంధీజీ దండియాత్ర (ఏప్రిల్ 6); మొదటి రౌండ్ టేబుల్ సమావేశం.
» 1931 గాంధీ – ఇర్విన్ ఒప్పందం; రెండో రౌండ్ టేబుల్ సమావేశం.
» 1932 మూడో రౌండ్ టేబుల్ సమావేశం.
» 1935 భారత ప్రభుత్వ చట్టం రూపకల్పన
» 1937 ప్రొవిన్షియల్ అటానమీ.
» 1939 రెండో ప్రపంచ యద్ధం ప్రారంభం.
» 1941 రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం, సుభాస్ చంద్రబోస్ భారత దేశం నుంచి తప్పించుకొని వెళ్లిపోవడం.
» 1942 క్రిప్స్ మిషన్ ఇండియా రాక, ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం.
» 1942-44 ప్రొవిన్షియల్ అజాద్ హిందూ హుకూమత్ ను సుభాస్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు. అజాద్ హింద్ ఫౌజ్ ను కూడా బోస్ ఏర్పాటు చేశారు. బెంగాల్ లో తీవ్రమైన కరవు వచ్చింది.
» 1945 వేవెల్ ప్రణాళిక; సిమ్లా సమావేశం; ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ, సిమ్లా సమావేశం, రెండో ప్రపంచ యుద్ధం ముగింపు.
» 1946 క్యాబినెట్ మిషన్ భారత్ సందర్శన, కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు.
» 1947 అఖండ భారత్ విభజన. రెండు దేశాలుగా భారత్, పాకిస్థాన్ ఆవిర్భావం.
» 1948 గాంధీజీ హత్య (జనవరి 30), దేశవ్యాప్తంగా సంస్థానాల విలీనం.
» 1949 కశ్మీర్ లో శాంతిస్థాపనకు అంగీకారం, భారత రాజ్యాంగానికి ఆమోదం (నవంబరు 26)
» 1950 గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భావం (జనవరి 26న), భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
» 1951 మొదటి పంచవర్ష ప్రణాళిక. ఢిల్లీలో మొదటి ఆసియా క్రీడల నిర్వహణ.
» 1952 లోక్ సభకు మొదటి సాధారణ ఎన్నికల నిర్వహణ.
» 1956 రెండో పంచ వర్ష ప్రణాళిక ప్రారంభం.
» 1957 దేశ వ్యాప్తంగా రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ, గోవా విముక్తి
» 1963 పదహారో రాష్ట్రంగా నాగాలాండ్ ఆవిర్భావం.

 

లాల్ బహదూర్ శాస్త్రి
» 1964 జవహర్ లాల్ నెహ్రూ మరణం; ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి.
» 1965 భారత్ పై పాకిస్థాన్ దాడి
» 1966 తాష్కెంట్ ఒప్పందం, లాల్ బహదూర్ శాస్త్రి మరణం, భారత ప్రధానిగా ఇందిరాగాంధీ.

 

