100+ భారత దేశ చరిత్రలో ముఖ్య సంఘటనలు AP GK Questions in Telugu

భారత దేశ చరిత్రలో ముఖ్య సంఘటనలు

క్రీస్తు పూర్వం
» 3000-1500 – సింధునాగరికత కాలం

 

బుద్ధుడు
» 576 – బుద్ధుడి జననం
» 527 – మహావీరుడి జననం
» 327-326 – భారత దేశంపైకి అలెగ్జాండర్ దండయాత్ర. దీని వల్ల యూరోప్ నుంచి మన దేశానికి భూమార్గం మొదటిసారి ఏర్పడింది.
» 313 – జైన గ్రంథాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు సింహాసనం అధిష్టించిన సంవత్సరం.
» 305 – సెల్యుకస్ నికెటర్ ను చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడు.
» 273 – 232 – అశోకుడి పాలన
» 145 – 101 – చోళ వంశానికి చెందిన శ్రీలంక రాజు ఎలరా పాలన కాలం.
» 58 – విక్రమ శకం ప్రారంభం
క్రీస్తు శకం
» 78 – శక యుగం ప్రారంభం
» 120 – కనిష్కుడి పట్టాభిషేకం
» 320 – గుప్తుల పాల ప్రారంభం (భారత్ లో స్వర్ణయుగం)
» 380 – విక్రమాధిత్యుడి పట్టాభిషేకం
» 405-411 – ఫాహియాన్ భారత సందర్శన
» 415 – మొదటి కుమారగుప్తుడి పట్టాభిషేకం
» 455 – స్కందగుప్తుడి పట్టాభిషేకం
» 606-647 – హర్షవర్థనుడి పాలనా కాలం
» 712 – మొదటిసారిగా భారత దేశం పై అరబ్బుల దండయాత్ర
» 836 – కనౌజ్ లో భోజరాజు పట్టాభిషేకం
»985 – రాజరాజచోళుడి పట్టాభిషేకం
» 998 – సుల్తాన్ మహమ్మద్ పట్టాభిషేకం
» 1001 – భారత దేశంపై గజనీ మహమ్మద్ మొదటి దండయాత్ర. ఇందులో పంజాబ్ రాజు జయపాలుడిని గజనీ ఓడించాడు.
» 1025 – గజనీ మహమ్మద్ దండయాత్రలో సోమనాథ దేవాలయం ధ్వంసం.
» 1191 – మొదటి తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ చౌహాన్ ల మధ్య జరిగింది. 
పృథ్విరాజ్ విజయం సాధించాడు.
» 1192 – తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ ల మధ్య జరిగింది. ఈసారి విజయం ఘోరీ మహమ్మద్ ను వరించింది.
» 1206 – కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. బానిస వంశ స్థాపన
» 1210 – కుతుబుద్దీన్ ఐబక్ మరణం
» 1221 – భారత దేశంపై మంగోలుల దండయాత్ర. ఛెంఘిజ్ ఖాన్ దండెత్తి వచ్చాడు.
» 1236 – రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించింది.
» 1240 – రజియా సుల్తానా మరణం.
» 1246 – బాల్బన్ పాలన ప్రారంభం
» 1296 – అల్లాఉద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఎక్కాడు.
» 1316 – అల్లాఉద్దీన్ ఖిల్జీ మరణం.
» 1325 – మహమ్మద్ బీన్ తుగ్లక్ పాలన ప్రారంభం.
» 1327 – తుగ్లక్ పాలనలో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు రాజధాని మార్పు.
» 1336 – దక్షిణాదిన విజయనగర సామ్రజ్యానికి పునాదులు.
» 1351 – ఫిరోజ్ షా సింహాసనానికి వచ్చాడు.
» 1388 – ఫిరోజ్ తుగ్లక్ మరణం
» 1398 – భారత్ పై తైమూర్ దండయాత్రలు

 

