| ఆస్కారియాసిస్ |
|
| » ‘ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్’ అనే హెల్మింథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది. |
|
| » ‘ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్’ను ‘ఏలిక పాము’ అని కూడా అంటారు. |
| » అపరిశుభ్రత వల్ల ఇది శరీరంలోకి ప్రవేశిస్తుంది. |
| » ఈ పరాన్నజీవి మానవుడి పేగులో ఉండి రోజుకు 2 లక్షల గుడ్లను పెడుతుంది. ఈ చర్య వల్ల ఆహార రవాణాలో ఆటంకం ఏర్పడి కడుపు నొప్పి, చిన్న పిల్లల్లో రక్తహీనత సంభవిస్తుంది. |
|
| ఎంటరోబియాసిస్ |
|
| » ‘ఎంటరోబియస్ వర్మిక్యులారిస్’ అనే హెల్మింథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది. |
|
| » ఈ వ్యాధినే ‘పిన్వార్మ్ వ్యాధి’ అని కూడా అంటారు. |
|
| » ఈ వ్యాధి వల్ల దురద, పాయువు చుట్టూ చీరుకుపోవడం, నిద్రలేమి, ఉండుకం (అపెండిక్స్) వాయడం సంభవిస్తాయి. |
|
| ఎంఖైలోస్టోమియాసిస్ |
|
| » ‘ఎంఖైలోస్టోమా డుయోడినేల్’ అనే హెల్మింథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది. |
|
| » చెప్పులు లేకుండా మల మూత్రాలు చేసే ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఈ వ్యాధి జనక లార్వా (ఫెలేరిఫాం లార్వా) శరీరంలోకి ప్రవేశించి మానవుడి చిన్నపేగులో ఆవాసం ఏర్పరచుకుంటుంది. |
|
| » చర్మంపై ఎర్రని, దురద పుట్టించే పుండ్లు; రక్తహీనత, మలబద్ధకం, ఆంత్రమూలంలో పుండ్లు ఈ వ్యాధి వల్ల సంభవిస్తాయి. |
|
| షిస్టోసోమియాసిస్ |
|
| » ‘షిస్టోసోమా హిమటోబియమ్’ అనే హెల్మింథిస్ వ్యాధికారకంగా పనిచేస్తుంది. |
|
| » ఈ వ్యాధిని ‘బిల్హర్జియాసిస్’ అని కూడా అంటారు. |
|
| » ఈ వ్యాధి సంక్రమణకు ‘బులినస్’ అనే నత్త సహకరిస్తుంది. |
|
| » ఈ వ్యాధికి ‘స్విమ్మర్స్ ఇచ్’ అనే మరో పేరు కూడా కలదు. |
|
| » ఈ వ్యాధి జనకం మూత్రాశయం, శ్రోణి సిరల్లో నివసిస్తుంది. |
|
| » జ్వరం, కాలేయం, వాపు, మూత్రంతోపాటు రక్తం పడటం; దురద, మంట లాంటి లక్షణాలు ఈ వ్యాధి ద్వారా సంక్రమిస్తాయి. |
|
| ఫైలేరియాసిస్ |
|
| » ఈ వ్యాధికి బోదకాలు, ఎలిఫెంటియాసిస్ అనే పేర్లు ఉన్నాయి. |
|
| » ‘ఉచరేరియా బ్రాంకాఫ్టి’ అనే హెల్మింథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది. |
| » శోషరస నాళాలు, శోష కణాల్లో ఇది నివసిస్తుంది. |
| » ఈ వ్యాధి వల్ల కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలు ఉబ్బుతాయి. |
|
| టీనియాసిస్ |
|
| » ‘టీనియా సోలియం’ అనే హెల్మింథిస్ ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది. |
|
| » సరిగా ఉడికించని పంది మాంసం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. |
| » కడుపు నొప్పి, అజీర్తి, మలబద్ధకం అనే లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి. |