ఇందిరా గాంధీ
» 1967 నాలుగో సాధారణ ఎన్నికలు. మూడో రాష్ట్రపతిగా డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఎన్నిక.
» 1969 భారత రాష్ట్రపతిగా వి.వి. గిరి ఎన్నిక, బ్యాంకుల జాతీయీకరణ.
» 1970 రాష్ట్రంగా మేఘాలయ
» 1971 కొత్త రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్, భారత్ – పాక్ యుద్ధం, కొత్త దేశంగా బంగ్లాదేశ్.
» 1972 సిమ్లా ఒప్పందం; సి. రాజగోపాలాచారి మరణం.
» 1973 మైసూర్ రాష్ట్రానికి కర్ణాటకగా పేరు మార్పు.
» 1974 భారత్ లో అణ్వస్త్ర ప్రయోగం, అయిదో రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.
» 1975 ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం, 22వ రాష్ట్రంగా సిక్కిం. ఎమర్జెన్సీ ప్రకటన.
» 1976 భారత్ – చైనా మధ్య దౌత్య సంబంధాలు.
» 1977 ఆరో సాధారణ ఎన్నికలు, లోక్ సభలో జనతా పార్టీ ఆధిక్యం, ఆరో రాష్ట్రపతిగా నీలం 
సంజీవరెడ్డి.
» 1979 ప్రధాని పదవికి మొరార్జీ దేశాయ్ రాజీనామా, ప్రధాన మంత్రిగా చరణ్ సింగ్, ఆగస్టు 20న చరణ్ సింగ్ రాజీనామా, ఆరో లోక్ సభ రద్దు.
» 1980 ఏడో సాధారణ ఎన్నికలు; అధికారంలోకి కాంగ్రెస్ (ఐ), ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీ; విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం; ఎస్ ఎల్ వి – 3 ద్వారా రోహిణి ఉపగ్రహ ప్రయోగం.
» 1982 మార్చి 19న ఆచార్య జె.బి. కృపలానీ మరణం; ఇన్ శాట్ – 1ఏ ప్రయోగం; జులై 15న రాష్ట్రపతిగా జైల్ సింగ్; నవంబరు 5న గుజరాత్ లో తుపాను వల్ల 500 మంది మరణం; నవంబరు 15న ఆచార్య వినోబా మరణం; నవంబరు 19న తొమ్మిదో ఆసియా క్రీడలు ప్రారంభం.
» 1983 ఢిల్లీలో చోగమ్ సదస్సు
» 1984 పంజాబ్ లో ఆపరేషన్ బ్లూస్టార్; అంతరిక్షంలోకి రాకేశ్ శర్మ; ఇందిరాగాంధీ హత్య, ప్రధానిగా రాజీవ్ గాంధీ.

 

రాజీవ్ గాంధీ
» 1985 రాజీవ్ – లోంగోవాలా సంధి; అసోం ఒప్పందం; ఏడో పంచ వర్ష ప్రణాళిక; పార్టీ ఫిరాయింపుల చట్టం.
» 1986 మిజోరాం ఒప్పందం
» 1987 రాష్ట్రపతిగా ఆర్.వెంకట్రామన్, ఉప రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ, బోఫోర్స్ గన్, ఫెయిర్ ఫాక్స్ వివాదాలు.
» 1989 అయోధ్యలో రామ శిలాన్యాస పూజ; మొదటి సారిగా భారత్ ఐఆర్ బిఎమ్ ‘అగ్ని’ ని ఒడిశా నుంచి విజయవంతంగా ప్రయోగించారు (మార్చి 22). జూన్ 5న త్రిశూల్ క్షిపణి ప్రయోగం, సెప్టెంబరు 27న పృథ్వి రెండోసారి ప్రయోగం విజయవంతం; నవంబరు 29న ఎన్నికల్లో ఓడిపోయిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు; జవహర్ రోజ్ గార్ యోజన ప్రారంభం; నేషనల్ ఫ్రంట్ నాయకుడు వి.పి. సింగ్ ఏడో ప్రధానిగా ఎన్నిక.
» 1990 వెనక్కి వచ్చిన భారత శాంతి దళం; ఇండియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఎ-320 ప్రమాదం; జనతా దళ్ విభజన; ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న బీజేపీ; అద్వాణీ రథయాత్ర-అరెస్టు; మండల్ కమిటీ నివేదిక అమలును ప్రకటించిన వి.పి.సింగ్; రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో అయోధ్యలో హింసాకాండ.
» 1991 జనవరి 17న గల్ఫ్ యుద్ధం; మే 21న రాజీవ్ గాంధీ హత్య; జూన్ 20న పదో లోక్ సభ ఏర్పాటు; ప్రధాన మంత్రిగా పీవీ నరసింహారావు.