గురునానక్
» 1469 – గురునానక్ జననం
» 1494 – ఫర్ఘానాలో సింహాసనాన్ని అధిష్టించిన బాబర్.
» 1497-98 – భారత దేశానికి సముద్రమార్గం కనుగొన్న వాస్కొడిగామా.
» 1526 – మొదటి పానిపట్టు యుద్ధం. బాబర్ చేతిలో ఇబ్రహీం లోడీ పరాజయం. మొగలు సామ్రాజ్య స్థాపన.
» 1527 – కణ్వ యుద్ధం. ఇందులో రాణా సంగాను బాబర్ ఓడించాడు.
» 1530 – బాబర్ మరణం. హుమాయున్ రాజ్యానికి వచ్చాడు.
» 1539 – హుమాయున్ ను ఓడించి షేర్ షా సూరి భారత దేశ రాజ్యాధినేత అయ్యాడు.
» 1540 – కనౌజ్ యుద్ధం
» 1555 – ఢిల్లీ సింహాసనాన్ని హుమాయున్ తిరిగి దక్కించుకున్నాడు.
» 1556 – రెండో పానిపట్టు యుద్ధం
» 1557 – గోవాలో మొట్టమొదటి పుస్తక ప్రచురణ
» 1565 – తల్లికోట యుద్ధం
» 1576 – హల్దీఘాట్ యుద్ధం. అక్బర్ చేతిలో రాణా ప్రతాప్ ఓటమి.
» 1582 – దీన్-ఇ-ఇలాహీ అనే కొత్త మతాన్ని అక్బర్ ఏర్పాటు చేశాడు.
» 1597 – రాణా ప్రతాప్ మరణం
» 1600 – ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన
» 1605 – అక్బర్ మరణం. జహంగీర్ పాలన ప్రారంభం.
» 1611 – నూర్జహన్ తో జహంగీర్ వివాహం.
» 1616 – జహంగీర్ సభను సందర్శించిన సర్ థామస్ రో.

 

శివాజీ
» 1627 – శివాజీ జననం. జహంగీర్ మరణం.
» 1628 – షాజహన్ భారత దేశ చక్రవర్తి అయ్యాడు.
» 1631 – ముంతాజ్ మహల్ మరణం.
» 1634 – భారత దేశంలో బ్రిటిష్ వర్తకానికి బెంగాల్ లో అనుమతి.
» 1659 – సింహాసనాన్ని అధిష్టించిన ఔరంగజేబు. షాజహాన్ కు జైలు శిక్ష
» 1665 – శివాజీని ఖైదు చేసిన ఔరంగజేబు.
» 1666 – షాజహన్ మరణం.
» 1675 – సిక్కుల తొమ్మిదో గురువు తేజ్ బహదూర్ కి ఉరిశిక్ష
» 1680 – శివాజీ మరణం.
» 1684 – బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ బొంబాయిలో మొదటి ముద్రణాలయాన్ని స్థాపిచింది.
» 1707 – ఔరంగజేబు మరణం.
» 1708 – గురుగోవింద్ సింగ్ మరణం.
» 1780-84 – రెండో మైసూర్ యుద్ధం.
» 1784 – పిట్స్ చట్టం.
» 1790-92 – మూడో మైసూర్ యుద్ధం
» 1793 – బెంగాల్ శాశ్వత సెటిల్ మెంట్
» 1799 – నాలుగో మైసూర్ యుద్ధం – టిప్పు సుల్తాన్ మరణం.
» 1802 – బేసిన్ ఒప్పందం
» 1809 – అమృతసర్ ఒప్పందం

 

రాజా రామమోహన్ రాయ్
» 1828 – రాజారామమోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ఏర్పాటు.
» 1829 – సతీసహగమన ఆచారం నిషేధం
» 1830 – బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజారామమోహన్ రాయ్ ఇంగ్లండ్ సందర్శన
» 1833 – రాజారామమోహన్ రాయ్ మరణం.
» 1838 – కలకత్తాలో మొట్ట మొదటి నూలు మిల్లు ఏర్పాటు
» 1839 – మహారాజా రంజిత్ సింగ్ మరణం
» 1839-42 – మొదటి ఆగ్రా యుద్ధం
» 1845-46 – మొదటి ఆంగ్లో – సిక్ యుద్ధం
» 1852 – రెండో ఆంగ్లో – బర్మా యుద్ధం
» 1853 – బాంబే, థానేల మధ్య మొదటి రైలు ప్రయాణం. కలకత్తాలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ ఏర్పాటు
» 1857 – సిపాయి తిరుగుబాటు లేదా ప్రథమ స్వాతంత్ర్య పోరాటం
» 1861 – రవీంద్రనాథ్ ఠాగూర్ జననం

 

రవీంద్రనాథ్ ఠాగూర్
» 1867 – బొంబాయిలో డాక్టర్ ఆత్మారామ్ పాండురంగ ఆధ్వర్యంలో ప్రార్థనా సమాజ్ ఏర్పాటు.
» 1869 – మహాత్మా గాంధీ జననం
» 1875 – స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ఏర్పాటు; దివ్యజ్ఞాన సమాజం ఏర్పాటు.
» 1876 – సురేంద్రనాథ్ బెనర్జీ భారతీయ సంఘం (ఇండియన్ అసోసియేషన్) ఏర్పాటు.
» 1885 – భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన
» 1885 – 1905 – మితవాద యుగం
» 1889 – జవహర్ లాల్ నెహ్రూ జననం

 

స్వామి వివేకానంద
» 1893 – చికాగోలో స్వామి వివేకానంద చరిత్రాత్మక ప్రసంగం.
» 1897 – సుభాస్ చంద్రబోస్ జననం
» 1904 – టిబెట్ యాత్ర
» 1905 – లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో మొదటి బెంగాల్ విభజన
» 1906 – ముస్లిం లీగ్ స్థాపన
» 1906 – 1920 – అతివాద యుగం
» 1909 – మింటో – మార్లే సంస్కరణలు
» 1911 – ఢిల్లీ దర్బార్; బ్రిటిష్ రాజు, రాణి భారత సందర్శన; భారత్ రాజధానిగా ఢిల్లీ.
» 1913 – గదర్ పార్టీ ఏర్పాటు
» 1914 – మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం
» 1915 – భారత దేశానికి గాంధీజీ రాక.
» 1916 – కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య లక్నో ఒప్పందం; మద్రాస్ లో హోమ్ రూల్ లీగ్ ఏర్పాటు.
» 1917 – చంపారన్ ఉద్యమం
» 1918 – మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు
» 1919 – మాంటేగ్ – ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలు, రౌలత్ చట్టం, అమృతసర్ లో జలియన్ వాలాభాగ్ ఉదంతం
» 1920 – ఖిలాఫత్ ఉద్యమం
» 1921 – ఉత్తర ప్రదేశ్ లో రైతుల పోరాటం, మోప్లా తిరుగుబాటు.