 

పీవీ నరసింహారావు
» 1992 ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాల ఏర్పాటు; ఏప్రిల్ 23న భారతరత్న, ఆస్కార్ అవార్డు గ్రహీత సత్యజిత్ రే మరణం; జులై 25న రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ ఎన్నిక; ఫిబ్రవరి 7న మొదటి సారిగా భారత్ స్వదేశీయంగా తయారు చేసిన ఐఎన్ ఎస్ శక్తి సబ్ మెరైన్ ప్రారంభం.
» 1993 జనవరి 29న అయోధ్యలో 67.33 ఎకరాల స్వాధీనానికి ఆర్డినెన్స్; ముంబయిలో వరుస బాంబు పేలుళ్లు – 300 మృతి; మహారాష్ట్ర లో భూ కంపం.
» 1994 పౌర విమానయానంపై ఏకస్వామ్యానికి ముగింపు పలికిన ప్రభుత్వం; గ్యాట్ ఒప్పందంపై వివాదాలు; ప్లేగు వ్యాధి వ్యాప్తి; మిస్ యూనివర్స్ గా సుస్మితాసేన్, మిస్ వరల్డ్ గా ఐశ్వర్యరాయ్
» 1995 ఉత్తర ప్రదేశ్ లో మొదటి దళిత ముఖ్యమంత్రిగా మాయావతి; మహారాష్ట్ర, గుజరాత్ లలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు; కర్ణాటకలో జనతా దళ్, ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటు; మాయవతి ప్రభుత్వం పడిపోవడంతో ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధింపు; ఇన్ శాట్ 2సి, ఐఆర్ ఎస్1-సి ప్రయోగాలు.
» 1996 హవాలా కుంభకోణం; పీఎస్ ఎల్ వీ డీ3 ప్రయోగం; పదకొండో లోక్ సభ ఎన్నికలు; అతి పెద్ద పార్టీగా బీజేపీ.
» 1997 భారత దేశపు 50 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

 

అటల్ బిహారి వాజ్ పేయీ
» 1998 మదర్ థెరిసా మరణం; భారత ప్రధానిగా వాజ్ పేయీ; పోఖ్రాన్-2 అణు పరీక్షలు.
» 1999 డిసెంబరు 24న భారత విమానం ఐసీ – 814 హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లిన అఫ్ఘనిస్థాన్ తీవ్రవాదులు; ఆ విమాన ప్రయాణికులు, సిబ్బంది విడుదల కోసం ముగ్గురు మిలిటెంట్లను భారత ప్రభుత్వం జూన్ లో జైలు నుంచి విడుదల చేసింది; పాకిస్థాన్ అక్రమ నిర్బంధం నుంచి ఎనిమిది రోజుల తర్వాత ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ నచికేత విడుదల; పాకిస్థాన్ దురాక్రమణలను నిరోధించడానికి కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ విజయ్ తో విజయం సాధించిన ఇండియన్ ఆర్మీ.
» 2000 అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ పర్యటన; చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ రాష్ట్రాల ఆవిర్భావం; 100 కోట్లు దాటిన భారత్ జనాభా.
» 2001 జులైలో భారత్- పాకిస్థాన్ ల మధ్య ఆగ్రా సదస్సు; జనవరిలో గుజరాత్ భూకంపం; మార్చిలో ఆయుధాల ఒప్పందంలో ఆర్మీ ఆఫీసర్లు, మంత్రుల అక్రమాలను బయటపెట్టిన తెహల్కా; స్వాతంత్ర్యానంతరం ఆరో జనాభా లెక్కలు.
» 2002 అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నిక. ఫిబ్రవరి 27న గుజరాత్ లోని గోద్రా లో మత కలహాలు; నేషనల్ వాటర్ పాలసీ ప్రకటన.

 

అబ్దుల్ కలాం
» 2003 ఇన్ శాట్ – 3ఏ ప్రయోగం విజయవంతం; వైట్ కాలర్ నేరాలను అరికట్టడానికి ఆర్థిక ఇంటెలిజెన్స్ విభాగాన్ని సీబీఐ ఏర్పాటు చేసింది; ఇన్ శాట్ -3ఇ ప్రయోగం సఫలం.
» 2004 సాధారణ ఎన్నికల్లో ఎన్ డీఏ పరాజయం; మన్మోహన్ సింగ్ ప్రధానిగా ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్.