» 1922 – చౌరీచౌరా సంఘటన, సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల.
» 1922 – మొదటి కమ్యూనిస్టు పత్రిక సోషలిస్టు ప్రచురణ.
» 1926 – భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపన.
» 1927 – సైమన్ కమిషన్ బహిష్కరణ; భారత్ లో బ్రాడ్ కాస్టింగ్ ప్రారంభం.
» 1928 – పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ మరణం
» 1929 – మీరట్ కుట్ర కేసు
» 1929 – లాహోర్ లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానం
» 1930 – సహాయ నిరాకరణ ఉద్యమం, గాంధీజీ దండియాత్ర (ఏప్రిల్ 6); మొదటి రౌండ్ టేబుల్ సమావేశం.
» 1931 – గాంధీ – ఇర్విన్ ఒప్పందం; రెండో రౌండ్ టేబుల్ సమావేశం.
» 1932 – మూడో రౌండ్ టేబుల్ సమావేశం.
» 1935 – భారత ప్రభుత్వ చట్టం రూపకల్పన
» 1937 – ప్రొవిన్షియల్ అటానమీ.
» 1939 – రెండో ప్రపంచ యద్ధం ప్రారంభం.
» 1941 – రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం, సుభాస్ చంద్రబోస్ భారత దేశం నుంచి తప్పించుకొని వెళ్లిపోవడం.
» 1942 – క్రిప్స్ మిషన్ ఇండియా రాక, ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం.
» 1942-44 – ప్రొవిన్షియల్ అజాద్ హిందూ హుకూమత్ ను సుభాస్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు. అజాద్ హింద్ ఫౌజ్ ను కూడా బోస్ ఏర్పాటు చేశారు. బెంగాల్ లో తీవ్రమైన కరవు వచ్చింది.
» 1945 – వేవెల్ ప్రణాళిక; సిమ్లా సమావేశం; ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ, సిమ్లా సమావేశం, రెండో ప్రపంచ యుద్ధం ముగింపు.
» 1946 – క్యాబినెట్ మిషన్ భారత్ సందర్శన, కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు.
» 1947 – అఖండ భారత్ విభజన. రెండు దేశాలుగా భారత్, పాకిస్థాన్ ఆవిర్భావం.
» 1948 – గాంధీజీ హత్య (జనవరి 30), దేశవ్యాప్తంగా సంస్థానాల విలీనం.
» 1949 – కశ్మీర్ లో శాంతిస్థాపనకు అంగీకారం, భారత రాజ్యాంగానికి ఆమోదం (నవంబరు 26)
» 1950 – గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భావం (జనవరి 26న), భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
» 1951 – మొదటి పంచవర్ష ప్రణాళిక. ఢిల్లీలో మొదటి ఆసియా క్రీడల నిర్వహణ.
» 1952 – లోక్ సభకు మొదటి సాధారణ ఎన్నికల నిర్వహణ.
» 1956 – రెండో పంచ వర్ష ప్రణాళిక ప్రారంభం.
» 1957 – దేశ వ్యాప్తంగా రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ, గోవా విముక్తి
» 1963 – పదహారో రాష్ట్రంగా నాగాలాండ్ ఆవిర్భావం.

 

లాల్ బహదూర్ శాస్త్రి
» 1964 – జవహర్ లాల్ నెహ్రూ మరణం; ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి.
» 1965 – భారత్ పై పాకిస్థాన్ దాడి
» 1966 – తాష్కెంట్ ఒప్పందం, లాల్ బహదూర్ శాస్త్రి మరణం, భారత ప్రధానిగా ఇందిరాగాంధీ.

 

ఇందిరా గాంధీ
» 1967 – నాలుగో సాధారణ ఎన్నికలు. మూడో రాష్ట్రపతిగా డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఎన్నిక.
» 1969 – భారత రాష్ట్రపతిగా వి.వి. గిరి ఎన్నిక, బ్యాంకుల జాతీయీకరణ.
» 1970 – రాష్ట్రంగా మేఘాలయ
» 1971 – కొత్త రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్, భారత్ – పాక్ యుద్ధం, కొత్త దేశంగా బంగ్లాదేశ్.
» 1972 – సిమ్లా ఒప్పందం; సి. రాజగోపాలాచారి మరణం.
» 1973 – మైసూర్ రాష్ట్రానికి కర్ణాటకగా పేరు మార్పు.
» 1974 – భారత్ లో అణ్వస్త్ర ప్రయోగం, అయిదో రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.
» 1975 – ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం, 22వ రాష్ట్రంగా సిక్కిం. ఎమర్జెన్సీ ప్రకటన.
» 1976 – భారత్ – చైనా మధ్య దౌత్య సంబంధాలు.
» 1977 – ఆరో సాధారణ ఎన్నికలు, లోక్ సభలో జనతా పార్టీ ఆధిక్యం, ఆరో రాష్ట్రపతిగా నీలం 
సంజీవరెడ్డి.
» 1979 – ప్రధాని పదవికి మొరార్జీ దేశాయ్ రాజీనామా, ప్రధాన మంత్రిగా చరణ్ సింగ్, ఆగస్టు 20న చరణ్ సింగ్ రాజీనామా, ఆరో లోక్ సభ రద్దు.
» 1980 – ఏడో సాధారణ ఎన్నికలు; అధికారంలోకి కాంగ్రెస్ (ఐ), ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీ; విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం; ఎస్ ఎల్ వి – 3 ద్వారా రోహిణి ఉపగ్రహ ప్రయోగం.
» 1982 – మార్చి 19న ఆచార్య జె.బి. కృపలానీ మరణం; ఇన్ శాట్ – 1ఏ ప్రయోగం; జులై 15న రాష్ట్రపతిగా జైల్ సింగ్; నవంబరు 5న గుజరాత్ లో తుపాను వల్ల 500 మంది మరణం; నవంబరు 15న ఆచార్య వినోబా మరణం; నవంబరు 19న తొమ్మిదో ఆసియా క్రీడలు ప్రారంభం.
» 1983 – ఢిల్లీలో చోగమ్ సదస్సు
» 1984 – పంజాబ్ లో ఆపరేషన్ బ్లూస్టార్; అంతరిక్షంలోకి రాకేశ్ శర్మ; ఇందిరాగాంధీ హత్య, ప్రధానిగా రాజీవ్ గాంధీ.

 

రాజీవ్ గాంధీ
» 1985 – రాజీవ్ – లోంగోవాలా సంధి; అసోం ఒప్పందం; ఏడో పంచ వర్ష ప్రణాళిక; పార్టీ ఫిరాయింపుల చట్టం.
» 1986 – మిజోరాం ఒప్పందం
» 1987 – రాష్ట్రపతిగా ఆర్.వెంకట్రామన్, ఉప రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ, బోఫోర్స్ గన్, ఫెయిర్ ఫాక్స్ వివాదాలు.
» 1989 – అయోధ్యలో రామ శిలాన్యాస పూజ; మొదటి సారిగా భారత్ ఐఆర్ బిఎమ్ ‘అగ్ని’ ని ఒడిశా నుంచి విజయవంతంగా ప్రయోగించారు (మార్చి 22). జూన్ 5న త్రిశూల్ క్షిపణి ప్రయోగం, సెప్టెంబరు 27న పృథ్వి రెండోసారి ప్రయోగం విజయవంతం; నవంబరు 29న ఎన్నికల్లో ఓడిపోయిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు; జవహర్ రోజ్ గార్ యోజన ప్రారంభం; నేషనల్ ఫ్రంట్ నాయకుడు వి.పి. సింగ్ ఏడో ప్రధానిగా ఎన్నిక.
» 1990 – వెనక్కి వచ్చిన భారత శాంతి దళం; ఇండియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఎ-320 ప్రమాదం; జనతా దళ్ విభజన; ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న బీజేపీ; అద్వాణీ రథయాత్ర-అరెస్టు; మండల్ కమిటీ నివేదిక అమలును ప్రకటించిన వి.పి.సింగ్; రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో అయోధ్యలో హింసాకాండ.
» 1991 – జనవరి 17న గల్ఫ్ యుద్ధం; మే 21న రాజీవ్ గాంధీ హత్య; జూన్ 20న పదో లోక్ సభ ఏర్పాటు; ప్రధాన మంత్రిగా పీవీ నరసింహారావు.

 

పీవీ నరసింహారావు
» 1992 – ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాల ఏర్పాటు; ఏప్రిల్ 23న భారతరత్న, ఆస్కార్ అవార్డు గ్రహీత సత్యజిత్ రే మరణం; జులై 25న రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ ఎన్నిక; ఫిబ్రవరి 7న మొదటి సారిగా భారత్ స్వదేశీయంగా తయారు చేసిన ఐఎన్ ఎస్ శక్తి సబ్ మెరైన్ ప్రారంభం.
» 1993 – జనవరి 29న అయోధ్యలో 67.33 ఎకరాల స్వాధీనానికి ఆర్డినెన్స్; ముంబయిలో వరుస బాంబు పేలుళ్లు – 300 మృతి; మహారాష్ట్ర లో భూ కంపం.
» 1994 – పౌర విమానయానంపై ఏకస్వామ్యానికి ముగింపు పలికిన ప్రభుత్వం; గ్యాట్ ఒప్పందంపై వివాదాలు; ప్లేగు వ్యాధి వ్యాప్తి; మిస్ యూనివర్స్ గా సుస్మితాసేన్, మిస్ వరల్డ్ గా ఐశ్వర్యరాయ్
» 1995 – ఉత్తర ప్రదేశ్ లో మొదటి దళిత ముఖ్యమంత్రిగా మాయావతి; మహారాష్ట్ర, గుజరాత్ లలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు; కర్ణాటకలో జనతా దళ్, ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటు; మాయవతి ప్రభుత్వం పడిపోవడంతో ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధింపు; ఇన్ శాట్ 2సి, ఐఆర్ ఎస్1-సి ప్రయోగాలు.
» 1996 – హవాలా కుంభకోణం; పీఎస్ ఎల్ వీ డీ3 ప్రయోగం; పదకొండో లోక్ సభ ఎన్నికలు; అతి పెద్ద పార్టీగా బీజేపీ.
» 1997 – భారత దేశపు 50 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

 

అటల్ బిహారి వాజ్ పేయీ
» 1998 – మదర్ థెరిసా మరణం; భారత ప్రధానిగా వాజ్ పేయీ; పోఖ్రాన్-2 అణు పరీక్షలు.
» 1999 – డిసెంబరు 24న భారత విమానం ఐసీ – 814 హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లిన అఫ్ఘనిస్థాన్ తీవ్రవాదులు; ఆ విమాన ప్రయాణికులు, సిబ్బంది విడుదల కోసం ముగ్గురు మిలిటెంట్లను భారత ప్రభుత్వం జూన్ లో జైలు నుంచి విడుదల చేసింది; పాకిస్థాన్ అక్రమ నిర్బంధం నుంచి ఎనిమిది రోజుల తర్వాత ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ నచికేత విడుదల; పాకిస్థాన్ దురాక్రమణలను నిరోధించడానికి కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ విజయ్ తో విజయం సాధించిన ఇండియన్ ఆర్మీ.
» 2000 – అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ పర్యటన; చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ రాష్ట్రాల ఆవిర్భావం; 100 కోట్లు దాటిన భారత్ జనాభా.
» 2001 – జులైలో భారత్- పాకిస్థాన్ ల మధ్య ఆగ్రా సదస్సు; జనవరిలో గుజరాత్ భూకంపం; మార్చిలో ఆయుధాల ఒప్పందంలో ఆర్మీ ఆఫీసర్లు, మంత్రుల అక్రమాలను బయటపెట్టిన తెహల్కా; స్వాతంత్ర్యానంతరం ఆరో జనాభా లెక్కలు.
» 2002 – అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నిక. ఫిబ్రవరి 27న గుజరాత్ లోని గోద్రా లో మత కలహాలు; నేషనల్ వాటర్ పాలసీ ప్రకటన.

 

అబ్దుల్ కలాం
» 2003 – ఇన్ శాట్ – 3ఏ ప్రయోగం విజయవంతం; వైట్ కాలర్ నేరాలను అరికట్టడానికి ఆర్థిక ఇంటెలిజెన్స్ విభాగాన్ని సీబీఐ ఏర్పాటు చేసింది; ఇన్ శాట్ -3ఇ ప్రయోగం సఫలం.
» 2004 – సాధారణ ఎన్నికల్లో ఎన్ డీఏ పరాజయం; మన్మోహన్ సింగ్ ప్రధానిగా ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్.
  100+ జాతీయ దినోత్సవాలు AP GK Questions in Telugu

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top